Tuesday, 14 November 2017

శకాది

శకాది

డాక్టర్ మాటూరి శ్రీనివాస్

నిన్నో నేడో ఎప్పుడు రావాలో తెలియని సందిగ్ధలో
పీఠాల పీట ముడుల విప్పుకుని
హేవళంబి ఎప్పుడొస్తుందోనని తికమక.
ఏదో రాద్దామని ఎగబడి ఏమి రాస్తే ఏ దేశద్రోహమౌతుందో
తెలియక , కలం కాగితాన్ని ముట్టనని
ఉపవాసంతో ముడుచుకు కూర్చుంది, రంజాన్ మాసపు రోజా లా
ఊరుకోక అకాల గాలివానకు రాలిపోగా మిగిలిన పూత
బహుసా తెలుసేమో నాణ్యత సంగతెత్తకుండా
నవ్యమైన కవిత ఒకటందుకోమంటూ కవ్వించింది.
ఎప్పుడూ ఉన్న కొత్త చింతకాయ పచ్చడే కదా ఏముందిలే అనబోతే
దేశ ద్రోహం కింద బుక్కైపోతావ్ జాగ్రత్తని వేపకాయ వెక్కిరించింది .
రాస్తే ఎవరి మనోభావాల గాయాలకు కుట్లు వేయాలో
ఏ మనువు ఏ రూపంలో ఎవర్ని రక్షించడం
కోసం ఎవరికి ఏశిక్ష వేయిస్తాడో ? ఏమో కానీ ,
రాయకపోతే ఎలా ? నాలో కవిగాడు పెద్ద నిద్ర లోకి జారుకోడూ?
పెరుమాళ్ మురుగన్ లా మరుగుపడి పోడూ ? .
అసలు ఈ దేశభక్తి అనేది ఉంది చూసారూ,
మశూచిలా పట్టుకుంది మానవాళిని
మరి జాతీయతంటారా? మతానికి మారుముఖమై జాతిని
జోకొడుతున్న మేక వన్నె పులి
మనుషులంతా ఒక్కటే ,అందరి దేవుళ్ళూ ఒక్కరే అంటారుగా

మరి అన్ని దేశాలకూ ఒకే జాతీయత ఎందుకుండదో ?
నదులు కలిసిన సంద్రంలా అపుడంతా ఉప్పనే గా.
ప్రపంచీకరణ అంటూ అంతా కలిపేసి నప్పుడు
రాం రహీం కలిసే ఉన్నప్పుడు , మందిర్ మసీదు ఒకేచోట మనలేవా?
కనీసం బొమ్మా బోరుసుల్లాగైనా సరే.
ఏదేమైనా విశ్వకవి వారసున్ని , విశ్వ నరుని శ్రావకున్ని
ఎక్కడి వాడైన మనిషే నాకు ప్రమాణం , మానవతే నా జాతీయత
దేశ ద్రోహినంటారా, బ్రతకడం బ్రతకనీయడం దేశద్రోహమైతే సరే
విశ్వంభర నా దేశం ప్రపంచవాదమే నా జాతీయత ..
ప్రపంచానికి మేలు చేయడమే ధ్యేయంగా రా
హేవళంబి కొత్త శకానికి ఆదిగా శకాది గా రా .

వార్త

వార్త

డాక్టర్ మాటూరి శ్రీనివాస్

ఎన్నేళ్ళుగా ఎదుర్ుచూస్ుత న్ాేన్ో
ఆ చిన్ే వార్త కోస్ం,
చూసి తృప్ితగా క్న్ుే మూద్ాా మని
ప్రతీ రోజూ ప్రతీ వారాత ప్త్రరక్న్ూ త్రర్గేస్ుతన్ాే
ఆతరంగా అలిసిన్ క్ళ్ుతో .
కానీ ఏ మూలా ఏ మీడియా లోన్ూ
క్నీస్ం ప్రక్టన్గా న్ ైన్ా కాన్రాలేదు ఆ వార్త
ద్ానికీ క్ులం ఉండాలిగా .
ఆ వార్తన్ు న్నన్న కాదు ఇక్ ఎవ్వర్ూ చూడబో రేమో
తెప్ప ోతసవ్ం రామన్వ్మి గోర్క్ష, క్ప్ో స్తంభ
ఆలింగన్మంత గొప్ో వారేతమీ కాదుల ండి.
క్ంచిక్ చర్ల కోటేస్ుని కాటేసిన్ క్ులస్ర్ోం
ఆధిప్తయప్ు విషానిే రాజకీయకోర్లతో
చిమిి మంధని మధుక్రిే మటటట బెట్టంద్ి
ప్ర్ువ్ు హతయలు ప్రకోప్ించిన్ా, ప్ార ణాలూ మాన్ాలు
ఆర్తన్ాద్ాలు అన్ాయయమని అకోీశంచిన్ా
అయిన్ా ఎప్ుోడెైన్ా ఎక్కడెైన్ా ఈ ద్ేశంలో
దళితుడి న్ాయయం జరిగింద్ా?
ఆ వార్త రావ్డానికి, ప్త్రరక్ల ఉనికి చాటడానికి

కన్యాదయనం

కన్యాదయనం



‘అన్నీ క్లిసొ చ్ాాయి. క్ులం గోత్రం చక్కగా క్ుదిరాయ్ .శుభస్తు శ్రఘ్రం .ఇంక ందతక్ు ఆలస్యం ముహూర్ుం
పెటటటస్తక ండి. ననీడిగితే వచ్ేా నెల నాలగవతారీఖతన మంచి ముహూర్ుం ఒక్ట ంది. చ్ాలా దివయమ ైనది. సీతారాముల
క్లాయణం అదే ముహూరాునికి జరిగిందట. అందర్ూ అదే రోజునత క ర్ుక్ుంటార్ు. అర్ుదతగా వచ్ేా ఆ ముహూరాు నికి
లక్షల పెళ్ళిళ్ళి జర్ుగుత్ూ ఉంటాయి ’- అంటూ కాఫీ క్ప్పు టీపాయ్ మీద పెటటట క్ురీాలో వెనకిక జార్బడాా డు,
అమాాయి శ్ాీ వణి మేనమామ.
ఒక్క శ్ాీ వణి త్ండిర రామచందర రావప త్ప్ు, మిగతావార్ంతా ఒక్కసారి ఉలికిక ప్డి స్ర్ుు క్ునాీర్ు. అలా అయితే
ఇంకా నెలా ప్దిహేనత రోజులు మాత్రమే వయవధి ఉంట ంది. ఆయన క్ూడా అదే ముహూరాు నికి స్తముఖంగా ఉనాీడు.
గత్ నెల రోజులుగా అదే ప్ని మీద ఉండి, ఎందతక ైనా మంచిదని ఏరాుట ు క్ు అప్పుడే ప్పర్మాయించి ఉంచ్ాడు. ఏ
చినీ ప్నెైనా శ్ాస్ుో క్ుంగా చ్ేయడానికి ఇష్టప్డతాడు రామచందర రావప. భార్యనెైనా స్ంప్రదించడం మరిచిప్ తాడేమో గాన్న
వారి ఆసాా న ప్పరోహిత్ుని ఆజఞ లేనిదే ఆయన టీలో ప్ంచదార్ క్ూడా వేస్తక డంటట అతిశయోకిు కాదేమో. క్నతక్ ఆ
స్ంప్రదింప్పలూ అయిప్ యాయి. ఈ స్ంగతి ఎవవరికీ తెలీదత. అత్డో బ ంక్ ఉదోయగి .ఆ మేర్క్ు స్ంపాదించ్ాడు. ర ండు
ఫ్ాు ట ు ,ర ండు పాు ట ు ఉండగా ఒక్ఫ్ాు ట్ , ఒక్ పాు ట్ ఉనీ ఒక్క క్ూత్ురి పేరా ఉనీట ు ముందే ప్రక్టటంచ్ేసాడు. శ్ాీ వణి,
క్ుందనప్ప బొ మా. గుణ వంత్ురాలు, ఇంజన్నర్ు. ఈ కాలప్ప పిలేు జీన్స్ వేస్తక్ుని మోడర్న్స గా క్నిపిస్తు ందే కాన్న
ప్దుత్ులూ,స్ంప్రదాయాలు తెలిసిన పిలు. గుళ్ళి గోప్పరాలు అతిగా తిర్గక్ప్ యినా దెైవభకిుకీ పాప్భీతికీ
విలువనిస్తు ంది. ఉనీ ఊళ్ళి స్ంబంధం. క్ురాీ డిదీ క్ూడా అనిీ విధాలా అనతవెైన క్ుట ంబం. వియయంక్ుడు అర్వింద
రావపది క్ూడా బ ంక్ ఉదోయగమే కాన్న వేరే బ ంక్ులో. ఆయనక్ు ఒక్ కొడుక్ు, ఒక్ క్ూత్ుర్ు. క్ూత్ురికి ర ండు
స్ంవత్్రాలకిీత్మే తెలుగుదే ఆసేటోలియా సాఫ్టట వేర్ స్ంబంధం చ్ేసాడు.
శ్ాీ వణి మేనమామ మాటలు విని కాబో యిే వియయంక్ుడు అర్విందరావప,అత్ని భారాయ నిశ్బుంగా వింట నీ
అవినాష్ ఒక్సారి ముఖాలు చూస్తక్ునాీర్ు. ముగుగ ర్ూ ప్రశ్ాంత్ంగా వినడం గమనించి కాస్ుఅవత్ల ఉనీ డెైనింగ్
టటబుల్ క్ురీా లో క్ూర్ుానీ శ్ాీ వణి మనస్త క్ుదతట ప్డింది.
‘మిగలిన విష్యాలు క్ూడా మాటాు డేస్తక ండి, మీర్ు అవేమీ మీర్ు పెదుగా ప్టటటంచతక ర్ని అనాీర్టగా ,
అయినా ఒక్ మాట అనతక్ుంటట బాగుంట ంది క్దా ! ,’ మళ్ళి త్న పెదురికానికి ప్ని చ్ెపాుడు, మేనమామ. అవకాశము
వచిానప్పుడలాు మేనమామ త్మ బావగారి క్ుట ంబ విష్యాలు, వారి ఆచ్ార్ వయవహారాలూ,
సాంప్రదాయాలు,క్ట ట బాట ు పిలులనత పెంచిన విధానం, వారి క్ీమశిక్షణ గురిచి ఏక్ర్ువప పెడుత్ునాీడు.
త్లిు త్ండుర లు శ్రీత్ల ై పేరక్షక్పాత్రలోనే ఉండిప్ వడంతో కాస్ు అస్హనం ఆవరించింది అవినాష్ ని. త్న మనతస్తలో
మాటలు,త్న అభిపార యాలు ముందే త్లిు త్ండుర లక్ు చ్ెపాుడు. కాన్న అక్కడి వాతావర్ణానిీ గమనించి గముాన
ఉండిప్ యార్ు,వాళ్ళిదుర్ూ. పెళ్ళు చూప్పలూ,ఇలుు చూప్పలు లాంటటవాటటకి వొప్పుక డు, అవినాష్. కాన్న పెదులమాట
కాదనలేక్ వచ్ాాడు. గత్ంలోనే శ్ాీ వణిని చూసి ఇష్టప్డాాడు. కామన్స ఫెరండ్ క్ూత్ురి పెళ్ళు లోనే వీళ్ిక్ు పెళ్ళిచూప్పల

