ప్రకృతి పల్లకీలో ఊరేగే వెన్నెల వసంతంలో
కలకంఠపు కమ్మని పాట నీ కవిత్వం
అమావాస్య నిశిలో దిక్కు తోచని చుక్కలు అలమటించునట్లు
అన్నార్తుల ఆవేదనల అంబరం నీ కవిత్వం
వినుకొండ వినీలంలో అలుముకున్న ఆమానతల ఆక్రోశం
ఆర్తిగా అనుభవించిన గిజిగాడి గాయాల మూట నీ కవిత్వం
చిరుజల్లులో నీరెండ కుంచెతో పేదరికం
చిమ్మిన పంచ వర్ణ హరివిల్లు నీ కవిత్వం
నీ కళ్ళ రమ్యాలోకనం కులమతాలను మీరి
సమతతో ఆవిష్కరించిన ప్రపంచ పటం నీ కవిత్వం .
కవీ! జన్మభూమిలోనే కాందిశీకుడవై చరించిన వాడా!
నీవేదిగిన తీరూ పొదిగిన మేరూ
దేశాభ్యుదయానికి జాతీయతను అద్దిన అమృత సెలయేరు
హారతిపట్టిన శారదతో పేదరిక పరాకాష్టకు సాంగత్యం
అల్చిప్పకు స్వాతి చినుకుతో దాంపత్యం.
నీ కలం నీడలో మానవత మురిపెంగా స్వేద తీరింది
నీ కావ్యలాలన అల్లాడిన ఆకలిని హాయిగా మాయగా నిదురబుచ్చింది
జీవకారుణ్యలో సిద్ధార్థుడి కలలను మించిన సిద్ధహస్తుడవు
అహింసా క్రాంతి వెలిగిన బాపూజీ కాంచిన శుద్ధ గ్రస్తుడవు
ఆ కన్నులు చూడలేని , ఆ పెన్నులు రాయలేని
అనాధ అనుభవాలనూ, అభిదల పిలుపులను
వొడలెల్లా బాకులు దూసిన తలపులనూ
నీ దుఃఖ అగ్ని శిఖరం ఉద్వేగంతో కుతకుత లాడి
లావాలా ఎగజిమ్మింది కవితాగ్నిలా
ఎన్ని కలాలను,ఎన్ని గళాలను ఎన్ని కులాలను దహించివేసిందో?
ఎందరు పురాణప్రియులను పెనునిప్పులో కరిగించి కనువిప్పు కల్గించిందో?
ఎనలేని అప్రతిహాత సాహిత్య మధనంతో ఎన్ని మబ్బుతునకల్ని మరిన్ని
ముక్కల్ని చేసి ధిక్కారస్వరమై ఆమ్ల వర్షం కురిపించిందో?
అక్షర లక్షల శతాఘ్నుల శబ్దంతో నీ కవిత్వానికి
ఇలాతలం కంపించిన తీరు చెపుతుంది .
విశ్వ శాంతిని విరివిగా భూమార్గం పట్టించిన రవీ ,
విశ్వ ధర్మాన్ని పుడమి పంక్తిలో బోధించిన కవీ
విశ్వంభరను విశ్వకిరణాలతో నింపిన విశ్వనరుడవు
జాషువా! అమ్లానము, అపరిమేయ అస్వాదనం నీ కవిత్వం..
డాక్టర్ మాటూరి శ్రీనివాస్
28-09- 17

No comments:
Post a Comment