సాంచీ
డాక్టర్ మాటూరి శ్రీనివాస్
అద్భుత శిల్పారామం ,
కనువిందుకు ఇంపైన కళాకృత్యం
మైమరపించు ,మురిపించు మనోజ్ఞ దీపం
రోమాంచితం, ఆ ఆకృతి స త్యం
భరతభువి సిగ లోన సోగ సై న కుసుమం
అశోక విదిసీ విరచిత కావ్యం
బౌద్ధ భారత సాంస్కృతిక వారసత్వపు ఆనవాళ్ళు
ఏ వైపు చూసినా ఒక్కరీతిగ ఒక్క నీతిగా అగుపించు గీటురాళ్ళు
పలు దిశల ధమ్మ దిక్పాలకులు , స్వాగతించు రాతి తోరణములు
భోధించు బౌద్ధ భోధనలనెన్నో, కీర్తించు మౌర్య సాధనలనేన్నో .
చతుర అరియ సత్యాలు తీపి గురుతులుగా, కర్తవ్య కాంతులను వెలిగించునేన్నో.
విడిశ అందించే లోకవిదునికి కంట్టాభరణమ్ము
దేవి ప్రసాదించే కవలల సంఘ మిత్రమ్ము
నలుచెరాల వ్యాపించే ధమ్మ ప్రవర్తనమ్ము
దశ దిశల ప్రభవించే పరివ్రాజకత్వము
చిత్రించే రాతికుంచె, శిలన్యాసాల బడి లోన
బృహత్సిల వోడి లోన
నిక్షిప్తమై ఉంచె , అబ్బురం కలిగించు ఇటుకులకిటుకులు ,చిలువల కలువలు .
అంతః గుడిలోన బుద్ధ ధాతువులు ,అకాలికుని చలువైన విలువలు
అల్లంత దూరాన కొండంతా చల్లిన కల్లాపి చైత్యాలు.
అరహంతులకు, అరాధ్యులకు నవ్య చైతన్య సిరి
అహరహము నర్తించు భవ్య సద్ధమ్మ మౌర్య మయూరి
సత్సంగ విహారి ,మొగ్గలాయన స్మ్రితీ ఝురీ
నే గాంచిన కంచన సుందర స్తూపము సాంచీ .
No comments:
Post a Comment