హుదుద్ విశాఖ ను అతలాకుఅతలం చేసి వెళ్ళిన మర్నాడు నేను నా ఉక్కు కర్మాగారానికి వెళితే స్మశానం లా అనిపించింది,మరొక్కఇరువై నాలుగు గంటల్లో ఉపిరిపోసుకుని ఉనికిని చాటింది ...
ఆనాటి స్పందనే ఈ ఫీల్ గుడ్ '' కవిత ;
పడి లేచిన కడలి కెరటపు అల అల్లంత దూరం వెనక్కిపోయి
ఆనాటి స్పందనే ఈ ఫీల్ గుడ్ '' కవిత ;
ఫీల్ గుడ్
డాక్టర్ మాటూరి శ్రీనివాస్
పదిహేను అక్టోబర్
నిన్ను చూడకుండా
నేనుండ లేనని నీకు తెలుసుకదా !
ఎక్కడికక్కడ ఛిద్ర
మై శిధిలమై , అందవిహీనమై
వివస్త్ర శిలలా
నిలిచిపోయావు.
కానీ వీసమింతైనా
విశ్వాసాన్ని కోల్పోలేదు,
పిసరంత ధైర్యాన్ని
వీడలేదు, ఎంత గుండె నిబ్బరం నీది.
చిన్ని పడవ లాంటి కారులో నిన్ను పలకరిద్దామని వచ్చానా,
సముద్రంలో
కూలిపోయిన నిమాన శకలాల్లా నీ అస్తిత్వం
కలింగ యుద్దనంతరం
రుధిర నదిమీద తేలుతున్న
వీరుల మొండాల్లా ఎగిరిపడి మునిగీమునగనట్లున్న నీ
అవశేషాలు
నిలువుదోపిడీచేసి,
గోరింట దూసినట్లు బోసి పోయిన
వృక్ష జాలాలను , వోడలిపోయిన వాటి ఆస్తిపంజరాలును చూస్తుంటే
పర్యావరణ ఆవరణ అవసానానికి
పరాకాష్ట అనిపించి దుఃఖ మొచ్చింది.
మొక్కవోని ధైర్యం
తో నడుం బిగించి నలుగురినీ పోగేసి ,
పలుగు, పారా – రంపం
,సుత్తి లతో అలుపెరుగని కార్మికులు
వాళ్ళ మనసెరిగిన
అధికారుల సమన్వయంలో ,
పడినంత వేగంగా లేచి అలై ఉరుకుతుంటే ఎంత
ముద్దోచ్చావో?
మూర్ఖులు , అదిగో
పులి ఇదిగో తోకంటూ,గ్యాస్ లీకంటూ హడాలుగోట్టిన
అవకాశవాదులను లాగికొట్టాలనిపించింది
కదూ, నీక్కూడా .
ఆ కొద్దిమంది అంతే
, పిరికిపందలు.. వాళ్ళతో మనకేం పని?
ప్రభుత్వ మంత్రాంగ యంత్రాంగాల
అమూల్య
సహాయం తో
ఊపిరి పీల్చుకుని జవసత్వాలు పుంజుకున్న సంకేతాల ఈలలు ,
నీలోలోపలనుండీ
ఎగదన్నుకు బయటకోస్తున్న వెచ్చని ఆవిర్లు
,
అస్సలలవాటులేని
నిశ్శబ్దాన్ని చీల్చు కుంటూ
వాటిదైన భాషలో ఘోషిస్తున్న యంత్రాలు,
నీ , ఆ పొడవు ముక్కు
చిమ్నీల్లోంచి వదులుతున్న నిశ్వాస
పొగలు ,
అల్లంత దూరం నుండే మా
అందరి కళ్ళలో ఎన్ని దీపకాంతులు
వెలిగించాయో,
వెయ్యి దీపావళులు ఒక్కసారే జరుపుకున్నంత .
కోమా లోంచి తిరిగొచ్చిన
అమ్మ గుర్తోచింది, నా ప్రాణం లేచొచ్చింది. ,.
డాక్టర్ మాటూరి
శ్రీనివాస్
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన విద్యుత్ సహకారంతో మా టి పి పి తిరిగి విద్యుత్ ఉత్పత్తి ని సాధించింది
థర్మల్ పవర్ ప్లాంట్
పదహారు అక్టోబర్
పడి లేచిన కడలి కెరటపు అల అల్లంత దూరం వెనక్కిపోయి
ఎంత ఉరకలేస్తూ
ఉరుకుతుందో ,
వాయుగండం గడిచినాక
ఎప్పుడెప్పుడా అని నేను కూడా,
కానీ పవర్లేనితనం
నన్ను నాశనం చేయబోతుంటే
ఏభై మెగావాట్ల
శక్తి ని కొన ఉపిరితోనున్న నాకిచ్చి
బ్రతుకిచ్చిన
బంగారు బాబుకు వందనాలు.
ఆమాత్రం చేయూత
చాలదూ ,
అలల్లా పారి ,నురగల్లె మురిసి మెరిసి పోవడానికి.
నన్ను నేను
పుంజుకుని కొత్త జవసత్వాలతో
ఒక్కొక్క టర్బైన్
ను ఒక్కొక్క సుదర్సనంలా త్రిప్పే యనూ ,
ఒక్కొక్క జేనరేటర్
తో వందల మెగా ఉనిట్లును పెంచి పోషించనూ.
బొగ్గుని,నీటి తో
కలిపి, వ్యర్ధ వాయువులను హీట్ తో రాజేసి
వందలవేడి ఉష్ణోగ్రత సృష్టించి, బోయిలర్లలో మరిగించి
క్షీర సాగర మధనం లా
కిలోవాట్ల విద్యుతామ్రుతాన్ని చిలకరించనూ ,,
గ్రిడ్ల నుండి
ఎక్కడెక్కడికో ప్రవహించి
కోట్ల చీకటి జీవితాల్లో వాట్ల దీపాల కాంతులు వెలిగించనూ ,


No comments:
Post a Comment