ఏరాుట ు చ్ేశ్ార్ు. శ్ాీ వణికీ అవినాష్ీక పెదువాళ్ళి కాజువల్ గా ఆ ఏరాుట ు చ్ేసార్ని తెలుస్త. ఆనక్ ‘అవపనత వాళ్ళిదుర్ూ
ఇష్ట ప్డాా ర్ని’ పెదులక్ూ తెలిసింది . అందతకే వయవహార్ పెళ్ళు మాటలు వారాలూ వచిాంది. క్నతక్ చినీచినీ పెళ్ళు
ప్నతలు మొదలు పెటాట ర్ు క్ూడా.
‘ సార్ ! మీర్ు ఒక్ నిమిష్ము ఆగుతారా?’ అనాీడు మేనమామనత. స్డన్స గానే అయినా నిదానంగా అనాీడు
అవినాష్ . ఒక్క సారి అందర్ూ అవినాష్ వంక్ తిరిగార్ు . అదివిని కాస్ు త్డబడుత్ూ త్న దూక్ుడునత త్గిగంచి అలాగే
అనీట ట స్ర్ుు క్ుని క్ూర్ుానాీడు.
‘చ్ెప్ుండి నానీ , మీరేమీ మాటాు డడం లేదేంటట ? ‘అడిగాడు త్ండిరఅర్వింద్ రావప ని అవినాష్ పెళ్ళు కొడుక్ు.
‘మనవెైప్ప నతండి డిమాండుు ఏవీ లేవపక్దరా నానాీ!’ అనాీడు త్ండిర. అవినాష్ మనస్తలోని అలజడిఅత్నికి తెలుస్త
. అయినా చతటూట ఉనీవాళ్ినత బాధపెటటడం ఇష్టం లేక్ అలా అనాీడు .
అవినాష్ త్లిుక్ూడా ‘అది కాదత రా నానాీ ! ఆడపిలు వార్ు , వార్ు చ్ెపాులి్నదిఎదో ప్ూరిుగా చ్ెప్ున్న , మనం
ముందే ఏమీ వదునతక్ునాీం, మిగతావి స్రే,’ అంది త్లిు. ఆమ క్ూ తెలుస్త అవినాష్ ఏమి క ర్ుక్ుంట నాీడో.
అవపననీట ు త్ండిర త్లూపాడు.
‘ఏమిటట బాబు, ఏమిటట అభయంత్ర్ం ? ఇంకా ఏమ ైనా కావాలా? కొత్ు కార్ు వగ ైరాలాు ంటటవి,’ ఉండలేక్ మళ్ళి
క్లిుంచతక్ునాీడు మేనమామ.
ఆ ప్రశీక్ు అత్నివెైప్ప వెటకార్ంగా నవపవత్ూ చూసాడు అవినాష్. శ్ాీ వణి వాళ్ి అమావెైప్ప చూసింది. ‘నతవపవ
ఉండనీయాయ,అలుు డు గారిని చ్ెప్ున్న ’ ఆని ఆపిందిఆమ . అమా అప్పుడే వర్స్ క్లిపేసి అలుు డుగార్ు అనడం నవపవ
తెపిుంచింది శ్ాీ వణి కి .
‘అపార టమంట్, మధతర్వాడలోని ఆర్ువందల గజాలూ సెైట అమాాయి పేర్ు మీదే ఉనాీయని ముందే చ్ెపాునతగా,పెళ్ళు
ఖర్ుాలన్నీ మావేఅనిక్ూడా నానీ గారితో చ్ెపాుం బాబూ ’..మళ్ళి సాగదీసాడు ,రామచందరరావప . ఇక్ అవినాష్ నోర్ు
విప్ుక్ త్ప్ులేదత.
నానీగార్ు నేనత మాటాు డుతానతఅంటూ సెైగ చ్ేస్ూు మొదలుపెటాట డు, అవినాష్ .
‘అంక్ుల్ ! నేనొచిాంది శ్ాీ వణిని పెళ్ళిచ్ేస్తక వడానికి మాత్రమే . మీర్ు స్ంపాదించతక్ునీవి అన్నీ మీర్ు మీతోనే
ఉంచతక వచతా. వాటటతో నాక్ు ప్నిలేదత. నానీగార్ు ఆమాట మీక్ు ముందే చ్ెపాుర్ు,క్దా! ’ అనాీడు కాస్ు సిార్ం గా
అవినాష్ .
‘అవపనత నానాీ! ఆ విష్యం వీళ్ికి తెలియచ్ేసానత. ఇంకేమ ైనా ఉంటట ప్రేుదత, నిరమాహమాటంగా చ్ెప్పు’.. అనాీడు
త్ండిరఇక్ ఆపినా ఆగడని తెలిసి .
‘నా పెళ్ళు విష్యంలో నాక్ు కొనిీ అభిపార యాలు, కొనిీ నియమాలునాీయి , ఇది మా పెళ్ళు విష్యం కాబటీట మమాలిీ
మా ఆలోచనలనత క్ూడా ప్రిగణలోనికి తీస్తక వడం త్లిు త్ండుర లుగా మీ మీ బాధయత్.’ అని చ్ెప్ుడం ఆపాడు.
అక్కడే కాస్ు దూర్ం గా క్ూర్ుాని అంతా గమనిస్తు నీ శ్ాీ వణి గుండె వేగం పెరిగింది . గత్ నెలలో ర్మ పెళ్ళిలో క్లిసి,
చూస్తక్ునీ త్రావత్ వారిదురి మధయ సేీహం ఏర్ుడిందన్న, ఒక్రినొక్ర్ు తెలుస్తక వడానికి ప్రయతిీస్తు నీరాన్న

పెదువాళ్ిక్ు తెలీదత. గత్ నెల రోజులుగా మ సేజులోు నూ , ఫ్ నోు నూ ఎంతో హ ందాగా వయవహరించ్ాడు.ఇప్పుడేమిటట? ,
స్డన్స గా ఏదో పిత్లాటక్ం పెటటటటట ు నాీడు. కొంప్దీసి ఫార న్స ప్ంప్మంటాడా ఏమిటట? ఏదో అనతమానం ఆందోళ్నగా
మ దిలిందిఆమ మనస్తలో. ఒక్కసారే మనస్ంతా దిగులుగా అనిపించింది .క్ళ్ళి మూస్తక్ుంది .
‘మూడు విష్యాలు మీతో స్ుష్టం గా చ్ెప్ుదలచతక్ునాీనత.’ మొదలుపెటాట డు అవినాష్
వోరి నాయనో ఒక్టట కాదత ర ండు కాదత మూడట, ఏమి ముస్లం తేబో త్ునాీడో ఈ కాబో యిే మొగుడు. కాబో తాడో,
కాక్ుండా ప్తాడో ఏమీ అర్ధం కావడం లేదత, శ్ాీ వణి కి. ఆమ నత ఒక్ అశ్ాంతి ఆవహించింది. పెళ్ళిలో చూసినప్ుటట
నతండీ అత్నిీ ఇష్టప్డడంమొదలుపెటటటంది. అప్పుడప్పుడు చినీచినీ మ సేజిలు వాట్్అప్పులు లో ప్లక్రింప్పలూ
జర్ుగు త్ునాీయి. ఎప్పుడెైతే అత్నికి క్ూడా త్నత ఇష్టమని గమనించినప్ుటట నతండీ అత్నితో మానసిక్ంగా
పెనవేస్తక్ు ప్ యింది. క్లల ైతేపెదుగా క్నలేదత గాన్న, ఏవేవో ఊహలక్ు స్ పానాలు వేస్తక్ుంది. బాస్ల ైతే చ్ేస్తక లేదత
గాన్న ఊస్తల నోీ చ్ెప్పుక్ుంది. ఇప్పుడేంటట ఇత్గాడిలా. అత్ని మీద ఉనీ గౌర్వం, స్దాభిపార యం వముా కాక్ూడురా
దేముడా! అనతక్ుంది, మనస్తలో.
అందర్ూ ఒక్కసారి అటనషన్స లోకొచిా ఏమి చ్ెప్పతాడో అని చూస్తు నాీర్ు . అందరి మొహాలు చూసివారి అందోళ్న నత
ప్సిగటటట,
‘మొదటటది , వచ్ేా నెల మీర్నతక్ునే ముహూరాు నికి నేనత సిదుంగా లేనత. ర ండవది , పెళ్ళికి ముందత కాన్న పెళ్ళు త్రావత్
కాన్న మీర ప్పుడూ ఏమీ ఏ ర్ూప్ంలోనూ మాక్ు ఇవవక్కర్లేదత....’ అని నిదానంగా చ్ెప్పత్ూ
‘మూడవది, ముఖయమ ైదీ...’ అని ఆగాడు . టెనషన్స పెటటక్ చ్ెప్ురా బాబూ అనీట ట అందర్ూ అత్ని వెైప్ప చూప్పల
సాట ండ్ వేసార్ు.
‘కాళ్ళి క్డగడం, క్నాయదానం చ్ేయడం లాంటట అతివాద స్ంప్రదాయల మీద నాక్ు స్దాభిపార యం లేదత, అందతక్ని పెళ్ళు
లో అలాంటట అనవస్ర్ త్ంత్ుక్ు నేనత వయతిరేక్ం, దయచ్ేసి అలాంటట అశ్ాసుీయ
ప్దధత్ులక్ు ఇబబంది పెటటట, వాటటకి
ననతీ బలి చ్ేయవదతు . మీక్ు కావలిసినవి మీ నమాకాలమేర్క్ు మీర్ు చ్ేస్తక వచతా, ననతీ ఇనావలువ చ్ేయనంత్
వర్క్ూ నాక్ు అభయంత్ర్ం లేదత.... అయితే ఇక్కడ నాకొక్ క రిక్..దానికి మీర్ందర్ూ స్హక్రించ్ాలి,...’ అని అందర్ూ
ఆత్ుర త్గా వినడం గమనించి
‘నేనే మీక్ు కాళ్ళి క్డిగి , శ్ాీ వణి ని దానంగా తీస్తక్ుంటానత’ అని కాబోయిే మామగారి వంక్ చూసాడు.
మేనమామ నోర ళ్ిబెటాట డు. వాతావర్ణం గంభీర్ంగా మారిప్ యింది. మేనమామ క్ురీాలోంచి లేచి బయటక్ు
ప్ యాడు. రామచందర రావప చ్ేవికేదో అప్స్ృతిలా అనిపించింది. శ్ాీ వణి త్లిు అలుు డుగారికేమ ైనా పిచ్ాా అనీట ట శ్ాీ వణి
వంక్ చూసింది. అవినాష్ ఈ ప్రసాు వన శ్ాీ వణి దగగర ప్పుడూ తేలేదత. ఆమ క్ూ ఆశార్యమేసింది. అయితే వెంటనే
తేర్ుక్ుని అబాబయిలు ఇలా క్ూడా ఆలోచిసాు రా? అని ముచాటటసి అత్నివెైప్ప క్ృత్జఞత్గా చూసింది.
‘ఆచ్ార్ వయవహారాలనత కాదనలేము క్దా! బాబు.’ ర ండవ సారి శ్ాీ వణి త్లిు నోర్ు విపిుంది. వయవహార్ం చ్ెడక్ుండా. త్ండిర
ఇంకా తేర్ుక లేదత.

