Saturday, 17 February 2018

నా దృష్టిలో పద్మావత్


నా  దృష్టిలో పద్మావత్





"పద్మావత్" అందరూ చూడాల్సిన సినిమా.ఎందుకంటే మొదటది అది చరిత్ర ఆధారంగా తీసినది. రెండవది కర్ణి సేన విభేధించాల్సినది ఏముందో తెల్సుకోవడానికి..మూడవది  సినిమాని అర్దం చేసుకోవడానికి..నాల్గవది బన్సాలి మేధను అంచనా వేయడానికి. నేను పై నాలుగు అంశాలను దృష్టిలో పెట్టుకునే చూసాను.

     సంజయ్ లీల బన్సాలి ప్రతిభకు అద్దం పట్టిన సినిమా ఇది. అందుకే దీన్ని అతడి మేగ్నం ఓపస్ అని పొగుడుతున్నారు. టెక్నికాలటీస్ హాలివుడ్ స్థాయిలో ఉన్నాయ్. కాస్ట్వూమ్స్ మనల్ని 13 శతాబ్దానికి తీసుకెళతాయ్.3D ఎఫెక్ట్ అక్కడక్కడ సినిమా సీరియస్ నెస్ ని పలచబరించింది.కొన్ని సందర్భాల్లో ఏనిమేషన్ లా అనిపించింది.  జయేసి కావ్యం ఆధారితం కాబట్టి ఇప్పుడు దాన్ని చదవాలనిపించిడం సహజమే. నాటి ఆచార వ్యవహారాలను సాంఘీక దురాచారాలను(సతి,జొ   వర్) చూపడం అనేది సినిమాలో కేవలం ఒక కోణం మాత్రమే. దాన్ని చూపడానికి అభ్యంతరం తెలుపని కర్ణి సేన...ఈ క్రింది అంశాల పై యుద్ధం ప్రకటించింది. 1. పద్మావతి యద్దనీతి ని ప్రకటించడం, 2.భర్త ను విడిపించుకునే నేపధ్యంలో ఖల్జీ ని కలవడానికి వెళ్లడం,3.ఖిల్జీని ఒక సామ్రాజ్య స్థాపకునిగా చిత్రించడం.4.రాజపుత్రుడు రావల్ రతన్ సింగ్ బంధీ అవడం 5.ఆనక భార్య (పద్మావతి)తన చాతుర్యంతో విడిపించడం....6.పిమ్మట రాజు ఖిల్జీతో యుద్ధంలో  ఓడిపోవడం లాంటి నాటి సహజ సామాన్య అంశాలు.7.రాణి పాట పాడి డాన్స్ చేయడం(చేసింది రాజస్థాన్ సంప్రదాయ నృత్యమే)     ఈ అంశాలు నేడు రాజపుతానా పురుషాహాంకార మనోభావాలు దెబ్బతీసాయనడం ఖచ్చితంగా రాజకీయమే. మనోభావాలతో ఆడుకోవడమే ఒక రాజకీయం. మనోభావాలనేవి ఆధిపత్యపు దురంహాకార ముసుగులు. మరి నాటి ముస్లీం రాజుల మనోభావం దుర్మార్గం దౌర్జన్యం. ఘజనీ ఖిల్జీల చరిత్ర రక్తసిక్తటిమనేది కొత్తవిషయం కాదు. మరి నేడు అగ్రవర్ణ(రాజ్పుత్) మనోభావాలు ఏమైనా భిన్నంగా ఉన్నాయా(వారు సృష్ఠించిన కల్లోలం, సినిమా నిషేధం, చేసిన ఆస్తి నష్టం, రాజకీయ అధికార దురంహాంకారం).? ఎన్నో రివ్వ్యూలూ ఎన్నోవార్తలూ సినిమాకి అవసరానికి మించి పబ్లిసిటీ తెచ్చి పెట్టాయ్. చరిత్రని చరిత్రగా సినిమాని సినిమాగా చూడలేని, చదవలేని మనోభావాలు మనోభావాలు కాదు,మనోదుర్భలతలు. మరొక కీలక అంశం సినిమాలో పద్మావతి తీసుకున్న నిర్ణయూలు..భర్తైన రాజును విడిపించడాని బయలు దేరడం (అంటే అంతఃపుర స్త్రీ కోట దాటకూడదనేది నాటి దురాచారం) అదీ తనముఖాన్ని చూడడంకోసం పరితపిస్తున్న ఖిల్జీ దర్బారు కు వెళ్లడానికి నిశ్చయించుకోవడం లాంటి నిర్ణయాలు వారిని గాయపరిచి ఉంటాయ్. ఇక్కడ కర్ణి సేన బన్సాలి ప్రతిభను అంచనా వేయడంలో విఫలమైయ్యారు. పద్మావతి భారతీయ మహిళ కాదు.ఆమె సింహళీ రాజ కుమార్తె. సింహాళ దేశం బౌద్ధ దేశం. ఆ నేపధ్యం సినిమా ఆరంభంలో చాలా సేపు కనబడుతుంది. ఆమె లోని బౌద్ధ తాత్త్వికత ధైర్యంగా నిర్ణయాలను తీసుకునే మనోబలాన్ని ,పురుషునితో సమాన స్థాయిని ప్రదర్శింపచేసాయనుకోవచ్చు. పైగా ఆమెకు విలువిద్యలో ప్రవేశంకూడా ఉంది. అయితే చిన్నరాణిగా, మేవార్ రాజుకు భార్యగా, రాజపుత్ ల నాటి సతి ఆచారాన్ని కూడా గౌరవించి తన ఔన్నత్యాన్ని చాటుకున్నట్లు బన్సాలి ఆమె పాత్రను చెక్కాడు. సినిమాగా కలెక్షన్ పరంగా ఇదొక బ్లాక్ బష్టర్. చరిత్ర ఆథారిత కథ మాత్రమే,సినిమా కాదు.

ఖిల్జీ నాటి చరిత్ర ప్రకారం హీరో (సినిమా లో విలన్). ఇది అతని చుట్టూ అల్లిన కథ అనీ, ఇతరత్రా అన్నీ కల్పతాలని బన్సలీ చెప్పాడు కదా!.. ఇంకెందుకు రాజకీయం. చివరిగా అతి ప్రథానమైన అంశం.....ఇది ఈ మథ్య వచ్చిన కుటుంబ సమేతంగా చూడదగ్గ ఏకైక సినిమా గా నన్ను అలరించింది.


No comments:

Post a Comment