నిర్జీవితం
డా .మాటూరి శ్రీనివాస్
అక్కడ గోడలు ఖాళీ కుర్చీలను ప్రశ్నిస్తున్నాయి
స్మశానపు వైరాగ్యం తో సమాధుల ఫలకాలను
మరిపిస్తున్న కుర్చీలు - నిన్న మొన్నటి పసి బాల్యాన్ని
నెమరువేసుకుంటూ , మౌనంగా రోధిసున్నాయి.
వాటిచుట్టూ మసలిన కేరింతల కలల సౌధాలు
కూలిన శబ్దాలతో బధిరులై పోయి బిక్క చూపులు చూస్తున్నాయి.
మొండిగోడలు బాంబు దాడుల సాక్షిగా నిర్వీర్యపు నిస్సహాయ గీతాలు ఆలపిస్తున్నాయి ,
వైమానిక విన్యాసాల రణ ధ్వనుల బాజాలతో .
మానవ మృగాల క్షిపుణుల గర్జనలు పంజాలై ఆ సిమెంటు అడవుల్లో కవాతులు
చేస్తూ , కోరలు చాస్తూ జీవుల్ని కబలించేస్తూ
త్రేంచు కోవడానికి కూడా సంశయిస్తూ జీర్నిన్చేసుకున్తున్నాయి ..
ఎక్కడో,ఎదో పేలిన శబ్దానికి బిక్కు మంటూ ఇక్కడ నుండే
ఆ దూరాన్ని,భారాన్ని, గాల్లో కలసిన ప్రాణాలని లెక్కేసూ
నా వంతు ఎప్పుడో? అన్న స్వగతాన్ని పీక నలిపేస్తూ గడిపేస్తున్న నిర్జీవితం.
గోడల్లేన బడులలో పుస్తకాల్లేని చదువులు మొదలైయ్యాయి.
మృత దేహాలతో సహజీవనం,
రక్తపు రహదారున్ని ఈదడం ,
నైరాశ్యపు భవిష్యత్తు కు మానసిక కసరత్తులు
శిధిలాలను చూపిస్తూ నేర్పుతున్నారు.
ఇప్పుడక్కడ ఏ ఇటుక రాయి ను తడిమినా స్మృతి గీతమే అవుతుంది,
ఇప్పుడక్కడ ఏ జీవిని కదిపినా , మౌనరోదనే వినిపిస్తుంది,
ఇప్పుడక్కడ పొగ చూరిన ఆకాశంతో కాలుతున్న శవాల
వాసన పోటీ పడుతున్నట్టుగా అనిపిస్తుంది,
హనన దహనానికి కాస్త విరామాన్ని విగతులు ఆర్ధిస్తున్నట్లని పిస్తుంది,
ఎప్పటికీ , గాజా చరిత్ర ఎండన రక్త చారికై నిలుస్తుంది.
No comments:
Post a Comment