సమ్మోదము
..................
గులాబీల గోముతనానికి ఎవ్వరైనా
గులాములౌవాల్సిందే కదా!
ఏ రంగులో పూసినా ఆ అందాన్ని
ఎంతగౌరవిస్తాము ?
ఆ సుకుమారత్వాన్ని ఎంతగా
ఆస్వాదిస్తాము?
మరి,రకరకాల మనుషులను కూడా అలా ఎందుకు
చూడలేకపోతున్నాము?
ఒక్కొక్కరూ ఒకో తెలియనితనాన్ని వెదజల్లుతారని
ఎందుకు అనుకోము?
ద్వేషించడానికి కారణముండాలేమో...
మానవ పరిమళాన్ని ఆఘ్రాణించడానకి
అక్కర్లేదు.
నిద్రావస్థలోనున్న ప్రేమతత్వాన్ని
మేల్కొలిపితే చాలు.
కనిపించే ముళ్లు గ్రుచ్చుకుంటాయని
తెలిసు
అయితేనేం రోజాలను రోజూ
ఆనందించడం లేదూ!
కనిపించనివన్నీ చిక్కుముళ్లేనని
ఎందుకు భావించాలి?
మానవ మానస సరోవరాలెందుకు కాకూడదూ!?
పూచిన పూలకు కూడా సొట్టదీ గ్రుడ్డిదీ
అని పేర్లు పెట్టే నైజాన్ని ఎప్పుడు వదల్చుకుంటామో అప్పుడు
సహజంగానే మానవతా మంజరిగా
గుభాళిస్తాము...
డా.మాటూరి శ్రీనివాస్
No comments:
Post a Comment