Tuesday, 14 November 2017

మలేషియా లో బౌద్ధం

మలేషియా లో బౌద్ధం

డాక్టర్ మాటూరి శ్రీనివాస్

[వరల్డ్ ఎలియన్స్ ఆఫ్ బుద్ధిష్ట్ ఆధ్వర్యంలో ధర్మ బుద్ధిస్త్
యూనివర్సిటీ మలేషియాలో జులై 23 నుండీ 25 వరకు 2017 రెండవ ప్రపంచ బౌద్ధ మహా
సభలను నిర్వహిస్తుంది. ఈ వ్యాసం రాస్తున్న సమయంలోనే యాదృచ్చికం పై
కార్యక్రమం యొక్క బ్రోచర్ అందడం తో ఈ వ్యాసం కష్ట పెఆముఖ్యతను
సంతరించుకుంది.]
చాలా ఆసియా దేశాలు బౌద్దాన్ని ఆశ్రయించి పురోగాభివ్రుద్ధి చెందడం
21 వ శతాబ్దపు సామాజిక ఆర్ధిక పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ మధ్య
నేను సందర్శించిన మలేషియా చరిత్ర మరింత ఆశ్చర్యం గొలిపేలా అనిపించి ఈ
వ్యాసాన్ని రాయడానికి ఉపక్రమించాను. మలేషియా బౌద్ధ దేశమా? కాదా ? అనేడి
ఇక్కడ చర్చ కాదు. ఎందుకంటే భారతదేశం మతపరమైన తప్పిదం చేసి బౌద్ధాన్ని
తరిమివేసినప్పుడు అది స్థిరపడింది చైనా జపాన్ లాంటి పెద్ద బలమైన దేశాలలోనే
కాదు. మలేషియా లాంటి చిన్న దేశాలలో వేన్నూల్లుకుందని అర్ధం అవుతుంది. ఒకప్పుడు
ఆసియాలో అతి చిన్న అనామక దేశం మలేషియా. మరిప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా
గుర్తింపు కోసం తహతహలాడుతుంది. దానికి దాని బౌద్ధ నేపధ్యం ఏమైనా
దోహదపడిందా? అనే దృష్టితో అలోచించాల్సిన అవసరం ఏర్పడింది. ఏ ప్రాంతాన్ని,
దేశాన్ని ,నగరాన్ని సందర్శించినా ఆయా ప్రాంతాల చరిత్రను తెలిపే మ్యుజియంలను
దర్శించడం అలవాటు నాకు ఎన్నో క్రొత్త విషయాలను నేర్పింది. ఆనేపధ్యంలోనే
మలేషియా మానవ శాస్త్ర (ఆంత్రోపాలజీ )మ్యుజియం చూసిన తర్వాత అక్కడ బౌద్ధ
మూలాలు విరివిగా ఉన్నట్టు కనబడ్డాయి. తరచి చూస్తే ఒకప్పుడు అదొక ప్రముఖ
బౌద్ధ దేశం, భారత్ లాగే. నిజానికి ఒకప్పుడు అది భారత భూభాగంతో మమేకమై ఉన్న
ప్రదేశం.
మలేషియా ఒక పెద్ద ద్వీపం. ఉత్తరాన థాయిలాండ్ దక్షిణానికి సింగపూర్ తో
కలిసి ఒకే భూభాగంగా ఉంటుంది. పడమటలో హిందూ మహా సముద్రం, సుమత్రా దీవులు
దూరంగా అండమాన్ నికోబార్, శ్రీలంక ఉండగా మరొక ప్రక్క తూర్పుగా సౌత్ చైనా
సముద్రం ఇండోనేషియా బ్రూనై ద్వీప సమూహాలు ఉన్నాయి. అంటే నాలుగు
దిక్కులునుండీ వలసలకూ వ్యాపారాలకు అనువైన దేశమన్నమాట. దీనిని సువర్ణ ద్వీపమనీ
మలయా ద్వీపమని పురాణాల్లో కూడా వర్ణించారు. క్రీ.శ. 4-5ల ప్రాంతంలో బుద్ధ
గుప్తుడనే వ్యాపారి రాయించినట్లుగా చెప్పబడుతున్న ఒక రాతి శాసనం బయట పడింది,
అక్కడ మ్యూజియంలో పొందు పరచబడింది. మలేషియా ను క్రీ.శ 2 నుండీ క్రీ.శ. 14 వరకూ
సుమారు 30 మంది రాజులు పాలించారు. మలేషియా భూభాగం ఉత్తర మధ్య దక్షిణ

