Tuesday, 22 July 2014

జైళ్ళు కట్టిద్దాం

 ఎంత అందమైనవి , ముద్దుముద్దుగా బొద్దుగున్నవి

గోప్పోళ్ళ ఇళ్ళల్లో గేటు బొమ్మలు

ఉన్నోళ్ళ స్థాయికివి ఆటబొమ్మలు , ఆనవాళ్ళు .

లేనోళ్ళ పాలిట అన్నీ అవుతాయి,

నమ్మకం కలిగించి, మనిషినే ప్రేమించే ఆప్త బంధువులు.

గ్రామ , నగరాల్లోనూ సంచార పహరాలు .

అరిచేవి, కరిచేవి . బ్లూ క్రాస్ సహోదరులు ఆదరించేవి,

పోషించే సమాజాన్నే  శాసించే రాబిస్ వారసులు.

మామ్సపుకొట్లల్లో, చేపల సంతల్లో కనిపించు విశ్వరూపాలు,

ఇప్పుడు, ఇక్కడ శ్రుతి మించిన భైరవ రాగాలు..

విసిరేసిన బొమికలను,వ్యర్ధ ఖండలని  పీక్కుని తింటున్నట్లు

బుట్ట సందుల్లోంచి దొంగలించిన చచ్చిన చేపలని లాక్కుని చీలుస్తున్నట్లు

ఎలుకలను, పిల్లులను వేటాడి గర్వంగా అరుచుకుంటూ

రక్కు కుంటూ సహపంక్తి భోజనం చేస్తున్నట్లు ,

నిదిరిస్తున్న నిర్భాగ్య పుట్టు వైకల్యాన్ని , మాట మంతీరాని  మూగ బాల్యాన్ని-

జింక పిల్లపై పులుల పంజాల్లా

ప్రేగులు చీల్చేసిన గ్రామ సింహాల కోరలు, గోళ్ళు.

శునక మూకలు మానవ  మనుగాడనే ప్రశ్నిస్తున్నాయి .

పురిటి పిల్లలని ఎత్తుకు పోవడం తో మొదలైన వేట

ఇప్పుడు, మానవ రక్తాన్ని రుచి మరిగి మనిషి కే  సవాలుని విసురుతున్నాయి.

కావాలిసింది ,బొడ్డు  చుట్టూ ఇంజక్షన్లూ కాదు,

ఇళ్ళ చుట్టూ కంచెలూ కాదు ,సంహారం పరిష్కారమసలే కాదు

సంఘటిత నిర్ణయం, సంపూర్ణ స్వేఛ్చ అందరికీ అవసరమే,

కుక్కలకు జైళ్ళు కట్టిద్దాం, శిక్షిద్దాం , పోషిద్దాం .  

No comments:

Post a Comment