డాక్టర్ మాటూరి శ్రీనివాస్
నీ కౌగిలిలో ఒదగని వారెవ్వరు,
నీ కబంధ హస్తాల్లో ఇమడని వారెవ్వరు ,
నీలోలోని కలవని వారెవ్వరు , కరగని వారెవ్వరు .
నాదీ, నీదీ అంటూ కడకు నీకే అర్పించుకుంటారందరూ .
వీచే గాలుల, పూచే పూవులా, ఎగిరే పిట్టల
అశాశ్వతా ఆలంబనా గీతం,
కలి విడి ఆటల , కన్నీటి తడి చారల
కరుకు చదరంగం ,
ఎవ్వరున్నాగానీ, లేకున్నాగానీ తుది వరకూ వెన్నంటి
చరిస్తున్న అంతరంగం,
ఊరిస్తూ, కలల ఉహల్తో కవ్విస్తూ
విశ్వాంతరాలలో విహరిస్తున్న బలీయ విధి విలాసం,
జ్ఞాన జ్యోతిని ప్రసరించేందుకు, శాంతి గీతం ప్రభవించేందుకు
మనిషిలో చిగురింపచేసే వాత్సల్య బీజం
అనిత్యా గేలం, సుఖాదుఖాల మాయాజాలం - కాలం.
No comments:
Post a Comment