Thursday, 5 June 2014

అరుణ

               అరుణ
                                -డాక్టర్ మాటూరి శ్రీనివాస్

మెరిసే తారవో సితారవో, అరుణ నీవు మా అంతరంగానివి,
తీర్చుకోలేని రుణానివి ,మార్చుకోలేని బంధానివి   
అందరినీ అలరించే దానివి, ఆత్మీయంగా పలకరించేదానివి
 ఆశ్చర్య పరుస్తూ అచంచల విశ్వాసం తో
అవాంతరాలు అధిగమించి అందనంత ఎత్తుకేదిగి,
ఆశ్చర్యపరిచావే, ఆనందాన్ని పంచావే
అంతలోనే అందనంత దూరానికెళ్ళిపోయి దుక్ఖాన్నేపంచావే,
ఆశయాలను అందుకోమని , జాతికి కొలమానముగా మిగిలావే,
మనిషి కొంచెం ఉనికి ఘనమని చెప్పకనే చెప్పి
నీకు నీవుగా నిరంతర ప్రవాహమై మా అందరి జీవితాలలో
జీవ నదిగా జీవిస్తావుగా ఎప్పటికీ,
నమ్మిన వారిని, నమ్మిన సిద్ధాంతాన్ని వమ్ము చేయక
గమ్మున సాధించి, జీవితపు బొమ్మలాట నుండి
హటాత్తుగా నిష్క్రమించి , ఎంత నిరాశ పరిచావో నీకేం తెలుసు ?
నిజానికి నీవు అరుణోదయానివి
ప్రతి రోజూ మాలోనుండే ఉదయిస్తూ ఉంటావు.
ప్రతి సాయంత్రం ,
నీ జ్ఞాపకాలు మాలోనే నిదురిస్తూ వుంటాయి.

( మా కళ్యాణ రావు కూతురు అమెరికాలో మే ఇరువై మూడు 2014 చనిపోయింది)

No comments:

Post a Comment