‘నేననీవన్నీ మీక్ు వింత్గా తోచవచతా. కాన్న, అలాగే ముదతు ముచాట ు పేర్ుతోనో ఆచ్ార్ వయవహారాల పేర్ుతోనో
ననతీ అవపననమని ఆంక్షలు పెటటట దతు’. ..అనాీడు దృడంగా .
ఓరి నా మొగుడో, ఏం మ లిక్ పెటటవపరా? అని మనస్తలో మురిసిప్ త్ూ పేరమగా అవినాష్ ని అలా చూస్ూు
ఉండిప్ యింది శ్ాీవణి. అదే టెైం కి అవినాష్ ఆమ వంక్ చూసి ఆమ క్ళ్ులో మ ర్ుప్ప చూసి ఆపాయయంగా ఒక్ చినీ
నవపవ విసిరాడు. అత్ని నవపవ ఆమ క్ు ఒక్ జీవిత్కాలమంత్ భరోసాలా అనిపించింది. అప్ుటటవర్క్ూ చ్ాలా పార కిటక్ల్ గా
అత్నితో స్ంభాష్ిస్ూు త్లిుత్ండుర లకే త్ుది నిర్ణయానిీ వదిలేసినా ఆమ క్ు అత్ని ప్టు పేరమో,ఆరాధనో ఏమో, ఒక్
ఆతీాయ అనతరాగం చిగురించింది. ఇక్ ఇత్నితోనే త్న జీవిత్ం అని ఫిక్్ అయియంది.
అవినాష్ ఒక్ మలీట నేష్నల్ క్ంప్న్న లో హెచ్ ఆర్ ఇంచ్ార్్ గా ప్నిచ్ేస్తు నాీడు. 12 లక్షలు పేకేజ్ . మానవ
స్ంబంధాలక్ు విలువనివవని క్ర్ుక్ుగా వయవహరించ్ాలి్న ఉదోయగం. క రీరిస్ట అయి ఉంటాడనతక్ుంది. అయితే ఆఫీస్ లో
నెైతిక్ విలువలక్ు పార ధానయత్నిస్ూు , బాధయత్ గల వయకిుగా గురిుంప్ప పొందాడు. ఆ బార ంచ్ కి టీం లీడర్ క్ూడా. పెదుగా
మాటకారి కాక్ప్ యినా,ముక్ుకస్ూటటగా మాటాు డుత్ూ, త్న అటటట ట ుడ్ మనతష్ులనత గ లవగల నెైప్పణయం గలవాడు. ఈ
త్రానికి ప్రతీక్గా ఉండాలని క ర్ుక్ునే మనస్ుత్వం క్లవాడు. ప్రతీ విష్యానిీ త్నక్ు తానతగా త్రికంచతక్ుని
హేత్ుబదుంగా తోచితేనే అంగీక్రించడం అలవాట చ్ేస్తక్ునాీడు. దేన్నీ గుడిాగా నమాక్ూడదనేది అత్ని వాదన.
మత్మూ ఆచ్ార్మూ వాయపార్ల ైప్ యినా ఈ రోజులోు యువత్ అంతా మూడు విభినీ దృక్ుదాలోు నడవడం ఇప్పుడు
ఫేష్న్స. ఒక్ర్క్ం యువత్ మితిమీరిన విచాలవిడిత్నంతో చ్ెడు వయస్నాలక్ు బానిస్ల ై, ప్బుబలూ,’లివింగ్ –
ట గ దర్’లూ, ఫీర సెక్్ అంటూ అస్మంజ స్ంస్కృతిని ఫేష్న్స గా ప్ ష్ిస్తు నాీర్ు. మరమక్ వెైప్ప శ్ాసుీయ
మ ైన ఉనీత్
విదయలనత అభయసిస్ూు నేఆహేత్ుక్మ ైన ఆచ్ారాలనత మూడతావనిీ ప్ ష్ిస్ూు గుడులు చతటూట , సావములు చతటూట
తిర్ుగుత్ూ మత్వాయపార్ంలో పావపల ైప్ త్ునాీర్ు. శ్ాసుీయ
దృక్ుధానిీ సెైంటఫట క్ి టెంప్ర ాంట్టని క లో

ుత్ునాీర్ు.
అలోచించన్నయడానికి వీరికి మత్ం గాన్న, ఇంటలు వాతావర్ణం గాన్న, ప్రిస్రాలుగాన్న అనతక్ూలంగా లేక్ప్ వడమే
కార్ణం. నేటట స్మాజ అవస్రానిీ గుర ురిగి, అభుయదయ భావాలునీవార్ు క్ూడా ఉనాీర్ని అవినాష్ లాంటట వాళ్ళి
మనక్ు గుర్ుు చ్ేసాు ర్ు .
కాసేప్ప నిశశబుం త్రావత్ చతటూట ఉనీ అందరి మొహాలోు మిక్్ డ్ ఫీలింగ్్ నత గమనించ్ాడు,అవినాష్ .
కొడుక్ు ఔనీతాయనికి అత్ని త్లిు త్ండిర ఎంతో గర్వప్డిన అర్ుదెైన క్షణాలవి. అర్విందరావప అత్ని భార్య మొహాలు
చూస్తక్ునాీర్ు. వాళ్ిలో ఒక్ అనిర్వచన్నయమ ైన ఉదివగీత్నూ, వారి ఇదురి క్ళ్ళి చ్ెమర్ాడానిీ శ్ాీ వణి
గమనించింది. ఆమ క్ు క్ూడా మనస్ంతా అవినాష్ పెై పేరమతో నిండిప్ యింది.
దావర్ం బయట నతండీ అంతా గమనిస్ూు ‘కాన్న , ఆడపిలు గలవాళ్ిం మా ముదూు ముచాటా మాక్ుంటాయ్ గా
బాబూ,’ అని నసిగుత్ూ మళ్ళి లోనికొచ్ాాడు మేనమామ.
‘నిస్్ందేహంగా ఉంటాయి. కాదననత. వాటటని మీర్ు తీర్ుాక ండి, శ్ాీ వణి మీద నేనత గాన్న , నా త్లిు త్ండుర లు గాన్న
ఎట వంటట ఆంక్షలూ పెటటం, అలాగే మాక్ూ కొనిీ నెైతిక్ విలువలుంటాయి క్దా?’ అనాీడు అవినాష్ .

‘చ్ాలా బాగుంది, చినీ వాడివెైనా గౌర్వించదగగ విష్యాలు చ్ెపాువప,కాన్న వచ్ేా నెల లో పెళ్ళికి ఎందతక్ు సిదుం గా
లేవో చ్ెప్ులేదత. పెళ్ళు మేమే చ్ేసాు ంగా.. పెైగా అందరికీ చూచ్ాయిగా చ్ెపెుస్తక్ునాీం క్ూడానూ ., అదతబత్మ ైన
ముహూర్ుం మళ్ళి ఎప్ుటటక గానూ రాదత ‘ అనాీడు శ్ాీ వణి త్ండిరకి ప్రక్కగా క్ురీా లాక్ుకంటూ మేనమామ .
‘పెళ్ళు ఎవర్ు చ్ేసేదీ అనేది ఇక్కడ స్మస్య కాదత సార్.. మా అమా నానీ లక్ు స్ంబంధించిన బాధయత్ ఒక్టట నాక్ు
ఉంది. దానిీ నేనత నెర్వేరాాలి. దానికి మూడు నెలలు వయవధి కావాలి....’
అందర్ూ మొహాలోు క యశాన్స మార్ుక చూసి... ‘నా చ్ెలిు ఇప్పుడు ఎనిమిదవ నెల గర్భవతి, ఆమ భర్ు ఉదోయగ రీతాయ
ఆసేటోలియాలో ఉనాీడు . ఆమ డెలివరీ బాధయత్లు మాక్ునాీయ్. నేనత అవి నెర్వేరాాకే నాపెళ్ళు . దీనికి శ్ాీ వణి
అభయంత్ర్ం పెటటదని నేననతక్ుంట నాీనత..’ అనాీడు శ్ాీ వణి వంక్ చూడక్ుండానే.
బాస్ కి ఎంత్ నా మీద ఎంత్ నమాక్ం ,అప్పుడే నా త్ర్ప్ప నిర్ణయాలు క్ూడా తీసేస్త క్ుంట నాీడు, అనతక్ుంటూ విన్న
విన నట ు ఏటల చూసింది. అందర్ూ ఆమ వెైప్ప తిర్గడం చూసి.
‘అవన్నీ నేనత అమా చూస్తక్ుంటాము లేరా నానాీ, ! వాళ్ి సెంటటమ ంట్ నత క్ూడా మనం గౌర్వించ్ాలి క్దా! ,పెైగా
ర ండు క్ుట ంబాలు క్లిసే వేళ్ ఇలాంటట ష్ర్త్ులతో వాళ్ిని ఇబబంది పెటటడం బాగోదేమో , ’ అనాీడు త్ండిర అదేమీ
పెదు విష్యం కానట ు .
‘అవపనత బాబూ ! ఆ ఆస్తప్తిర వయవహారాలక్ు మేమంతా లేమా? మిగాతావంటావా, అవి త్ప్ుదత , ఎలా అయితే
జర్గాలి్ందే ’ ఇంచతమించత ఒకేసారి అనాీరిదుర్ూ , మేనమామ, కాబో యిే మామ . వాళ్ి మాటలోు ని అంత్రార్ధంలో
అర్ధకానిదేమీ లేదత.
‘క్షమించండి మీ సెంటటమ ంట్్ క్ంటట నాక్ు బాధయతే ముఖయం, పెళ్ళు అయాయక్ శ్ాీ వణి ని నిర్ుక్షయం చ్ేసి ఆస్తప్తిర చతటూట
తిర్గలేనత. మా జీవితాలనత మమాలిీ పాు న్స చ్ేస్తక నివవండి...పీుజ్ ..‘అనాీడు.. కాస్ు సిార్ంగా. నిజానికి అత్నికి
ముహూరాు ల విష్యంలోనూ పెదుగా గౌర్వం లేదత.
అవినాష్ అలా ఖచిాత్ంగా మాటాు డేస్రికీ రామచందరరావప లోని అసిుత్వ భావజాలం ఉలికిక ప్డింది. ముహూరాు ల పెై
నమాక్ం, అత్ని పెదురిక్ం, అన్నీ ఆహాంగా గా మారి ప్యాయి. కాస్ు అస్హనంగా
‘ఎటటట ప్రిసిుత్ులోునూ ఆ ముహారాు నికే ఈ పెళ్ళు జరిగేట ట మీర్ు చూసేు బాగుంట ంది. స్గం ఏరాుట ు ఇప్ుటటకే
బెతాు యించ్ేసానత, ఇప్పుడు తేదీ మార్ాడం అంటట బాగోదత. పెైగా ఎప్పుడూ ఏదోఒక్టట వస్ూు నే ఉంటాయి, జర్గాలి్న
వాటటని వాయిదా వేయడం ఎందతక్ు? జర్గనిచ్ేాదాు ం..,’ డిసెైడ్ చ్ేసేసినట ు అర్విందరావప తో అనాీడు రామచందర
రావప.
అత్ని మాటలోు మొదటటసారి ఒక్ర్క్మ ైన ఆధిప్త్యం క్నప్డింది. రామచందర రావప కొనసాగించ్ాడు ‘ ఈ మధయ
కాలంలో వచ్ేా అతి శ్రీష్టమ ైన ముహూర్ుము అదే కావడం వలన దానికి ఎక్ుకవ డిమాండ్. దాంతో కొనిీ ముందస్తు
ఏరాుట ు చ్ేస్త క్ునాీనత, ఒక్క గానొక్క క్ూత్ుర్ు భవిష్యత్ుు బాగుండాలని భగవంత్ునిీ క ర్ుక వడంలో
త్ప్పులేదతగా’- అని సెంటటమ ంట్ టచ్ ఇచ్ాాడు.

