ఆఫ్రికా దేశాల పాలిట దాపురించావె శాపంలా .
ఆకలి మంటల చావులకు ఆజ్యాన్నే పోసేసి
అలమటించే రాజ్యాలను కకావికలం చేసేసే
నీ ఉనికి మా చావుకొచ్చిందే .
మందు మాకులకు లొంగ కున్నావు,
సందు సందుల్లోను విహరిస్తూ వున్నావు .
నీవు బతకాలంటే మేముండా లంటావు,
బతక నిద్దామంటే సంపుకు తింటావు
దేశాలు దేశాలు దోచేసుకుంటావు,
వేషాలు మారుస్తూ మోసాలు చేసేస్తూ
చీకటింట్లో గబ్బిలాల్లో శ్వాసిస్తూ
అగ్ర అహంకార అమెరికానే శాసిస్తూ అలజడులు సృష్టిస్తూ
కోతులతో చేరి కొమ్మచ్చులాడు తున్నావు,
ఎబోలా ఓ ఎబోలా
తప్పించుకుంటూనే మనగల్గు తున్నావు ఈ వేళ.
ఎంత మందిలో దూరి ఎన్ని మూల్గులు వింటావు
లైబీరియా నది నామ రూపం నీది ,
అల్లంత దూరాన అక్కడే ఆగిపో
నైజీరియాలోని మావాళ్ళను విడిచిపో
నీ కర్కోటక కాటుకు వేస్తాము వేటు
ఎబోలా ఓ ఎబోలా
నేడైనా రేపైనా హత మారుస్తాము నిన్ను ఏదోలా.....
---మాటూరి శ్రీనివాస్

No comments:
Post a Comment