Friday, 15 August 2014

తల్లీ ఎవరు కన్నారు అమ్మా మమ్మలను కన్న  నిన్ను ,?

ఎవరైతే నేమి, మాతవు , తండ్రిలేని  మాపాలిట దైవానివి.

 మరి ,ఎందుకు కొందరే నీకు జై కొడతారు? వాళ్ళ జాగీరులా ప్రవర్తిస్తారు .

వారే , ఆకొందరే యందుకు నిన్ను

ప్రేమించినట్లు భావిస్తారు?  ఓంకారాలు ఘీంకరిస్తారు .

వారికి మాకు విభేదాల వంతెనలు ఎవరు కట్టారు?

ద్రౌపదిలా   పక్షపాతచిత్రనెందుకో?

జాతీయ పటానికి నిలువెత్తై

పట్టు వస్త్రం తో విరబూసిన కురుల కిరీట ఠీవిగా నిలెట్టి

చేతిలో ఎవరు పెట్టరమ్మా ? ఆ జెండా

తిరంగమో, త్రివర్ణ మో, కొండకచొ  కాషయమో

ఎవరికీ తోచిన రీతిలో వాళ్ళు . ధర్మచక్రాన్ని అధర్మం పాల్జేయడానికా?

జాతీయ చిహ్నం పులికదా! నీ ప్రక్కన ఆ సింహమేమిటీ?

క్రూర జంతువుతో నీకేమి పని? ఏమిటి ఈ ఉన్మాద వైపరీత్యం.?

నిన్ను ఒకరు బొమ్మ తల్లినిచేస్తే ,ఒకరు పురాణ స్త్రీని చేసారే  పబ్బం కోసం.

నీకు చరిత్ర కూడా వ్రాస్తారు స్వార్ధం కోసం,

గాంధి తాతను జాతి పితను చేసి , తండ్రినే చంపుకున్న చాణక్య చరిత్రమాది

చివరాకరికి మేము భారతీయులము , మముగన్న మాయమ్మలను

వెతుక్కునే వేటలో రాష్ట్రానికొక తల్లిని సృష్టించుకుంటున్నాం .

శంకరంబాడి పాట తో పూర్ణ కుంభం చేతపట్టి,

వరి కంకులు వెదజల్లుతూ తెలుగుతల్లి విలసిల్లితే

జొన్నపొత్తులు  చేతబూని, బోనాలతో నీ వారసురాలు

అరణాల తెలంగాణా తల్లి పురిటిలో అపశ్రుతులెన్నో .

 పుట్టింది మొదలు  ఆ తల్లికి జన్మనిచ్చినపిల్లలే

పెద్దమ్మతల్లికి  పంగనామాలు పెడతారు .

తల్లులు లేని దేశాలు అనాధులేమీకాదు, గానీ ప్రగతి పధాన

దూసుకుపోయే కొత్త నీటి పునాదులు.

 పితలు మాతలు వున్నా మనం మాత్రం

వెనక్కి నడుస్తున్న సంప్రదాయ సమాధులం.

                      డాక్టర్ మాటూరి శ్రీనివా

1 comment: