వలస
ఆకలి రుచికి చిరునామాలవి,
అవమానాలే నరాల్లా సాగుతున్నప్రాణాలవి ,
పుట్టి పెరిగిన ఊరే ,
కార్పొరేట్ కాల సర్పమై ఉరి కౌగిలి బిగిస్తుంటే ,
పొలం ,పుట్రా వదిలి మెతుకు వేటలో -
చంకలో పాపడు ,నెత్తిన మూటడు
ఆచ్చాదన లేని శరీర భాగలై అతుక్కున్న జీవచ్చవ యాత్ర -
అందనంత దూరానున్న బతుకు మజిలీ కోసం.
బండెక్కో,బస్సెక్కో, రైలేక్కో, పడవెక్కో
అనంతం లోనికి పరుగుల పందెం.
మృత్యువు వోడి లోనికి వలస ప్రయాణం.
డాక్టర్ మాటూరి శ్రీనివాస్
20-04-15.
No comments:
Post a Comment