అవినాష్ త్లిు త్ండుర లు అయోమయంలో ప్డాా ర్ు. గటటటగా ఆలోచిసేు ఇది మరీపెదు గమప్ు స్ంబంధమేమీ కాదత. వాళ్ి
బాయంక్ు ఆఫీస్ర్ుక దగగర్ బంధతవప,ఈ రామచందర రావప . ఒకే ఊర్ు, ఒకే క్ులం అనే ఒకే పార తిప్దిక్న వొప్పుక్ునాీర్ు.
రామచందరరావప మాటలోు ని క్ర్ుక్ుదన కాస్ు బాధ క్లిగించింది. కొడుక్ుది మనోబలం గల వయకిుత్వం. ఎవరి మీదా
ఆధార్ప్డే మనిష్ి కాదత.
‘వచ్ేానెలలో మాత్రం క్ష్టం. అ వచ్ేా నెల లో ఏదెైనా మంచి ముహూర్ుం చూడండి. మిగతా విష్యాలనత క్ూడా
తేలిక్గా తీస్తక వదతు,..’ అంటూ శ్ాీ వణి వెైప్ప చూసి లేచ్ాడు అవినాష్. అంత్ క్ట వపగా అట నతండి తిరిగి స్మాధానం
వస్తు ందనతక లేదత, రామచందర రావప. క్ురోీడు త్న హెచ్.ఆర్.ఏంగల్ చూపిస్తు నాీడనతక్ుని నవపవత్ూ క్ళ్ితోనే బాయి
చ్ెపిుంది.
‘వసాు ము,అన్నీ స్వయంగా జర్గాలని క ర్ుక్ుందాం, .. అలోచించి చ్ెప్ుండి’ అని బయలుదేరార్ు,అత్నితోపాత్ూ అత్ని
త్లిుత్ండుర లు .
‘అలోచించ్ేదేముందీ , అనతక్ునీప్రకార్ం జరిగితే బాగుంట ంది.’ అంటూ నసిగాడు మేనమామ, గేట దాకా
సాగనంప్పత్ూ .

----------------------

ప్దిరోజులు గడిచ్ాయ్. ర ండువెైప్పలనతండీ ఎట వంటట ఫ్ నతు గానే ఉత్ుర్ప్రత్ుయత్ురాలుగాన్న, క్బుర్ు గాన్న లేదత.
రామచందరరావపకి క్ూత్ుర్ు బంగార్ు భవిష్యత్ుు క్ంటట ముహూర్ుమే ముఖయమ ైప్ యింది. క్ుట ంబ ప్పరోహిత్ుడు
చ్ెపిున మాట అంటట ఎంతో గురి ,గౌర్వం. మళ్ళి ప్పరోహిత్ునిీ స్ంప్రదించ్ాడు. వాళ్ళి దిగివసాు ర్ు ఆగమనాీడు
అత్డు. కాన్న ఇది ర ండు జీవితాలక్ు స్ంబంధించిన వయవహార్ం. భార్య చ్ెపిు చూసింది. క్ుదర్దనాీడు. వాళ్ళి ఈ
స్ంబంధం వదతలుక్ుంటట మనం వేరే స్ంబంధం చూడాలిగా. దానికి స్మయం కావాలిగా. అప్పుడనాీ మనం వేరే
ముహూర్ుం చూడాలిగా, అని నచాచ్ెప్ుచూసింది. స్సేమిరా అనాీడు ముహూరాు ల మాయలోప్డి. మరో ప్దిరోజులు
గడిచ్ాయ్. శ్ాీ వణి చ్ాలా ధీమాగా ఉంది. అనతక్ునీట ట గానే ఆమ మొబెైల్ రింగ్ అయియంది. అవినాష్ ఫ్ న్స అది. ఏమీ
జర్గనట ట చ్ాలా మామూలుగా ప్లక్రించ్ాడు. క్ుశల ప్రశీలు వేసాడు.
‘పెళ్ళు గురించి ఏమి ఆలోచించ్ార్ు?, మరీ అనిీ నియమాలేంటండీ బాబూ,’ అంది గోముగా
‘అలోచించ్ేదేముందీ ? మీ నానీగారికి మన పెళ్ళు ఇష్టం లేనట ట ఉందిగా ..’అనాీడు ర చాగమడుత్ునీట ట
కొంచం క ప్ం నటటస్ూు , ‘మరి నా ప్రిసిుతి ఏమిటట? ‘ కాస్ు సీరియస్ గా అడిగింది,
‘క ప్ం ఎందతక్ు మేడం ? అలోచించి మీరే ఎదో ప్రిష్ాకర్ం స్ూచించండి’ అనాీడు
‘అలోచించి అలోచించి నా మ దడు మొదతు బారింది, మీరే ఏదో దారి చూపాలి, కాన్న ఈ పెళ్ళు జర్గాలి’ అంది ఆమ లోని
పేరమనత ప్రోక్షయంగా ప్రక్టటస్ూు .
‘నాదీ అదే క రిక్ శ్ాీ వయ. కాన్న మీ నానీగార్ు మరి ముహూరాు నిీ మొండిగా ఫిక్్ చ్ేసార్ుగా..నా ఇబబంది చ్ెపాునత,
చ్ెపిునా ల ంగలేదత. మరి నేనేం చ్ేయనత?’,
‘ నాపేర్ు శ్ాీ వణి. ఈ ప్దిహేనత రోజులోు పేర్ు క్ూడా మరిాప్ యారా,’

నాక్లా పిలవాలనిపించింది. మరిాప్ యిే పేరా మీది .అయినా పేర్ులో ఏముంది, మీ దృష్ిటలో అంతా దెైవ క్ృప్ , దెైవ
నిర్ణయమే క్దా?’ అనాీడు కాస్ు వెటకార్ంగా
‘మా క్ుట ంబం మీద మరీ సెటెైర్ుు వేయక్ండి. నేనూ పెదుగా ప్ూజలు చ్ేయనత గాన్న ,ముహూరాు లమీద కాస్ు
నమాక్ముంది, ప్పటటట పెరిగిన వాతావర్ణం ఎఫెక్ట అంతే . అయినా మీర్ు ఒక్కసారి నానీగారితో మాటాు డవచతాగా
పీుజ్..’ అందికాస్ు ఆపాయయత్నత జోడిస్ూు .

...........

బాంక్ తాళ్ాలు వేస్తక్ుని సెలాు ర్ లో కార్ ఎకిక ఇంజ న్స సాట ర్ట చ్ేయబో త్ూ ప్రక్క త్లుప్ప అదుం మీద చినీగా కొడుత్ూ
ఉనీ వయకీు ని చూసి ఆశార్యప్ యాడు రామచందర రావప.
హడావిడిగా కార్ు దిగ బో త్ూ ఉంటట అవత్లి డోర్ తెర్ుచతక్ుని ప్రక్క సీటలు క్ూర్ుాంటూ
‘గుడ్ ఈవెనింగ్ సార్’, అనాీడు, అవినాష్
ఆలస్యంగానెైనా క్ురాీ డు దారి కొచిానట ు ంనాీడు. ప్ది రోజులే టెైం ఉంది. అయినా ఇప్ుటటకిప్పుడు పెళ్ళు ఏరాుటుకి
అత్డు సిదుమే, అనతక్ుంటూ..
‘గుడ్ ఈవెనింగ్ బాబు ఎలా గునాీర్ు, నేనే నానీగారికి ఫ్ న్స చ్ేదాు మనతక్ునాీనత. టెైం చూసేు చ్ాలా త్క్ుక వపంది ’
అనాీడు.
కార్ుసీటలు క్ూర్ుాని డోర్ వేస్ూు ‘అంక్ుల్! ఆవిష్యమే మాటాు డదామని వచ్ాానత. నాక్ు కొనిీ నిరిుష్టమ ైన
ఆలోచనలునాీయని చ్ెపాునతగా. సీతారాముల క్ళ్ాయణ ముహూరాు నికి నేనత సిదుంగా లేననత చ్ెపాునతగా క్దా
అంక్ుల్..’ అనాీడు మొబెైల్ నత సివచ్ ఆఫ్ చ్ేస్ూు .
నిజమే !బాబు, కాన్న ఒక్కసారిగా మమాలిీ అన్నీ వదిలేయమంటట సాధయ కాదతక్దా? అయినా ముహూరాు లనేవి
మీర్నతక్ునేంత్ ఆష్ామాష్ీ వయవహారాలేమీ కాదత. పిలులు మీక్ు తెలీదత ,’అనాీడు.
‘మీర్నీదీ నిజమే అంక్ుల్.. మాకేమీ తెలీదత. నేనత రాముడిీ కానత, భార్యనత అవమానించలేనత. అనతమానించి
అడవికి ప్ంప్లేనత .విలువెైన మానవ స్ంబంధాలనత ప్పరాణాలక్ు, నమాకాలక్ు తాక్ట ట పెటట లేనత. మీర్ు చ్ెపిున ఆ
ముహూర్ుప్ప తేదీ ముందతగానో వెనక్గానో నా చ్ెలిు ప్రస్విసేు మ ైల అంటాడు, మీ ప్పరోహిత్ుడు. కానతు స్మయంలో
నా చ్ెలిుకి గాన్న, బిడాక్ుగాని అనతక ని దేదెైనా జరిగితే అప్పుడే మా ఇంటటకొచిాన ఆడపిలుమీద ప్డే వొతిుడి, అనవస్ర్
బాధయత్ మీర్ు ఊహించలేర్ు. పెదువార్ు,అన్నీ తెలిసిన వార్ు. నేనత, శ్ాీ వణి పెదుగా మాటాు డుక క్ప్ యినా మానసిక్ంగా
ఎంతో దగగర్యాయము.’ అనాీడు నిరమాహమాటంగా .
‘న్న నిజాయితీ, న్న వయకిుత్వం నాక్ు తెలుస్త బాబూ. ముహూరాు లు వదునడం, వెైదిక్ స్ంప్రదాయాలనత అవమానించడం
అంత్ మంచిది కాదత. పెైగా కాళ్ళి క్డగి, క్నాయదానం చ్ేసేునే వివాహ ప్రకిీయ ప్రిప్ూర్ణమ ైనట ట. వాటటతో విభ దించడం
హిందూ వివాహ వయవస్ానత అవమానించడమే అవపత్ుంది. పెైగా వాటటని ఎంతో గౌర్వించ్ే వయక్ుు లం మేము మరమక్క
సారి ఆలోచించ రాదూ, క్న్నస్ం మాక స్ం, శ్ాీ వణి క స్ం, ’ చివరి అసాుో నిీ ప్రయోగించ్ాడు .