ప్రాంతాలుగాను అలాగే చుట్టూ ఉన్న మలేక, పెనంగ్, జెంటింగ్ లంగ్కావి ద్వీపాలను
వీరు పాలించారు. స్థానిక ప్రజల జాతిని మలే జాతిగా గుర్తించారు .వారు
ఆస్ట్రేలేషియా తెగలవారు. మలే భాష మాట్లాడుతారు. ఇదే భాష బ్రూనై , సింగపూర్,
ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ లో కొంత ప్రాంతం ,సుమత్రా దీవులలోను వాడుక భాషగా
ఉంది. సుమారు 290 మిలియన్ల మంది ఈ భాష మాట్లాడతారని అంచనా. ఈ భాషకు ఒక్కొక్క
ప్రాంతంలో ఒక్కొక్క పేరుంది. దీనికి మూలం ప్రోటో ఆస్త్ర్నేషియాన్ భాష.
మలేషియాను అలాగే చుట్టూ ప్రక్కల ప్రాంతాలు శ్రీవిజయ సామ్రాజ్య
రాజులు క్రీ.శ. 1025 వరకూ పాలించారు . వీరంతా బౌద్ధ రాజులని చరిత్ర చెపుతుంది.
వీరితర్వాత చోళ రాజులు ఈ ప్రాంతాన్ని కొద్ది కాలం పాలిమ్చినట్లు, తర్వాత
ముస్లీం దండయాత్ర తో ఇస్లాం తన ప్రాబల్యాన్ని పెంచుకున్నట్లు తెలుస్తుంది.
ఇప్పుడీ దేశం ముస్లీం దేశం. 60 % మంది ముస్లీములు. బౌద్దం, హిందూమతం ,టావొజం
ఇక్కడ మైనారిటీ మతాలుగా చలామణిలో ఉన్నాయి. కాలక్రమేణా శ్రీవిజయ
సామ్రాజ్యం బలహీన పడి కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యింది. ఆఖరి
శ్రీవిజయచక్రవర్తి ఇష్కందర్ షా(పర్షియా భాషలో రాజు) గా పేరు మార్చుకుని
ముస్లీం వనితను పెళ్ళాడిన అనంతరం అతడి కుమారుడు కూడా క్రీ.శ. 1414 ప్రాంతంలో అదే
బాటలో నడవడంతో బౌద్ధ ప్రాబల్యానికి అడ్డు కట్ట పడింది. దీనికి తగిన ఆధారాలను
చైనా గ్రంధాలు చూపుతున్నాయి. క్రీ. శ.2 నుండీ అక్కడ బౌద్ధం ఆనక హిందూ మతం
వెలిసినా అంతకు ముందునుండీ బౌద్ధం ఆ ప్రాంతాన్ని ఏలినట్లు తెలుస్తుంది. ఇస్లాం
ప్రాబల్యం పెరుగడం వలన బర్మా కంబోడియా లకు బౌద్ధ పరిమితమయింది.
15వ శతాబ్దంలో మలేక ప్రాంతాన్ని(మలేషియాలో ఒక ద్వీప కల్పం) ఆధారంగా
చేసుకుని పోర్చుగీసుల వలస వ్యాపారం ఆరంభం అయ్యింది. దీంతో మలేషియా
ముఖచిత్రమే మారిపోయింది. కాధలిజం (క్రైస్తవం) మొదలై మత మార్పిడులు
ఊపందుకున్నాయి. 16వ శతాబ్దానికల్లా డచ్ వారు మలేకను ఆక్రమించుకుని డచ్
ఈస్ట్ ఇండియా కంపనీ నెలకొల్పారు. వారు పోర్చుగీసువారిలా మతాన్ని
ప్రోత్సహించలేదు. ఇవన్నీ తగరం,బంగారం,మిరియాలకు ప్రసిద్ధిగాంచిన ప్రదేశాలు
కావడం వలన ఆ వ్యాపారాల పై దృష్టి పెట్టారు. .వీరికి అరబ్బులతో, భారతీయులతో
చైనీయులతో సత్సంబందాలు ఉండేవి .17 శతాబ్దానికి బ్రిటీష్ వారి ఆక్రమణతో
ఐరోపా ఆధిపత్యం పెరిగింది. అందరూ మలేషియా భూభాగాలను వాటాలుగా పంచుకున్నారు.
సిల్క్ రూట్(ఐరోపా ఆసియాలను కొరియా నుండీ చైనా మీదుగా జపాన్ వరకూ కలిపే
వ్యాపార రోడ్డు మార్గం ) మార్గం మరియు స్పైస్ రూట్(ఆసియా ఆఫ్రికా ఐరోపా
సోమాలియా నుండీ భారత్ మీదుగా జావా వరకు సుగంధద్రవ్యాల వ్యాపార మార్గం )
ద్వారా వ్యాపారాలు సాగించారు.
మలేషియా లో బౌద్ధం;
మొదట్లో చెప్పుకున్న శ్రీవిజయరాజ్యం ఇండోనేషియా కేంద్రంగా చేసుకును
మలయ ,సుమిత్ర దీవులలో పాలించేది. ఆసియా చైనాలతో వ్యాపార సంబంధాలు
కొనసాగించేది. వీరి ప్రధాన జీవన శైలి బౌద్ధం . భారత్ నుండీ, చైనా నుండీ

