నీలోనే సర్వం
........
శత్రువు ఎక్కడో లేడు
ఒక్కసారి తరచి తెరిచి చూసుకో
నీలో సంచరిస్తున్న సర్వాంతర్యామి వాడు
నీ శ్వాసలో ఇమిడి
నీధ్యాసలో లీనమైపోయి
నిరంతరం నీలోనే ప్రవహిస్తూ నిన్ను
సాసిస్తున్నాడని ఎప్పుడైనా గమనించవా?
అచ్చం గాలిలా...
రంగు రుచి వాసన కనబడనీకుండా
కాల్చేస్తున్నాడని కూల్చేస్తున్నాడని ఎప్పు తెలుసుకుంటావో అప్పుడే
జీవిస్తావు
నీలోనే తనను బ్రతికించు కుంటున్నాడు
సత్యాన్ని బ్రహ్మ పదార్థంగా
దుఁఖాన్ని సచ్ఛితానందంగా
చిత్రిస్తున్న మాంత్రికుడు
నీ మౌఢ్యానికి రెప్పలేని పహరా వాడు
నీ మౌనానికి అధిపతి
భావదారిద్ర్యానికి భీమా వాడు
మానవ సంబంధాల మారణాయుధం వాడు
అజ్ఞానం అనే క్రిప్టో కరెన్సీతో తెగ
వ్యాపారాలు చేస్తున్నాడు
పుణ్యాన్ని లాభాలుగా చూపజూస్తున్నాడు
నీ ఎరుక లేనితనమే నీలోని శత్రువుకు
పెట్టుబడి
నీలోని చీకటితో వాడు వెలిగిపోతున్నాడు
బతికున్న శవంగా సమాజానికి భారమౌతావో
చావుకు వెరవకుండా శత్రు సంహారివై
సమాజా భారాన్ని తీరుస్తావో....
మాటూరి శ్రీనివాస్
No comments:
Post a Comment