కల
సముద్రంలో అలా లేచి సముద్రం లోనే
కరిగిపోయిన అలల్లా
నా ఆశయాల కలలన్నీ ఇట్టే చెదిరిపోయాయి.
చెదిరిన కలలను చేరదీయడానికి
నా హృదయానికి సముద్రమంతా లోతు లేదు
కానీ అగాధమంత శూన్యముంది.
సాలె పురుగు గర్భంలో పట్టు దారం ఊరినట్టు
స్తబ్ధ శూన్యత లోనుండి నా నిర్ణీత కలలు
వినీలాకాశము లో విశ్వశాంతి గీత మాలపిస్తూ
పురి విప్పిన ముయురలై
ఇంద్రధనుస్సు పై నాట్య మాడుతున్నాట్టు
ఎంత అద్భుతమైన కల. 5-1-16
No comments:
Post a Comment