Sunday, 11 May 2014

మహా భోధి

                                                                  మహాభోధి

 
                                                                                                           డాక్టర్ మాటూరి శ్రీనివాస్
కూల్చండి ,
కాందహార్ లో బమియనులను కూల్చండి ,
ఇసుక తూఫానులై దేశాంతరాలు ఎగురుతాయి ,
ఖండ ఖండాతరాల్లో దిగబడి కాలానికి దీటుగా నిలబడతాయి.

పేల్చండి,
ఇతిహాసానికి మసిని పూసి మానవతను నలిపేసి పేల్చండి
విస్పోటన రేణువుల్లో మేఘామృత బిందువులై
అనంత దూరాలలో గర్జిస్తాయి, వర్షిస్తాయి .

మేల్కొనే వున్నాయి,
మహాభోది మందిరాలు -ప్రపంచ శాంతి పరిమళాలు
మానవాళి మనుగడకై బుద్దుని భోధామృతాలు.
త్రిశరణ, పంచశీల లు  -  విశ్వాoతరాలు, విశ్వ జనీనాలు
నలంద, తక్షశిలలు  -  చరిత్ర నమూనాలు, బౌద్ధ గమనాలు .

కల్పిత కహానీలు కావేవీ - అల్ప ఆలోచనలు లేనే లేవు ,
అకాలికములు - బుద్ధ భాషితములు
పరివర్తనా సూచికములు  - దమ్మ పదములు
మానవతా వీచికలు - క్రాంతి దిక్సూచికలు ,
భ్రాంతి విచ్ఛేదనలు  -  శాక్యముని భోధనలు . 

Saturday, 10 May 2014

నేనొక ప్రవాహాన్నీ,,,,,,,,,

    
                                            నేనొక ప్రవాహాన్ని......      
                                                                       డాక్టర్ మాటూరి శ్రీనివాస్
నే నొక ప్రవాహాన్ని
వున్నా చోటనే వున్నట్టుంటాను,
కానీ అక్కడ వున్నది నేను కాను.
నా వునికి నిశ్చింతగా అనిత్యమైన ప్రయాణమే
రెండు కణాలతో జీవము పోసుకున్ననేను,ఎన్నో గుణగణాల వారసత్వపు నిలయాన్ని.
నాలోనే నేను ఏకత్వములో భిన్నత్వాన్ని.
పసి గట్టలేని వేగం ,లోతు, అంటూ చిక్కని ఆలోచన కవాతు నా చిరునామా..
నేనొక ప్రవాహాన్ని,
దొరకని దాని కోసం నిరంతరం వెతుకుతూ సంచరించే వివాదాన్ని.
కావాల్సిన దేదో దొరకని అలల అలజడిని
ఆయనవారికి వినోదాన్ని.
మలిన పడుతూ, మెరుగు పడుతూ, లేస్తున్న సామ్యవాదాన్ని
కొండో,బండో అడ్డుగా నిలిచినప్పుడు
కాస్త ఆగి, బలము పుంజుకుని
దూసుకు పోవడమో ,కోసుకుపోవడమో, లేదా బలహీనునై తప్పుకుపోవడమో తెలిసిన జీవజలాన్ని.
నేనొక ప్రవాహాన్ని,
ఏ రెండు క్షణల్లోను నేను నేను కాను
నిన్నా,మొన్నటి నేను నేదు కాను.
అభ్యంగనము తో వేలకొద్దీ చర్మ మృత కణాలు విసర్జించబడినట్లు.
మట్టి కోట్టుకుపోతు మనసైన రీతిలో
దిక్కులు చూసుకుంటూ తీవ్రత మార్చుకుంటూ
నాతోనే ప్రయాణించే వారందరినీ నాలోనే కలుపుకుంటూ,సుఖడుఖాలు పంచుకుంటూ , పంతము లేని పరుగు నాది
నేనొక ప్రవాహాన్ని,
ప్రతి క్షణము నాకు వర్తమానమే, బహుమానమే
జరా జరా ప్రాకాలనిపిస్తుంది, గల గలా వురకాలనిపిస్తుంది,
తామరాకు ఫై నీటిబొట్టు ఇహము తో నా అనుబంధము.
ఎక్కడికి వేలతానో అక్కడినుండే నేను అదృశ్యామవుతాను.
సముద్రపు అలల మీదుగా అగాధపు అంచుల్లోనికో,
భూగర్భపు పలకల ఇరుకుల మూలల్లోనికో,
నిర్మల నీశ్చల "నిర్వాణము"లోనికో...
Top of Form

సాంచీ

                                                                  
                             
                                                                     సాంచీ 
                          
                                                                                                                           డాక్టర్ మాటూరి శ్రీనివాస్
అద్భుత శిల్పారామం ,
కనువిందుకు ఇంపైన  కళాకృత్యం
మైమరపించు ,మురిపించు మనోజ్ఞ దీపం 
రోమాంచితం, ఆ ఆకృతి స త్యం 
భరతభువి సిగ లోన  సోగ సై న కుసుమం
అశోక విదిసీ విరచిత కావ్యం

బౌద్ధ భారత సాంస్కృతిక  వారసత్వపు ఆనవాళ్ళు
ఏ వైపు చూసినా ఒక్కరీతిగ ఒక్క నీతిగా అగుపించు గీటురాళ్ళు
పలు దిశల ధమ్మ దిక్పాలకులు , స్వాగతించు రాతి తోరణములు
భోధించు బౌద్ధ భోధనలనెన్నో, కీర్తించు  మౌర్య సాధనలనేన్నో .
చతుర అరియ సత్యాలు  తీపి గురుతులుగా, కర్తవ్య కాంతులను వెలిగించునేన్నో.

విడిశ అందించే లోకవిదునికి కంట్టాభరణమ్ము 
దేవి ప్రసాదించే కవలల సంఘ మిత్రమ్ము 
నలుచెరాల వ్యాపించే ధమ్మ ప్రవర్తనమ్ము
దశ దిశల ప్రభవించే పరివ్రాజకత్వము 


చిత్రించే రాతికుంచె, శిలన్యాసాల బడి లోన 
బృహత్సిల వోడి లోన 
నిక్షిప్తమై ఉంచె , అబ్బురం కలిగించు ఇటుకులకిటుకులు ,చిలువల కలువలు .
అంతః గుడిలోన బుద్ధ ధాతువులు ,అకాలికుని చలువైన విలువలు
 అల్లంత దూరాన కొండంతా చల్లిన కల్లాపి చైత్యాలు. 


అరహంతులకు, అరాధ్యులకు నవ్య చైతన్య సిరి 
అహరహము నర్తించు భవ్య సద్ధమ్మ మౌర్య మయూరి 
సత్సంగ విహారి ,మొగ్గలాయన స్మ్రితీ ఝురీ 
నే గాంచిన కంచన సుందర స్తూపము  సాంచీ .