బౌద్ధాన్ని వీరు స్వీకరించారు. ఇండోనేషియాలో జావాలో ప్రపంచ ప్రసిద్ధి
చెందినా బోరోబుదుర్ బౌద్ధాలయం నిర్మించింది వీరి వారసులే, అంటే ఆశ్చర్యం
కలగక మానదు. దీనిని క్రీ.శ. 827 లో శైలేంద్ర కుటుంబీకులు నిర్మించారు. మలేషియా
విషయానికొస్తే క్రీ.శ.1వ శతాబ్దంలోని కట్టబడిన పగోడా ఆంత్రోపాలజి
అర్కియాలజి వారి త్రవ్వకాలలో బయటపడింది. సుమారు 100 బౌద్ధ కట్టడాలను
గుర్తించి కేవల 10 % మాత్రమే త్రవ్వకాలు చేపట్టగలిగారు. మొత్తం పురావస్తు
త్రవ్వకాలు గనుక చేపట్టినట్లు అయితే మరిన్ని బౌద్ధ చరిత్రక సత్యాలు మన
ముందు ఉంటాయి. ఆనాటి ఈ ప్రాంతపు బౌద్ధులు ఈ ప్రాంతాలనన్నింటినీ కలిపి సువర్ణ
భూమిగా పిలుచుకునేవారు. అవి 9 క్షేత్రాలు.9 దేశాలు.
థాయిలాండ్,మియాన్మార్,లావోస్,సుమత్రా,మలయా(మలేషియా),కంబోడియా,వియత్
నాంమొదలైనవి. అందుకే ఈ దేశాల్లో చాలా ప్రాంతాలలో ఈ పేరు వినబడుతుంది.
ఉదాహరణకి థాయిలాండ్ విమానాశ్రయం పేరు సువర్ణ భూమి. దీని వెనుక ఒక చారిత్రిక
సత్యమున్నట్లు తెలుస్తుంది. అదేమిటంటే క్రీ.పూ. ౩వ శతాబ్దపు మౌర్య
చక్రవర్తి అశోకుడు ఈ ప్రాంతానికి ఇద్దరు దమ్మదూతల ద్వారా దమ్మ సందేశాన్ని
పంపాడు. అంటే అశోకుడు మహేంద్రుడుని దమ్మ దూతగా తామ్రాపర్ని (శ్రీలంక) పంపిన
సమయంలోనే ఇది జరిగింది. ఇక్కడకి దమ్మసందేశాన్ని తీసుకుని వచ్చిన వారు సోనా,
ఉత్తర అనే ఇద్దరు దమ్మ రాయబారులు. ఈ సోన,ఉత్తర పేర్లు రూపాంతరం చెంది
సోనోత్తర గా మారి సుమిత్ర గా పేరొందినది అని అక్కడి స్థల పురాణం చెపుతుంది.
