Wednesday, 2 April 2014

బుద్ధుడు

గతము కాదది
నిత్య నూతన వ్రతము
మతము కాదది,
నిత్యవసంత మానవతము
ఆలకించిన, అవలోకించిన
అవగతమౌ స్వాంతన సంగీతము
ఆచరించిన,అనుభవించిన 
కలుగు భవితకు జయము

మహోపాధ్యాయుని నిరంతర భోధనలు
మానవాళి మనుగడకు సూక్తిముక్తావళులు
దమ్మ పద సంచార మార్గ దర్శకములు
దుక్ఖ వ్యధ నిర్మూలన గీతములు

ఎదేశమేగిన అగుపించును ఆతని సాన్నిధ్యములు
ఈ నోతవిన్నాను వినిపించును ఆతని నిత్య సాధనలు
ఎవ్వరేమన్నగానీ మురుపించునాతని ముఖ కవళికలు
జగతికి ఆవశ్యాకతములు ఆతని సామ్యవాదాన్నిసాన్నిధ్యములు
   ------------------------------   

No comments:

Post a Comment