‘అంక్ుల్ ! “లక్ష్ీా నారాయణ స్వర్ూపాయః వర్ః” అనేది వెైదిక్ వివాహ వయవస్ా లోని శ్రు క్ం . నేనత నర్ుడనే కాన్న
నారాయునతడిని ఏమాత్రం కానత. అలాగే నేనత క ర్ుక్ునేది శ్ాీ వణినే కాన్న, ఆమ తెస్తు నీ లక్ష్ిాని కాదత. అంతే కాదత
క్నాయం క్నక్ స్ంఫనాీం'క్నకాభర్ణ ైర్ుయతాం! దాసావమి విష్ణవే త్ుభయం'బరహాలోక్ జగీష్ియా!!
దీని అర్ధం-ఈమ బంగార్ం వంటట మనస్త్ క్లది. క్నక్ము వంటట శరీర్ చ్ాయ క్లది. శరీర్మంత్యు ఆభర్ణములు
క్లిగినది. నా పితార దతలు స్ంసార్మున విజయము పొంది శ్ాశవత్ బరహాలోక్ పార పిుపొందినట ట శృతి వలన విని
యునాీనత. నేనూ ఆ శ్ాశవత్ పార పిు పొందతటక ై విష్ుణ ర్ూప్పడెైన న్నక్ు నా ప్పతిరక్నత క్నాయదానము చ్ేయుచతనాీనత.
మొత్ుము మీద వధతవప (భార్య) ప్పర్ుష్ారాధ ల ైన ధర్ా, అర్ధ, కామ, మొక్షము లక్ు మూలమని క్నాయదానం
చ్ెబుత్ుంది.’ అని ఆగాడు.
రామచందర రావప మోహ ఆశార్యంగా పెటటడం చూసి
‘ప్రాశర్ంలోనూ, భవిష్యప్పరాణం లోనూ ఆడపిలుల గురించి మరీ జుగుపా్క్ర్ంగా రాయడం నాక్ు తెలుస్త స్ర్.
ఆచ్ారాలక్నాీ ఆదరాశలు, స్ంప్రదాయాలక్నాీ ఆశయాలక్ు విలువనిచ్ేా దిశగా యువత్ ఆలోచించ్ాలని భావించ్ే
వాడిని నేనత. స్ంప్రదాయానికి అభుయదయానికి స్ంధికాలం ఇది. మీర్ు స్హక్రిసేు రానతనీ త్రాలనత ఆలోచింప్
చ్ేసేవారిగా గౌర్వించ బడతార్ు.’ అంటూ రామచ్ాదర రావప వెైప్ప తిరిగి అత్ని ఎడమచ్ేతిని త్న క్ుడి చ్ేతోు ప్ట ట క్ుని
‘సార్! ఇవి జీవితాలు, గోదానం భూదానం కాదత చ్ేయడానికి.. మీ అనతభవం పాటట లేదత నా వయస్త. అట వంటట మీర్ు
మీక్ంటట స్గం వయస్తనీ నాలాంటట ఒక్ అనామక్ుని కాళ్ళి క్డగడం నా అభిమతానికే వయతిరేక్ం.
ఆలోచనాప్ర్ుల వవర్ూ అంగీక్రించ్ార్ు. పెదు మనస్తతో కాస్ు భినీంగా అలోచించండి. మా మనోభావాలు మీక్ర్ధం
అవపతాయ్. దయచ్ేసి అర్ధం చ్ేస్తక్ుని మా వివాహం జరిపించండి .’ అని కార్ుదిగి ర ండు చ్ేత్ులూ జోడించి
నమసాకర్ం పెటటట చక్ చకా వెళ్ళు ప్ యాడు.
రామచందర రావప తేర్ుక వడానికి చ్ాల స్మయమే తీస్తక్ునాీడు. అప్పుడప్పుడే రోమాంచిత్మ ైన త్న శరీర్ం త్న
ఆధీనం లోకొచిాంది . జరిగిందంతా ఒక్ క్లలా అనిపించింది. అలుు డు మాటాు డుత్ునీంత్సేప్ూ ప్రిప్ూరాణ నంద సావమి
ప్రవచనంలా అనిపించింది. రామచందర రావపకి మత్ుు వదిలిప్ యింది. కారోు నతండే గబగబా చ్ేయాలి్నవార్ందరికీ ఫ్ నతు
చ్ేసాడు. ఇంటటకొచిా నేర్ుగా శ్ాీ వణి గది త్లుప్ప నెటాట డు,గబుక్ుకన మంచం మీద నతండి దిగి- ‘ రా డాడీ!’ అంది.
ఆమ దగగర్క్ు తీస్తక్ుని మొహంలోకి చూసి ‘ మనం చ్ాలా అదృష్ట వంత్ులం రా!’ అంటూ ఆమ త్ల నిమిరాడు.

మాటూరి శ్రీనివాస్ . 23-02-17




హామీ పత్రము
ఈ కధ ‘కన్యాదయనం’ న్య స్వీయ రచన. విశాల ంధరకధయ పురస్ాారం కొరకు వ్రాయబడినది. స్వీకర ంచమని మనవి.
ఈ కధ దేనికీ అనువ్ాదము కానీ అనుకరణ కానీ కాదు. ఇదివరకు ఏ దిన, వ్ార, మ స పత్రరకలోనూ పరచుర ంచబడలేదని
హామీ ఇసుున్యాను.

డయకటర్ మ టూర శ్రీనివ్ాస్
యస్ .ఎఫ్ -1,స్ాయి చందరఅపారటటమంట్
దువ్ాీడ స్టషట న్ రోడ్ ,కూరమనా పాల ం
విశాఖపటాం-46
మొబ ైల్ 9849000037

కామన్ సివిల్ కోడ్

కామన్ సివిల్ కోడ్

డాక్టర్ మాటూరి శ్రీనివాస్

రాజకీయం పగటివేషం వేయడం పెద్ద
విషయం ఏమీ కాదు గానీ, పాలకుల
మతం ముసుగు దేశానికే అరిష్టం .
సాధారణ శిక్షా స్మృతిని మనువు
లాలించడం ఇక్కడ అన్యోన్య విరుద్ధం
ఖాకీ లేప్పుడూ పాలకుల చెరువుల్లో మోసల్లెగా
మరిప్పుడేమిటి నేనెంతో గౌరవించే దుస్తులు
ప్రభుత్వం చేతిలో స్టీరింగులై కూర్చున్నాయి .
నన్ను మానవ కవచంగా చేసుకుని
నామీదకే నన్ను ఉసిగోలుపుతున్నాయి?

25-05- 17.

ప్లెక్సీ

ఎవడు వచ్చినా ఎవడు పోయిన
నా ఉనికిని నా నగరాన్ని గలీజు చేసి
డబ్బుల డబ్బాలు కొట్టుకునేవాడే.
సిగ్నల్ స్తంభం నుండీ లైట్ పోస్టులు
నిలువెల్లా వాడి ముఖాన్ని పులుముకుని
ముస్తాబు అవ్వాల్సిందే దిష్టి బొమ్మలా
వాడు పోయినా ఆ మసి మరొకడు
వచ్చే వరకో చచ్చే వరకూ పోదు
దానికన్నా ఏలిన నాటి శనే నయం .
వాడి బలుపంతా మలుపులలో వాడి
బోడి ప్లెక్సీ ల్లోనే, మిడటం బొట్లేసుకుని.
కులపోల్ల కులుకంతా రోడ్ల మీదే
జన బలంతో స్థల యుద్దమే చేస్తారు
ఎవడికి వాడు ఐకమత్యపు తోరణం కోసం
వాడొచ్చి వీడు పోయి వెళ్తారా,
నగరానికి ఈలోగా ఎల్లో ఫీవర్ పట్టుకుంటుంది
తేరుకునే లోగా మరొక ఊసరవెల్లి
నగరాన్ని ఆవహించి రంగుమారుస్తంది
నగరమూ మాలాగే పిచ్చిది, ఎవడే రంగేస్తే ఆ రంగే
పులుము కుంటుంది మరొక రంగు పడేదాకా.

అజీర్తితో అవులు రోడ్డుకు అడ్డంగా స్పీడ్
బ్రేకులౌతాయ్
ఆవులూ ఫ్లెక్సీలేగా దేశాన్ని శాసించే పాలకులిప్పుడు .
నగరం కళ్ళు రంగుల వలయంలో
తిరుగుతూ బైర్లు కమ్ముతున్నాయి
నా కళ్లు అసలు రంగులు గుర్తించే పనిలో ఉన్నాయి
డా.మాటూరి శ్రీనివాస్

మలేషియా లో బౌద్ధం

మలేషియా లో బౌద్ధం

డాక్టర్ మాటూరి శ్రీనివాస్

[వరల్డ్ ఎలియన్స్ ఆఫ్ బుద్ధిష్ట్ ఆధ్వర్యంలో ధర్మ బుద్ధిస్త్
యూనివర్సిటీ మలేషియాలో జులై 23 నుండీ 25 వరకు 2017 రెండవ ప్రపంచ బౌద్ధ మహా
సభలను నిర్వహిస్తుంది. ఈ వ్యాసం రాస్తున్న సమయంలోనే యాదృచ్చికం పై
కార్యక్రమం యొక్క బ్రోచర్ అందడం తో ఈ వ్యాసం కష్ట పెఆముఖ్యతను
సంతరించుకుంది.]
చాలా ఆసియా దేశాలు బౌద్దాన్ని ఆశ్రయించి పురోగాభివ్రుద్ధి చెందడం
21 వ శతాబ్దపు సామాజిక ఆర్ధిక పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ మధ్య
నేను సందర్శించిన మలేషియా చరిత్ర మరింత ఆశ్చర్యం గొలిపేలా అనిపించి ఈ
వ్యాసాన్ని రాయడానికి ఉపక్రమించాను. మలేషియా బౌద్ధ దేశమా? కాదా ? అనేడి
ఇక్కడ చర్చ కాదు. ఎందుకంటే భారతదేశం మతపరమైన తప్పిదం చేసి బౌద్ధాన్ని
తరిమివేసినప్పుడు అది స్థిరపడింది చైనా జపాన్ లాంటి పెద్ద బలమైన దేశాలలోనే
కాదు. మలేషియా లాంటి చిన్న దేశాలలో వేన్నూల్లుకుందని అర్ధం అవుతుంది. ఒకప్పుడు
ఆసియాలో అతి చిన్న అనామక దేశం మలేషియా. మరిప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా
గుర్తింపు కోసం తహతహలాడుతుంది. దానికి దాని బౌద్ధ నేపధ్యం ఏమైనా
దోహదపడిందా? అనే దృష్టితో అలోచించాల్సిన అవసరం ఏర్పడింది. ఏ ప్రాంతాన్ని,
దేశాన్ని ,నగరాన్ని సందర్శించినా ఆయా ప్రాంతాల చరిత్రను తెలిపే మ్యుజియంలను
దర్శించడం అలవాటు నాకు ఎన్నో క్రొత్త విషయాలను నేర్పింది. ఆనేపధ్యంలోనే
మలేషియా మానవ శాస్త్ర (ఆంత్రోపాలజీ )మ్యుజియం చూసిన తర్వాత అక్కడ బౌద్ధ
మూలాలు విరివిగా ఉన్నట్టు కనబడ్డాయి. తరచి చూస్తే ఒకప్పుడు అదొక ప్రముఖ
బౌద్ధ దేశం, భారత్ లాగే. నిజానికి ఒకప్పుడు అది భారత భూభాగంతో మమేకమై ఉన్న
ప్రదేశం.
మలేషియా ఒక పెద్ద ద్వీపం. ఉత్తరాన థాయిలాండ్ దక్షిణానికి సింగపూర్ తో
కలిసి ఒకే భూభాగంగా ఉంటుంది. పడమటలో హిందూ మహా సముద్రం, సుమత్రా దీవులు
దూరంగా అండమాన్ నికోబార్, శ్రీలంక ఉండగా మరొక ప్రక్క తూర్పుగా సౌత్ చైనా
సముద్రం ఇండోనేషియా బ్రూనై ద్వీప సమూహాలు ఉన్నాయి. అంటే నాలుగు
దిక్కులునుండీ వలసలకూ వ్యాపారాలకు అనువైన దేశమన్నమాట. దీనిని సువర్ణ ద్వీపమనీ
మలయా ద్వీపమని పురాణాల్లో కూడా వర్ణించారు. క్రీ.శ. 4-5ల ప్రాంతంలో బుద్ధ
గుప్తుడనే వ్యాపారి రాయించినట్లుగా చెప్పబడుతున్న ఒక రాతి శాసనం బయట పడింది,
అక్కడ మ్యూజియంలో పొందు పరచబడింది. మలేషియా ను క్రీ.శ 2 నుండీ క్రీ.శ. 14 వరకూ
సుమారు 30 మంది రాజులు పాలించారు. మలేషియా భూభాగం ఉత్తర మధ్య దక్షిణ

