ఎవడు వచ్చినా ఎవడు పోయిన
నా ఉనికిని నా నగరాన్ని గలీజు చేసి
డబ్బుల డబ్బాలు కొట్టుకునేవాడే.
సిగ్నల్ స్తంభం నుండీ లైట్ పోస్టులు
నిలువెల్లా వాడి ముఖాన్ని పులుముకుని
ముస్తాబు అవ్వాల్సిందే దిష్టి బొమ్మలా
వాడు పోయినా ఆ మసి మరొకడు
వచ్చే వరకో చచ్చే వరకూ పోదు
దానికన్నా ఏలిన నాటి శనే నయం .
వాడి బలుపంతా మలుపులలో వాడి
బోడి ప్లెక్సీ ల్లోనే, మిడటం బొట్లేసుకుని.
కులపోల్ల కులుకంతా రోడ్ల మీదే
జన బలంతో స్థల యుద్దమే చేస్తారు
ఎవడికి వాడు ఐకమత్యపు తోరణం కోసం
వాడొచ్చి వీడు పోయి వెళ్తారా,
నగరానికి ఈలోగా ఎల్లో ఫీవర్ పట్టుకుంటుంది
తేరుకునే లోగా మరొక ఊసరవెల్లి
నగరాన్ని ఆవహించి రంగుమారుస్తంది
నగరమూ మాలాగే పిచ్చిది, ఎవడే రంగేస్తే ఆ రంగే
పులుము కుంటుంది మరొక రంగు పడేదాకా.
అజీర్తితో అవులు రోడ్డుకు అడ్డంగా స్పీడ్
బ్రేకులౌతాయ్
ఆవులూ ఫ్లెక్సీలేగా దేశాన్ని శాసించే పాలకులిప్పుడు .
నగరం కళ్ళు రంగుల వలయంలో
తిరుగుతూ బైర్లు కమ్ముతున్నాయి
నా కళ్లు అసలు రంగులు గుర్తించే పనిలో ఉన్నాయి
డా.మాటూరి శ్రీనివాస్
నా ఉనికిని నా నగరాన్ని గలీజు చేసి
డబ్బుల డబ్బాలు కొట్టుకునేవాడే.
సిగ్నల్ స్తంభం నుండీ లైట్ పోస్టులు
నిలువెల్లా వాడి ముఖాన్ని పులుముకుని
ముస్తాబు అవ్వాల్సిందే దిష్టి బొమ్మలా
వాడు పోయినా ఆ మసి మరొకడు
వచ్చే వరకో చచ్చే వరకూ పోదు
దానికన్నా ఏలిన నాటి శనే నయం .
వాడి బలుపంతా మలుపులలో వాడి
బోడి ప్లెక్సీ ల్లోనే, మిడటం బొట్లేసుకుని.
కులపోల్ల కులుకంతా రోడ్ల మీదే
జన బలంతో స్థల యుద్దమే చేస్తారు
ఎవడికి వాడు ఐకమత్యపు తోరణం కోసం
వాడొచ్చి వీడు పోయి వెళ్తారా,
నగరానికి ఈలోగా ఎల్లో ఫీవర్ పట్టుకుంటుంది
తేరుకునే లోగా మరొక ఊసరవెల్లి
నగరాన్ని ఆవహించి రంగుమారుస్తంది
నగరమూ మాలాగే పిచ్చిది, ఎవడే రంగేస్తే ఆ రంగే
పులుము కుంటుంది మరొక రంగు పడేదాకా.
అజీర్తితో అవులు రోడ్డుకు అడ్డంగా స్పీడ్
బ్రేకులౌతాయ్
ఆవులూ ఫ్లెక్సీలేగా దేశాన్ని శాసించే పాలకులిప్పుడు .
నగరం కళ్ళు రంగుల వలయంలో
తిరుగుతూ బైర్లు కమ్ముతున్నాయి
నా కళ్లు అసలు రంగులు గుర్తించే పనిలో ఉన్నాయి
డా.మాటూరి శ్రీనివాస్
No comments:
Post a Comment