దమ్మం అడుగిడిన సందర్భాన్ని సువర్ణ సందర్భంగా తలచి అయా ప్రాంతాలను సువర్ణ
భూమిగా పిలుచుకుంటారు. ఇది మలేషియా ద్వీపాలలో బౌద్ధం యొక్క మొదటి
ప్రస్థానం.
రెండవ విడతగా చైనా మలేక ద్వీపకల్పాన్ని కేంద్రంగా చేసుకుని వ్యాపారం
కొనసాగిస్తున్న కాలంలో క్రీ.శ.2 లో చైనీయుల యువరాణి స్థానిక మలేక రాజును
వివాహమాడి బౌద్ధానికి పునాది వేసింది. అప్పటినుండీ బౌద్ధం అక్కడ ప్రబలిందని
తెలుస్తుంది. కానీ దీనికి తగినన్ని ఆధారాలు లేవు. ముస్లీములూ పోర్చుగీసువారు
ఆనవాళ్ళను కూల్చేసారో(శ్రీలంక లో పోర్చుగీసువారు బౌద్ధ కట్టడాలను
కూల్చేశారు) లేక నిర్మాణాలు జరగలేదో నిర్ధారించవలసి ఉంది. అయితే డచ్ వారు వారి
వ్యాపారాల దృష్ట్యా కొన్ని బౌద్ధ కట్టాడాలను నిర్మించి స్థానికుల మన్ననలు
పొందారు. బెంగ్ –హు-తెంగ్ విహార డచ్ వారు మలేక లో నిర్మించినదిగా
చెప్పుకుంటున్న ఒక పురాతన కట్టడం. ఈ కాలంలోనే టావో కళాత్మక సంప్రదాయలో
బౌద్ధ నిర్మాణాలు జరిగాయి. ఇక 18వ శతాబ్దంలో బ్రిటీష్ వలస పాలనతో
వ్యాపారాలు జోరందుకున్నాయి. రబ్బరు,తగరంవ్యాపారాలను వారు ప్రోత్సహించాగా
వారికి దీటుగా వ్యవసాయం మత్స్య వ్యాపారాలను స్థానికులు కొనసాగించారు. అటూ
ఇటూ ఆర్ధిక పరమైన వలసలు మొదలైయ్యాయి.
తెరోవాద బౌద్ధం పద్దతుల్లో బర్మా ప్రభావంతో 1803 లో పెనాంగ్ ద్వీప
కల్పంలో దమ్మకారామ విహారాన్ని నిర్మించారు. దీనికి దాత ఒక ఉపాసిక అవడం విశేషం.
వీరు ఇక్కడ థాయిలాండ్ లో ప్రసిద్ధి చెందినా ‘మహాసి’ అనే ఒక నూతన విపస్స్యనా

