కాళీ పట్నం రామారావు మాస్టారికి 80 జన్మ దినాన శుభాకాంక్షలతో
కాలజ్ఞాని
మా గీతలు దిద్ది, రాతలు మార్చి,
మా బాల్యాన్ని సుమధుర కావ్యంగా ,
పురోగమన లౌకిక స్వరంగా , వరంగా మలచిన
మానవ బ్రహ్మ, కారణ జన్మ , విద్య ధర్మా !
అందుకో మా హృదయాలే నీ చెరగని చిరునామా
ఓ , సహృదయ మూర్తీ !
ఎప్పటికీ నీ శిష్యులమే, మరువలేము నీ ఋష్యత్వం
చెరగని, చిరునగవుల అలుపులేని మానవీయం .
ఔరా ! అనిపించు నీ కలం చేయు విన్యాసం,
రా ! రా ! అని పిలిచే నీ గళం లోని ఆత్మీయం ,
‘’కారా’’ అని పులకించు విశ్వ సాహితీ ఆకాశం.
మేమంతా నీ పిల్లలమని, నీ ఎల్లలమని
ఎలుగెత్తి చాటుతూ, ఖండా౦తరాలు మీటాము,
నీ యజ్ఞంతో పునీతమై, రసజ్ఞులుగా వెలిగాము.
అంతోనీ వొడిలోన , జోజి నాన్నల గుడిలోన
జ్ఞాన దీపమై వెలిగి , అవిద్యపు చీకట్లను అలవోకగా తరిమేసే
అవిశ్రాంత ఆచార్యా !
వన్నె పులుగుల గణిత శాస్త్ర జిలుగువి,
సాంఘీకాన్ని నేర్పించిన సామాజిక వెలుగువి,
తెలుగుతనపు సత్య వసంత మెరుగువి,
ఇల , అవతరించిన అవిరామ కధల కాల జ్ఞానివి,
మా ప్రియ ‘’ కారా ‘’వి, మా సాహిత్యపు సహారా వి.
‘కధా నిలయ’ విజ్ఞాతుడా , లబ్ద వర్ణ జిజ్ఞాసుడా,
మాలోలోన విహరించు కళల కధల పల్లకీవి -
తెలుగింటి పచ్చని నిత్య తమల తోరాణి వి .
అందుకో , మా అక్షర దక్షిణాన్ని , ప్రాణాభినందనాన్ని....
.....డాక్టర్ మాటూరి శ్రీనివాస్ (1978 batch )
Mobile ;09849000037.
No comments:
Post a Comment