ప్రాంతాలుగాను అలాగే చుట్టూ ఉన్న మలేక, పెనంగ్, జెంటింగ్ లంగ్కావి ద్వీపాలను
వీరు పాలించారు. స్థానిక ప్రజల జాతిని మలే జాతిగా గుర్తించారు .వారు
ఆస్ట్రేలేషియా తెగలవారు. మలే భాష మాట్లాడుతారు. ఇదే భాష బ్రూనై , సింగపూర్,
ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ లో కొంత ప్రాంతం ,సుమత్రా దీవులలోను వాడుక భాషగా
ఉంది. సుమారు 290 మిలియన్ల మంది ఈ భాష మాట్లాడతారని అంచనా. ఈ భాషకు ఒక్కొక్క
ప్రాంతంలో ఒక్కొక్క పేరుంది. దీనికి మూలం ప్రోటో ఆస్త్ర్నేషియాన్ భాష.
మలేషియాను అలాగే చుట్టూ ప్రక్కల ప్రాంతాలు శ్రీవిజయ సామ్రాజ్య
రాజులు క్రీ.శ. 1025 వరకూ పాలించారు . వీరంతా బౌద్ధ రాజులని చరిత్ర చెపుతుంది.
వీరితర్వాత చోళ రాజులు ఈ ప్రాంతాన్ని కొద్ది కాలం పాలిమ్చినట్లు, తర్వాత
ముస్లీం దండయాత్ర తో ఇస్లాం తన ప్రాబల్యాన్ని పెంచుకున్నట్లు తెలుస్తుంది.
ఇప్పుడీ దేశం ముస్లీం దేశం. 60 % మంది ముస్లీములు. బౌద్దం, హిందూమతం ,టావొజం
ఇక్కడ మైనారిటీ మతాలుగా చలామణిలో ఉన్నాయి. కాలక్రమేణా శ్రీవిజయ
సామ్రాజ్యం బలహీన పడి కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యింది. ఆఖరి
శ్రీవిజయచక్రవర్తి ఇష్కందర్ షా(పర్షియా భాషలో రాజు) గా పేరు మార్చుకుని
ముస్లీం వనితను పెళ్ళాడిన అనంతరం అతడి కుమారుడు కూడా క్రీ.శ. 1414 ప్రాంతంలో అదే
బాటలో నడవడంతో బౌద్ధ ప్రాబల్యానికి అడ్డు కట్ట పడింది. దీనికి తగిన ఆధారాలను
చైనా గ్రంధాలు చూపుతున్నాయి. క్రీ. శ.2 నుండీ అక్కడ బౌద్ధం ఆనక హిందూ మతం
వెలిసినా అంతకు ముందునుండీ బౌద్ధం ఆ ప్రాంతాన్ని ఏలినట్లు తెలుస్తుంది. ఇస్లాం
ప్రాబల్యం పెరుగడం వలన బర్మా కంబోడియా లకు బౌద్ధ పరిమితమయింది.
15వ శతాబ్దంలో మలేక ప్రాంతాన్ని(మలేషియాలో ఒక ద్వీప కల్పం) ఆధారంగా
చేసుకుని పోర్చుగీసుల వలస వ్యాపారం ఆరంభం అయ్యింది. దీంతో మలేషియా
ముఖచిత్రమే మారిపోయింది. కాధలిజం (క్రైస్తవం) మొదలై మత మార్పిడులు
ఊపందుకున్నాయి. 16వ శతాబ్దానికల్లా డచ్ వారు మలేకను ఆక్రమించుకుని డచ్
ఈస్ట్ ఇండియా కంపనీ నెలకొల్పారు. వారు పోర్చుగీసువారిలా మతాన్ని
ప్రోత్సహించలేదు. ఇవన్నీ తగరం,బంగారం,మిరియాలకు ప్రసిద్ధిగాంచిన ప్రదేశాలు
కావడం వలన ఆ వ్యాపారాల పై దృష్టి పెట్టారు. .వీరికి అరబ్బులతో, భారతీయులతో
చైనీయులతో సత్సంబందాలు ఉండేవి .17 శతాబ్దానికి బ్రిటీష్ వారి ఆక్రమణతో
ఐరోపా ఆధిపత్యం పెరిగింది. అందరూ మలేషియా భూభాగాలను వాటాలుగా పంచుకున్నారు.
సిల్క్ రూట్(ఐరోపా ఆసియాలను కొరియా నుండీ చైనా మీదుగా జపాన్ వరకూ కలిపే
వ్యాపార రోడ్డు మార్గం ) మార్గం మరియు స్పైస్ రూట్(ఆసియా ఆఫ్రికా ఐరోపా
సోమాలియా నుండీ భారత్ మీదుగా జావా వరకు సుగంధద్రవ్యాల వ్యాపార మార్గం )
ద్వారా వ్యాపారాలు సాగించారు.
మలేషియా లో బౌద్ధం;
మొదట్లో చెప్పుకున్న శ్రీవిజయరాజ్యం ఇండోనేషియా కేంద్రంగా చేసుకును
మలయ ,సుమిత్ర దీవులలో పాలించేది. ఆసియా చైనాలతో వ్యాపార సంబంధాలు
కొనసాగించేది. వీరి ప్రధాన జీవన శైలి బౌద్ధం . భారత్ నుండీ, చైనా నుండీ

బౌద్ధాన్ని వీరు స్వీకరించారు. ఇండోనేషియాలో జావాలో ప్రపంచ ప్రసిద్ధి
చెందినా బోరోబుదుర్ బౌద్ధాలయం నిర్మించింది వీరి వారసులే, అంటే ఆశ్చర్యం
కలగక మానదు. దీనిని క్రీ.శ. 827 లో శైలేంద్ర కుటుంబీకులు నిర్మించారు. మలేషియా
విషయానికొస్తే క్రీ.శ.1వ శతాబ్దంలోని కట్టబడిన పగోడా ఆంత్రోపాలజి
అర్కియాలజి వారి త్రవ్వకాలలో బయటపడింది. సుమారు 100 బౌద్ధ కట్టడాలను
గుర్తించి కేవల 10 % మాత్రమే త్రవ్వకాలు చేపట్టగలిగారు. మొత్తం పురావస్తు
త్రవ్వకాలు గనుక చేపట్టినట్లు అయితే మరిన్ని బౌద్ధ చరిత్రక సత్యాలు మన
ముందు ఉంటాయి. ఆనాటి ఈ ప్రాంతపు బౌద్ధులు ఈ ప్రాంతాలనన్నింటినీ కలిపి సువర్ణ
భూమిగా పిలుచుకునేవారు. అవి 9 క్షేత్రాలు.9 దేశాలు.
థాయిలాండ్,మియాన్మార్,లావోస్,సుమత్రా,మలయా(మలేషియా),కంబోడియా,వియత్
నాంమొదలైనవి. అందుకే ఈ దేశాల్లో చాలా ప్రాంతాలలో ఈ పేరు వినబడుతుంది.
ఉదాహరణకి థాయిలాండ్ విమానాశ్రయం పేరు సువర్ణ భూమి. దీని వెనుక ఒక చారిత్రిక
సత్యమున్నట్లు తెలుస్తుంది. అదేమిటంటే క్రీ.పూ. ౩వ శతాబ్దపు మౌర్య
చక్రవర్తి అశోకుడు ఈ ప్రాంతానికి ఇద్దరు దమ్మదూతల ద్వారా దమ్మ సందేశాన్ని
పంపాడు. అంటే అశోకుడు మహేంద్రుడుని దమ్మ దూతగా తామ్రాపర్ని (శ్రీలంక) పంపిన
సమయంలోనే ఇది జరిగింది. ఇక్కడకి దమ్మసందేశాన్ని తీసుకుని వచ్చిన వారు సోనా,
ఉత్తర అనే ఇద్దరు దమ్మ రాయబారులు. ఈ సోన,ఉత్తర పేర్లు రూపాంతరం చెంది
సోనోత్తర గా మారి సుమిత్ర గా పేరొందినది అని అక్కడి స్థల పురాణం చెపుతుంది.
దమ్మం అడుగిడిన సందర్భాన్ని సువర్ణ సందర్భంగా తలచి అయా ప్రాంతాలను సువర్ణ
భూమిగా పిలుచుకుంటారు. ఇది మలేషియా ద్వీపాలలో బౌద్ధం యొక్క మొదటి
ప్రస్థానం.
రెండవ విడతగా చైనా మలేక ద్వీపకల్పాన్ని కేంద్రంగా చేసుకుని వ్యాపారం
కొనసాగిస్తున్న కాలంలో క్రీ.శ.2 లో చైనీయుల యువరాణి స్థానిక మలేక రాజును
వివాహమాడి బౌద్ధానికి పునాది వేసింది. అప్పటినుండీ బౌద్ధం అక్కడ ప్రబలిందని
తెలుస్తుంది. కానీ దీనికి తగినన్ని ఆధారాలు లేవు. ముస్లీములూ పోర్చుగీసువారు
ఆనవాళ్ళను కూల్చేసారో(శ్రీలంక లో పోర్చుగీసువారు బౌద్ధ కట్టడాలను
కూల్చేశారు) లేక నిర్మాణాలు జరగలేదో నిర్ధారించవలసి ఉంది. అయితే డచ్ వారు వారి
వ్యాపారాల దృష్ట్యా కొన్ని బౌద్ధ కట్టాడాలను నిర్మించి స్థానికుల మన్ననలు
పొందారు. బెంగ్ –హు-తెంగ్ విహార డచ్ వారు మలేక లో నిర్మించినదిగా
చెప్పుకుంటున్న ఒక పురాతన కట్టడం. ఈ కాలంలోనే టావో కళాత్మక సంప్రదాయలో
బౌద్ధ నిర్మాణాలు జరిగాయి. ఇక 18వ శతాబ్దంలో బ్రిటీష్ వలస పాలనతో
వ్యాపారాలు జోరందుకున్నాయి. రబ్బరు,తగరంవ్యాపారాలను వారు ప్రోత్సహించాగా
వారికి దీటుగా వ్యవసాయం మత్స్య వ్యాపారాలను స్థానికులు కొనసాగించారు. అటూ
ఇటూ ఆర్ధిక పరమైన వలసలు మొదలైయ్యాయి.
తెరోవాద బౌద్ధం పద్దతుల్లో బర్మా ప్రభావంతో 1803 లో పెనాంగ్ ద్వీప
కల్పంలో దమ్మకారామ విహారాన్ని నిర్మించారు. దీనికి దాత ఒక ఉపాసిక అవడం విశేషం.
వీరు ఇక్కడ థాయిలాండ్ లో ప్రసిద్ధి చెందినా ‘మహాసి’ అనే ఒక నూతన విపస్స్యనా

