Wednesday, 17 September 2014

మాట్లాడుకుందాం


ఎందుకు మాట్లాడుకోవాలి?
               డాక్టర్ మాటూరి శ్రీనివాస్

పొద్దువేళ మొదలు, పొద్దు గూకే దాకా
తెగ మాట్లాడేసు కుంటామా,
ఏమంటే , మాట్లాడుకోవాలికదా ! అంటాం  .
అక్కడ నుండి పారిజాతాలు రాలినట్లు మాటలు రాలిపోతాయి ,
సుగంధం మాత్రం సర్వ ఆమోదయోగ్యం కాదుగా .
కొందరికి వెగటు,కొందరికి ఉల్లాసం, ఇంకొందరికి పడిశం .
కొన్ని మాటలు అప్పుడే మార్చేస్తూ వుంటాం,
 కెరటాలల వచ్చి పోతూ ఉంటాయా, అరిపోయినట్టున్నా లోని చమ్మ ఇంకిపోదు .
అవసరానికి అప్పుడప్పుడు రాజకీయమాటలూ అడుతాం
వినాయకుడు పాలు తాగినట్లు , షిర్డీ బాబా కళ్ళు తెరిచ్నట్లు నమ్మేస్తాం.
తెలిసీ మోసపోవడంలోని ఆనందమే వేరు.
ఎలక్షన్ల వేళ వాగ్ధానపు కబురులూ చెప్పేస్తాం పిల్లలకీ,పెద్దలకీ
 స్వర్గానికి వేసిన బాణాల నిచ్చేనెక్కి అక్కడే విహరిస్తూ వుంటారు.
ముభావపు చిటపట మాటలు ఎటో చూస్తూ
బోగంవిల్లాల్ల రంగురంగులలో ఎంత అసహజంగా, చులకనగా ఎగురుతాయో,
ముల్లులు మాత్రం ఎంత సలుపిస్తాయో తెలియనిదేవ్వరికి?
సమ్మగా గుచ్చుకున్నా పర్లేదు , కమ్మగా గుబాళిస్తూ
రోజులు తరబడి తలుచుకునేలా ,వాడిన కొద్దీ పరిమళిన్చే
రెండు స్వాంతన కలిగించేవి , ఒక్కొక్కప్పుడు ఘాటుగా వున్నా
ఎప్పుడో ఒకప్పుడు ఆస్వాదించేందుకు , మనసు మాటలు
 మొగలి రేకుల్లా .... 



No comments:

Post a Comment