“ హిందూ ” మహా సముద్రము
డాక్టర్ మాటూరి శ్రీనివాస్
అల్ల కల్లోలమై అలజడులు సృష్టిస్తావు
తీరు లేని తీర ప్రాంతాలలో తీవ్రం గా సంచరిస్తావు .
విశాల అలల సమూహాలు, నీ కోరికలు
సుడి గుండాలై మా కలలను సుళ్ళు గా త్రిప్పేసి అనంతాల్లోకి విసిరేస్తాయి..
అందినదీ,అందనిదీ అంతా నీదే నంటావు .
తెలిసినదీ తెలియనిదీ నీవేనంటావు
అందమైన ముసుగులో ఆధ్యాత్మిక లోసుగుల్లో
నురుగుగా మలచి బుద్భుదాలుగా ప్రేల్చ్చేస్తావు .
భిన్నత్వంలో ఏకత్వమనే జడత్వాన్ని వీడనంటావు.
ఎప్పుడు సునామీవై వస్తావో,
ఎప్పుడు బినామీవై కూస్తావో,
ఎప్పుడు గోద్రాని కాల్చేస్తావో,
ఎప్పుడు బాబ్రీ ని కూల్చేస్తావో ,
అంతు పట్టలేని అదృశ్య,రహస్య అజెండా నీది
లోలోనికి లాక్కుని జవజీవాలను పీల్చి పిప్పి చేసి
ఆనక ఆసాంతంగా విశ్ర మిస్తునట్లు నటిస్తున్న ‘అనకొండా’వు .
టైటానిక్ ఉద్యమాలనైనా తునాతునకలు చేసేసి
అమాంతంగా మ్రింగేసే సాగర సైన్యానివి
ఉన్నది కొంతైనా అయినా పెద్దచేపల దే ఈ నీ రాజ్యం.
జై హో హిందూ మహా సముద్రమా ! జైహో .
No comments:
Post a Comment