ధ్యాన పద్ధతిని పాటిస్తారు. మరికొన్ని ప్రదేశాల్లో గోయెంకా గారి పద్ధతిని
అవలంబించారు. ఇక్కడిప్పుడు సుమారు 30 కి పైగా తెరోవాద బౌద్ధ విహారాలున్నాయి.
తైలాండ్ కళా నైపుణ్యం తో నిర్మించినవి చిన్నవీ పెద్దవీ 845 ఉన్నాయి.
ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్లీపింగ్ బుద్ధ లేదా రిక్లై నింగ్ బుద్ధ
(నిదురిస్తున్న భంగిమ) ప్రతిమ ఇక్కడే పెనాంగ్ లో ఉంది. మొదటిది థాయిలాండ్ లో
ఉంది. పెనాంగ్ లోనే మరొక ప్రపంచ ఆకర్షణ ఉంది.దాని పేరు కేక్-లోక్- సి. ఇది
మలేశియాలోనే అతి పెద్ద బుద్ధ విహారము. సముద్రతీరాన అత్యంత ఆకర్షణీయంగా 30
ఎకరాలలో నిర్మించబడింది. దీనిని స్వచ్చ భూమి మందిరమని, స్వర్గ మందిరమనీ
పిలుస్తారు. అక్కడి 37 మీటర్ల ఎత్తైన దయా దేవత విగ్రహం వారందరికీ
అరాధ్యనీయం. ఈ దేవతను అమితాభ్ బుద్ధుని ప్రతిరూపం గా కొలుస్తారు. అక్కడ 1830
లో నిర్మించిన పగోడా కు ఒక ప్రత్యేకత ఉంది. 7 అంతస్తులుండి 30 మీటర్ల
ఎత్తైనది.అందులో 10 వేల బుద్ధుని ప్రతిమలు పొందుపరచి ఉంచారు. ఈ పగోడా మూడు
దేశాల సంప్రదాయాలను సూచిస్తుంది. పగోడా పై కొన్ని అంతస్తులు బర్మీస్
సంప్రదాయాన్ని మధ్య అంతస్తులు థాయిలాండ్ క్రింది అంతస్తుయ్లు చైనీయుల
కళా నైపుణ్యం తోనూ చ్చూపరులను ఆకట్టుకుంటాయి. శ్రీలంక కూడా ఇక్కడ బౌద్ధ
వ్యాప్తికి విశేషం గా కృషి చేస్తుంది. చైనా తైవాన్ ప్రభావంతో మహాయానబౌద్ధం
ఇప్పుడిప్పుడే ఊపండుకుంటుంది. పూజలూ క్రతువులకు భిన్నంగా సాంఘిక సంక్షేమ
కార్యక్రమాలూ,ధ్యానం మీద ఎక్కువ దృష్టి పెట్టడం తో యువత ఇటుగా మొగ్గు
చూపడం విశేషం. మలేషియా బుద్ధిష్ట్ అసోషియాషన్ క్రింద సుమారు 250 యువ బౌద్ధ
సంఘాలు నమోదై పనిచేయడం అక్కడ ఆశాజనకమైన అంశం. సుమారు 700 మంది భిక్కులతో
ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్ల మంది ఇందులో సభ్యులుగా ఉన్నారని చెపుతారు.
ఏదేమైనా జనాభా లెక్కలప్రకారం 60 శాతం ప్రజలు ముస్లీములుగా ఉన్న చోట 19 %
బౌద్దులుగా నమోదై ఉండడం గొప్ప విషయమే. నేడు హిందూ మతం , బౌద్ధం
మలేషియాలో మైనారిటీ మతాలు. ఆచరణలో అంత చిత్త సుద్ధి లేకవడం , మత మార్పిడులు
మితిమీరడం అక్కడ బౌద్ధ ఉనికిని ప్రశ్నిస్తున్నాయి. అయితే కొన్ని దేశాల
సౌజన్యంతో నిత్యం దమ్మ సందేశాలు,సాహిత్య ప్రచురణలు,దమ్మ తరగతులు,
ఆదివారం పాఠశాలలు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జపాన్ తరహాలో
అడవుల్లో కొండలపైన నిర్మించిన విహారాలు అక్కడ ధ్యాన శిబిరాలు జరుగుతున్నాయి.
ఈ మధ్య వజ్రయామం కూడా తన ఉనికిని చాటుతుంది.1980 లో వెనెరబుల్
గ్యాల్యా కర్మపా అతని తర్వాత 1981లో దలైలామా 1996 లామా రింపోకే దర్శించి
అక్కడ వజ్రయాన బుద్ధిష్ట్ కౌన్సిల్ ఆఫ్ మలేషియా ను స్థాపించారు. అడపా దడపా
పెద్ద ఎత్తున జన సమీకరణాలతో కార్యక్రమాలను చేస్తున్నారు. చివరగా 2015 లో
భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మలేషియా పర్యతించు అక్కడ లిటిల్ ఇండియా అనే
ప్రాంతంలో సాంచి తోరణ స్తూపాన్ని ఇండియా –మలేషియా స్నేహ బంధానికి చిహ్నంగా
ఆవిష్కరించారు. ఈ నేపధ్యంలో ప్రపంచ బౌద్ధ సభలు విజయవంతం కావాలని మలేషియా
బౌద్ధ దేశం గా తిరిగి అవతరించాలని ఆశిద్దాం .

నది

మా ఊరి నది అంటే నాకు చెప్పలేనంత ఇష్టం
చినననాటి మితరు న్నన తన మది గదిలో బందీగా
చేసుకున్న ననననడిప ంది మళ్ళీ లాలంచింది
ననున కూడా దాన్న చుటటట ఉండాలన్న కోరుకుందేమో
కళ్ీను తడిప న నీరే ఈతతోనన ఎదురీతనూ ననరిపంది
నాననలా నది నాకు బో లడంత ధెైరాాననన కాదు
ఆతమ స్థైరాానీన ఇచిచంది.
ఒడ్డడ న నడ్డసుత ంటే నానన చెయ్యా ప్టటట కు నడ్డసుత ననటేట
నదిలోకి వాలన చెటటట ను చుటటట కుంటట నీటిలోకి
జారుతరంటేఅమమ చేతరలోల ంన్నచ నానన ఎతరత కుననటేట .
కారీతక మాసంలో నది ఆకాశమ ైపో తరంది
నక్షతాు లను అదుుకున్న
గీీష్మంలో ప్లలలకివొడ్డడ నన తెలాల రుతరంది
ఒకకొకొ అడ్డగు లోతర తగుు తూనన అందోళ్న
ఒకకొకొ మ టటటకుొతరంది దుుఃఖం మోసుత ంది
నానన అలగినటటట భయమేసుత ంది
అమమ నానన సనేనితతరడ్డ అనీన నదే అనీన నదిలోనన
మా ఊరి నది అంటే నాకు చెప్పలేనంత ఇష్టం .
డాకటర్ మాటటరి శ్రీన్నవాస్
ప్రకృతి పల్లకీలో ఊరేగే వెన్నెల వసంతంలో
కలకంఠపు కమ్మని పాట నీ కవిత్వం
అమావాస్య నిశిలో దిక్కు తోచని చుక్కలు అలమటించునట్లు
అన్నార్తుల ఆవేదనల అంబరం నీ కవిత్వం
వినుకొండ వినీలంలో అలుముకున్న ఆమానతల ఆక్రోశం
ఆర్తిగా అనుభవించిన గిజిగాడి గాయాల మూట నీ కవిత్వం
చిరుజల్లులో నీరెండ కుంచెతో పేదరికం
చిమ్మిన పంచ వర్ణ హరివిల్లు నీ కవిత్వం
నీ కళ్ళ రమ్యాలోకనం కులమతాలను మీరి
సమతతో ఆవిష్కరించిన ప్రపంచ పటం నీ కవిత్వం .
కవీ! జన్మభూమిలోనే కాందిశీకుడవై చరించిన వాడా!
నీవేదిగిన తీరూ పొదిగిన మేరూ
దేశాభ్యుదయానికి జాతీయతను అద్దిన అమృత సెలయేరు
హారతిపట్టిన శారదతో పేదరిక పరాకాష్టకు సాంగత్యం
అల్చిప్పకు స్వాతి చినుకుతో దాంపత్యం.
నీ కలం నీడలో మానవత మురిపెంగా స్వేద తీరింది
నీ కావ్యలాలన అల్లాడిన ఆకలిని హాయిగా మాయగా నిదురబుచ్చింది
జీవకారుణ్యలో సిద్ధార్థుడి కలలను మించిన సిద్ధహస్తుడవు
అహింసా క్రాంతి వెలిగిన బాపూజీ కాంచిన శుద్ధ గ్రస్తుడవు
ఆ కన్నులు చూడలేని , ఆ పెన్నులు రాయలేని
అనాధ అనుభవాలనూ, అభిదల పిలుపులను

వొడలెల్లా బాకులు దూసిన తలపులనూ
నీ దుఃఖ అగ్ని శిఖరం ఉద్వేగంతో కుతకుత లాడి
లావాలా ఎగజిమ్మింది కవితాగ్నిలా
ఎన్ని కలాలను,ఎన్ని గళాలను ఎన్ని కులాలను దహించివేసిందో?
ఎందరు పురాణప్రియులను పెనునిప్పులో కరిగించి కనువిప్పు కల్గించిందో?
ఎనలేని అప్రతిహాత సాహిత్య మధనంతో ఎన్ని మబ్బుతునకల్ని మరిన్ని
ముక్కల్ని చేసి ధిక్కారస్వరమై ఆమ్ల వర్షం కురిపించిందో?
అక్షర లక్షల శతాఘ్నుల శబ్దంతో నీ కవిత్వానికి
ఇలాతలం కంపించిన తీరు చెపుతుంది .
విశ్వ శాంతిని విరివిగా భూమార్గం పట్టించిన రవీ ,
విశ్వ ధర్మాన్ని పుడమి పంక్తిలో బోధించిన కవీ
విశ్వంభరను విశ్వకిరణాలతో నింపిన విశ్వనరుడవు
జాషువా! అమ్లానము, అపరిమేయ అస్వాదనం నీ కవిత్వం..

