శకాది
డాక్టర్ మాటూరి శ్రీనివాస్
నిన్నో నేడో ఎప్పుడు రావాలో తెలియని సందిగ్ధలో
పీఠాల పీట ముడుల విప్పుకుని
హేవళంబి ఎప్పుడొస్తుందోనని తికమక.
ఏదో రాద్దామని ఎగబడి ఏమి రాస్తే ఏ దేశద్రోహమౌతుందో
తెలియక , కలం కాగితాన్ని ముట్టనని
ఉపవాసంతో ముడుచుకు కూర్చుంది, రంజాన్ మాసపు రోజా లా
ఊరుకోక అకాల గాలివానకు రాలిపోగా మిగిలిన పూత
బహుసా తెలుసేమో నాణ్యత సంగతెత్తకుండా
నవ్యమైన కవిత ఒకటందుకోమంటూ కవ్వించింది.
ఎప్పుడూ ఉన్న కొత్త చింతకాయ పచ్చడే కదా ఏముందిలే అనబోతే
దేశ ద్రోహం కింద బుక్కైపోతావ్ జాగ్రత్తని వేపకాయ వెక్కిరించింది .
రాస్తే ఎవరి మనోభావాల గాయాలకు కుట్లు వేయాలో
ఏ మనువు ఏ రూపంలో ఎవర్ని రక్షించడం
కోసం ఎవరికి ఏశిక్ష వేయిస్తాడో ? ఏమో కానీ ,
రాయకపోతే ఎలా ? నాలో కవిగాడు పెద్ద నిద్ర లోకి జారుకోడూ?
పెరుమాళ్ మురుగన్ లా మరుగుపడి పోడూ ? .
అసలు ఈ దేశభక్తి అనేది ఉంది చూసారూ,
మశూచిలా పట్టుకుంది మానవాళిని
మరి జాతీయతంటారా? మతానికి మారుముఖమై జాతిని
జోకొడుతున్న మేక వన్నె పులి
మనుషులంతా ఒక్కటే ,అందరి దేవుళ్ళూ ఒక్కరే అంటారుగా
మరి అన్ని దేశాలకూ ఒకే జాతీయత ఎందుకుండదో ?
నదులు కలిసిన సంద్రంలా అపుడంతా ఉప్పనే గా.
ప్రపంచీకరణ అంటూ అంతా కలిపేసి నప్పుడు
రాం రహీం కలిసే ఉన్నప్పుడు , మందిర్ మసీదు ఒకేచోట మనలేవా?
కనీసం బొమ్మా బోరుసుల్లాగైనా సరే.
ఏదేమైనా విశ్వకవి వారసున్ని , విశ్వ నరుని శ్రావకున్ని
ఎక్కడి వాడైన మనిషే నాకు ప్రమాణం , మానవతే నా జాతీయత
దేశ ద్రోహినంటారా, బ్రతకడం బ్రతకనీయడం దేశద్రోహమైతే సరే
విశ్వంభర నా దేశం ప్రపంచవాదమే నా జాతీయత ..
ప్రపంచానికి మేలు చేయడమే ధ్యేయంగా రా
హేవళంబి కొత్త శకానికి ఆదిగా శకాది గా రా .

No comments:
Post a Comment