ధ్యాన పద్ధతిని పాటిస్తారు. మరికొన్ని ప్రదేశాల్లో గోయెంకా గారి పద్ధతిని
అవలంబించారు. ఇక్కడిప్పుడు సుమారు 30 కి పైగా తెరోవాద బౌద్ధ విహారాలున్నాయి.
తైలాండ్ కళా నైపుణ్యం తో నిర్మించినవి చిన్నవీ పెద్దవీ 845 ఉన్నాయి.
ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్లీపింగ్ బుద్ధ లేదా రిక్లై నింగ్ బుద్ధ
(నిదురిస్తున్న భంగిమ) ప్రతిమ ఇక్కడే పెనాంగ్ లో ఉంది. మొదటిది థాయిలాండ్ లో
ఉంది. పెనాంగ్ లోనే మరొక ప్రపంచ ఆకర్షణ ఉంది.దాని పేరు కేక్-లోక్- సి. ఇది
మలేశియాలోనే అతి పెద్ద బుద్ధ విహారము. సముద్రతీరాన అత్యంత ఆకర్షణీయంగా 30
ఎకరాలలో నిర్మించబడింది. దీనిని స్వచ్చ భూమి మందిరమని, స్వర్గ మందిరమనీ
పిలుస్తారు. అక్కడి 37 మీటర్ల ఎత్తైన దయా దేవత విగ్రహం వారందరికీ
అరాధ్యనీయం. ఈ దేవతను అమితాభ్ బుద్ధుని ప్రతిరూపం గా కొలుస్తారు. అక్కడ 1830
లో నిర్మించిన పగోడా కు ఒక ప్రత్యేకత ఉంది. 7 అంతస్తులుండి 30 మీటర్ల
ఎత్తైనది.అందులో 10 వేల బుద్ధుని ప్రతిమలు పొందుపరచి ఉంచారు. ఈ పగోడా మూడు
దేశాల సంప్రదాయాలను సూచిస్తుంది. పగోడా పై కొన్ని అంతస్తులు బర్మీస్
సంప్రదాయాన్ని మధ్య అంతస్తులు థాయిలాండ్ క్రింది అంతస్తుయ్లు చైనీయుల
కళా నైపుణ్యం తోనూ చ్చూపరులను ఆకట్టుకుంటాయి. శ్రీలంక కూడా ఇక్కడ బౌద్ధ
వ్యాప్తికి విశేషం గా కృషి చేస్తుంది. చైనా తైవాన్ ప్రభావంతో మహాయానబౌద్ధం
ఇప్పుడిప్పుడే ఊపండుకుంటుంది. పూజలూ క్రతువులకు భిన్నంగా సాంఘిక సంక్షేమ
కార్యక్రమాలూ,ధ్యానం మీద ఎక్కువ దృష్టి పెట్టడం తో యువత ఇటుగా మొగ్గు
చూపడం విశేషం. మలేషియా బుద్ధిష్ట్ అసోషియాషన్ క్రింద సుమారు 250 యువ బౌద్ధ
సంఘాలు నమోదై పనిచేయడం అక్కడ ఆశాజనకమైన అంశం. సుమారు 700 మంది భిక్కులతో
ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్ల మంది ఇందులో సభ్యులుగా ఉన్నారని చెపుతారు.
ఏదేమైనా జనాభా లెక్కలప్రకారం 60 శాతం ప్రజలు ముస్లీములుగా ఉన్న చోట 19 %
బౌద్దులుగా నమోదై ఉండడం గొప్ప విషయమే. నేడు హిందూ మతం , బౌద్ధం
మలేషియాలో మైనారిటీ మతాలు. ఆచరణలో అంత చిత్త సుద్ధి లేకవడం , మత మార్పిడులు
మితిమీరడం అక్కడ బౌద్ధ ఉనికిని ప్రశ్నిస్తున్నాయి. అయితే కొన్ని దేశాల
సౌజన్యంతో నిత్యం దమ్మ సందేశాలు,సాహిత్య ప్రచురణలు,దమ్మ తరగతులు,
ఆదివారం పాఠశాలలు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జపాన్ తరహాలో
అడవుల్లో కొండలపైన నిర్మించిన విహారాలు అక్కడ ధ్యాన శిబిరాలు జరుగుతున్నాయి.
ఈ మధ్య వజ్రయామం కూడా తన ఉనికిని చాటుతుంది.1980 లో వెనెరబుల్
గ్యాల్యా కర్మపా అతని తర్వాత 1981లో దలైలామా 1996 లామా రింపోకే దర్శించి
అక్కడ వజ్రయాన బుద్ధిష్ట్ కౌన్సిల్ ఆఫ్ మలేషియా ను స్థాపించారు. అడపా దడపా
పెద్ద ఎత్తున జన సమీకరణాలతో కార్యక్రమాలను చేస్తున్నారు. చివరగా 2015 లో
భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మలేషియా పర్యతించు అక్కడ లిటిల్ ఇండియా అనే
ప్రాంతంలో సాంచి తోరణ స్తూపాన్ని ఇండియా –మలేషియా స్నేహ బంధానికి చిహ్నంగా
ఆవిష్కరించారు. ఈ నేపధ్యంలో ప్రపంచ బౌద్ధ సభలు విజయవంతం కావాలని మలేషియా
బౌద్ధ దేశం గా తిరిగి అవతరించాలని ఆశిద్దాం .

No comments:

Post a Comment