Monday, 20 June 2016


ఆనందుడతడు...



కల్లోలమెరుగని కమనీయ కాంతుడు

విశ్వవీణను శ్రుతిచేసి

శాంతి లయను ఆలపించున    

నియము నియతి గల

అభ్యుదయార్ధ్రశీలుడతడు.

 అంగుత్తరం అభిమానముగా కీర్తించిన

అసమాన నిరాడంబర మూర్తి

అనుయాయుల స్నేహస్పూర్తి,

తధాగతుని బంధు మిత్ర శిష్య పరివారమతడు,

బుద్ధపాద పరిష్వంగుడు, ఆనందుడతడు.



నల్గురూ ఆశ్రమమున  అనుచితముగా

అసంపూర్ణుడని తలచినా, అనురాగాలోలుడై

 అనునిత్యభోధనలను ఔపాసన చేసి

అనుపమాన మేధతో సుగతని బోధలు    

అలవోకగ వల్లించిన సుత్తపీటకాచార్యుడు ,

 ప్రధమగణ భిక్షువతడు, నిత్య సంతోష పుష్పితుడు   

సౌశీల సుగంధమెదజల్లు ఆధ్యాత్మిక దయాళువతడు .



నిరంతరం దాతృత్వమే ధ్యాసగా  

అనుదినము మానుష్యమే సేవగా  

నిరుపమాన ధారణను సాధనతో కలబోసి

భగవానుని భోధలతో  ధర్మపాలనందించిన

మర్మమెరుగని ఆనందాదిత్యుడతడు.



సమానతను చాటి సత్పురుషుల మేటిగా

భగవాని మదిలో సమతుల్యత మీటి  

ప్రజాపతి గౌతమికి  ప్రణమిల్లి  ప్రతిపత్తిని ప్రసాదించి

ప్రాజ్ఞుడిగా ప్రకాశించి, భిక్కుణి సంఘము పురష్కరించి  

 సంఘీభావుడైన ప్రాసంగీక

సంభాషణా చతుర సమతుల్యుడతడు .   

అనివార్యముగా తలిచి

అహరహమూ అన్వేషణ చేసి

అరహతుడై వెలిగిన శ్రోత అతడు

మహాపరినిబ్బాన దూత అతడు

బౌద్ధ నందనుడతడు, ఆనందుడతడు ....

                            డాక్టర్ మాటూరి శ్రీనివాస్



 

ananda ....


ఆనందుడతడు....



కల్లోలమెరుగని కమనీయ కాంతుడు

విశ్వవీణను శ్రుతిచేసి

శాంతి లయను ఆలపించున    

నియము నియతి గల

అభ్యుదయార్ధ్రశీలుడతడు.

 అంగుత్తరం అభిమానముగా కీర్తించిన

అసమాన నిరాడంబర మూర్తి

అనుయాయుల స్నేహస్పూర్తి,

తధాగతుని బంధు మిత్ర శిష్య పరివారమతడు,

బుద్ధపాద పరిష్వంగుడు, ఆనందుడతడు.



నల్గురూ ఆశ్రమమున  అనుచితముగా

అసంపూర్ణుడని తలచినా, అనురాగాలోలుడై

 అనునిత్యభోధనలను ఔపాసన చేసి

అనుపమాన మేధతో సుగతని బోధలు    

అలవోకగ వల్లించిన సుత్తపీటకాచార్యుడు ,

 ప్రధమగణ భిక్షువతడు, నిత్య సంతోష పుష్పితుడు   

సౌశీల సుగంధమెదజల్లు ఆధ్యాత్మిక దయాళువతడు .



నిరంతరం దాతృత్వమే ధ్యాసగా  

అనుదినము మానుష్యమే సేవగా  

నిరుపమాన ధారణను సాధనతో కలబోసి

భగవానుని భోధలతో  ధర్మపాలనందించిన

మర్మమెరుగని ఆనందాదిత్యుడతడు.



సమానతను చాటి సత్పురుషుల మేటిగా

భగవాని మదిలో సమతుల్యత మీటి  

ప్రజాపతి గౌతమికి  ప్రణమిల్లి  ప్రతిపత్తిని ప్రసాదించి

ప్రాజ్ఞుడిగా ప్రకాశించి, భిక్కుణి సంఘము పురష్కరించి  

 సంఘీభావుడైన ప్రాసంగీక

సంభాషణా చతుర సమతుల్యుడతడు .   

అనివార్యముగా తలిచి

అహరహమూ అన్వేషణ చేసి

అరహతుడై వెలిగిన శ్రోత అతడు

మహాపరినిబ్బాన దూత అతడు

బౌద్ధ నందనుడతడు, ఆనందుడతడు ....

                            డాక్టర్ మాటూరి శ్రీనివాస్