డాక్టర్ మాటూరి శ్రీనివాస్

28-09- 17

గురజాడ రచనల్లో బౌద్ధము

ఒక సాహితీ సమావేశంలో చాలా కాలంగా క్రితం జరిగిన సంభాషణ. నాలో ఉన్న
ఆలోచన డాక్టర్ అద్దేపల్లి రామ్మోహనరావు గారితో అన్నాను, “మాస్టారు !
గురజాడ వారి మీద బౌద్ధం ప్రభావం చాలా ఉన్నట్టు అనిపిస్తుంది” అని. ఆయన
చాలాసేపటి తరువాత “ నిజమే నయ్యా” అన్నారు. గత నవంబర్ 30న విశాఖలో జరిగిన
గురజాడ శతవర్ధంతి సభలో ఆచార్య కే.వి గారు మాట్లాడుతూ “ మంచి గతమున
కొంచమేనోయ్” అని వివరిస్తూ ఉంటే ఆయన మాటల్లో ఏదో నిఘూడత నాకు
గోచరించింది. గురజాడ అభిమానిగా,బౌద్ధ అభిమానిగా ప్రత్యక్షంగానో
పరోక్ష్యంగానోనా పై వీరిద్దరి ప్రభావం నా మీద ఉండడం చేత వ్యాసానికి
పూనుకున్నాను. కొందరు నా అవగాహనతో ఏకీభవించకపోవచ్చు. ఎవరి కారణాలు
వారికుంటాయిగా .
గురజాడ వెంకట అప్పారావు గారు తెలుగు సాహిత్యం గర్వించదగ్గ మహనీయుడు,
మహా మనీషి. గొప్ప సంస్కర్త. నాటి సమాజాన్ని లోపలనుండీ ఎండగట్టి సంస్కరింప
ప్రయత్నించచిన బహు కొద్ది మందిలో ఒకరు . ముందుగా వారి ‘ముత్యాల సరములు’
చూస్తే సమాజ రుగ్మతలైన కులాన్ని,మతాన్ని, ఆవశ్యకములైన మానవ విలువలను
ఆయన సాహిత్యంలో ప్రస్తావించారు. గతంలో ఎవ్వరూ ప్రస్తావించలేదని కాదు
గానీ, ఆయన రాసింది రాశి లోనూ వాశి లోనూ ఎంతో శ్లాఘనీయమైనది. “ఎల్ల
లోకములోక్క ఇల్లై , వర్ణ భేదము లెల్ల కల్లై , వేలనేరుగని ప్రేమ బంధము ,
వేడుకలు కురియ” అంటూ వర్ణ వ్యవస్థ ను, అలాగే “మతములన్నియు మాసిపోవును
జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును” అంటూ అజ్ఞానం వలన సమాజం ఏ రీతిన భ్రష్టు
పట్టిపోతుందో వివరించే తీరు , జ్ఞానం యొక్క అవసరాన్ని,విద్య యొక్క
ప్రాధాన్యతను తెలుపుతాయి. విద్య తద్వారా జ్ఞానము , తద్వారా ప్రజ్ఞ
తద్వారా సత్ చిత్తం వస్తుందని క్రీస్తు పూర్వమే భారతదేశానికి చాటింది,
గౌతమ్ బుద్ధుడే .
“మలినదేహము మాలలనుచు, మలిన చిత్తుల కధిక, కులముల నెల వొసంగిన వర్ణ
ధర్మ మధర్మ ధర్మంబే” అనే వాక్యం ‘లవణరాజు కల’ అనే కవితలోనిది. వర్ణ
ధర్మమూ ఎంత అధర్మ ధర్మమొ ఘంటా పధం గా ప్రకటించిన ఆధునిక భారతీయ
సంస్కర్త ఆయన. ఇంకాస్త ముందుకెళ్ళి “ మంచిచెడ్డలు మనుజులందున , ఎంచి
చూడగా,రెండే కులములు ; మంచి యన్నది మాల అయితే , మాల నేనగుడున్” అని ఆకాలంలో
మాట్లాడం రాయడం నిజంగా సాహసమే. అగ్రహారాలలో ఆ రోజుల్లో అన్నితిట్లు
,చివాట్లు ‘మాల’ శబ్దానికి ముడిపెడుతూ కుల వివక్షాపూరితంగావాడే వారు. కారణం
విదితమే. మరి కులనిర్మూలనకు గురజాడ వారి కవిత్వం ఏమేరకు
దోహదపడిందో,అభ్యుదయ కవులు,గురజాడవారసులు ఏ మేరకు ప్రయత్నించారో,అసలు
ప్రత్నించారో లేదో తెలియదు. కానీ అవసరమున్న లేకున్నా ఈ పంక్తులను
ఉటంకించడం మాత్రం చేస్తుంటారు. వర్ణ వ్యవస్థ ను ,కుల ప్రాతిపదిక ప్రక్కన
పెట్టిన మొట్ట మొదటి సామాజిక విప్లవకారుడు బుద్ధుడేనని చెప్పనవసరం లేదు.
ఉపాలి మొదలుకుని ఆమ్రపాలి వరకు ఎంతోమందిని ఆదరించి వేదాలు అపౌరషేయాలు కాదు
అని ప్రకటించాడు. గురజాడ వారితో బుద్ధుడే ఈ సాహసం చేయించాడా? అంటే నిజమే
అనిపిస్తుంది. వేదాలను అన్ని భారతీయ చింతనలు అంగీకరించలేదని, అంగీకరించినా ఒకే
రీతిలో అంగీకరించలేదని అంటారు, అప్పారావు గారు. వేదాలను మొదటిసారిగా
బహిరంగంగా ప్రశ్నించినది,బుద్ధుడే. అందుకే ఒక సందర్భాలో “బౌద్ధాన్ని
భారతదేశం లోనుండీ వెళ్ళ గొట్టి దేశం మతపరంగా ఎంతో పెద్ద తప్పు చేసింది”
అంటారు, గురజాడ అప్పారావు .

కానీ ,కొన్ని సందర్భాల్లో అవసరార్ధమనో లేక స్వజాతి
అనునయింపుకో “ విద్య నేర్చినవాడు విప్రుడు, వీర్య ముందినవాడు క్షత్రియడన్న
పెద్దల ధర్మనీతి మరిచి... ” అని ‘కన్యక’ అనే కవితలో అన్నా,అలాగే ‘మెరుపులు’ అనే
కవితలో “నాల్గు రీతుల గనకంబు నాడెగమగును, వెతుగీతుల తునియించి వెచ్చజేసి, నరుడు
నట్టుల నాల్గింట నాడె మగును; కులము,శీలంబు,కర్మంబు ,గుణము చేత” అంటూ ఛాందస
సంప్రదాయ వాసన వెదజల్లుతారు. ఆయనా, గురజాడ మీద సాంప్రదాయవాదుల దాడులు
నేటికీ ఆగలేదు. అయితే ఆయన చిత్తశుద్ధికి ఇవేమీ అడ్డు రావంటారు,విజ్ఞులు.
‘మనిషి’ కవితలో “మనిషి చేసిన రాయిరప్పకు, మహిమ గలదని,సాగి మొక్కుతు, మనుషులంటే
రాయిరప్పల కంటే కనిష్టం” అనే మాటల్లో హేతువాదం ప్రతిబింబిస్తూ
మూఢత్వానికి,అసమానతలకు నిరసన ధ్వనిస్తుంది,ఆయన్లోదాగున్న నాస్తికత్వం
తొంగి చూస్తుంది. భారతీయతత్వ చింతనలో శాస్త్రీయ దృక్పధంతో హేతువాదాన్ని
సమాజానికి పరిచయం చేసింది, బుద్ధుడే అంటే విభేధించేవారూ ఉంటారు. చెప్పాను
కదా! ఎవరి కారణాలు వారికుంటాయిని. వీరందరికీ సమాధానం , బుద్ధుని ‘కాలమా సుత్త’.
బుద్ధుని కాలామ సుత్త కంటే మించిన హేతువాద దృష్టి బహుసా బ భారతీయా
సాహిత్య చరిత్రలోనే కానరాదంటే అతిశయోక్తి కాదేమో.
గురజాడ వారు దేశానికిచ్చిన అపురూప,అమూల్య కానుక దేశ భక్తి గీతం. ఏ
దేశానికైనా, ఏ కాలానికైనా సరితూగగల గీతం అది. “ వెనుకచూసిన కార్యమేమోయ్ ,
మంచిగతమున కొంచెమేనోయ్, మందగించక ముందు కడుకేయ్, వెనుక పడితే
వెనుకేనోయ్,” సత్యాన్వేషణతో గతమెంత ఘనకీర్తి అన్న ధోరణికి భిన్నంగా
అభ్యుదయ స్పూర్తిని నరనరాలా నింపుతారు . గతం లోని ఉన్న మంచి ఏమిటో
తెలుసుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తారు. వెనుకబాటుకు కారణాలను కూడా
నర్మగర్భంగా అంచనా వేస్తాడు. ద్వేషాన్ని, స్వార్ధాన్ని వీడ మంటూ “పూను
స్పర్ధను విద్యలందే ,వైరము వాణిజ్యమందే ,వ్యర్ధకలహము పెంచబోకోయ్ ,
కట్టి వైరం కాల్చవోయ్” అన్నా, “వొరుల మేలుకు సంతసిస్తూ ఐకమత్యము
నేర్చవోయ్”, “వొకరి మేల్ తన మేలనెంచే ,నేర్పరికి మేల్ కొల్లలోయ్” అన్న
మాటలకు నేపధ్యం మనకు యిట్టె అర్ధం అయిపోతుంది. ఇతరుల మేలు చేయ తలంపు
మనకు ఎంత మేలు చేస్తుందో ఎంత సౌఖ్యాన్నిస్తుందో తెలిపే ఈ మాటలు
బౌద్ధంలోని ముదిత , మైత్రి, శాంత చిత్తము స్పురణకు తె స్తాయి. ఇవన్నీ
ఎప్పటికైనా కనీస సామాజిక అవసరాలు. వాటి కొరతను అంచనా వేస్తున్నారు.
నాటికల్లోకి,కధల్లోకి వస్తే “ఆధునిక మహిళా చరిత్రను తిరగరాస్తుంది “ అని
ప్రకటించి స్త్రీకు సాధికారత తివాచి పరుస్తారు, గురజాడ అప్పారావు గారు.
కన్యాశుల్కం లో మధురవాణి పాత్ర బహుముఖ ప్రజ్ఞ ను, స్త్రీ యొక్క
ఔన్నత్యాన్ని చాటుతుంది. స్త్రీ స్వేచ్ఛ కు వ్యక్తీ స్వేచ్చకు నిలువెత్తు
నిదర్శనం మధురవాణి . కులముకన్నా గుణమెంత మిన్నో ఉదాహరిస్తూ,సంస్కరణలను
సోదాహరిస్తూ అగ్రహారాల్లోని అమానుషత్వాన్ని సమాజానికి పరిచయం చేసిన
గొప్ప సాంఘీక విప్లవం, కన్యాశుల్కం నాటిక. ప్రపంచ చరిత్రలోనే స్త్రీ పురుష
సమానత్వం గురించి,సమానావకాశాలు గురించి మాట్లాడిన మొదటి సాంఘిక
విప్లవకారుడని ప్రపంచమే బుద్ధునికి కితాబు ఇచ్చింది. స్వేచ్ఛ, సమానత్వం,
సహోదరత్వం, సమ న్యాయం ప్రాతిపదికనే బుద్ధుని బోధనలన్నీ సాగాయి.

అముద్రిత భాగామైన ‘బిల్హణీయం’ లో పండితుడు, హేతువాది అయిన
బిల్హణుడు ఇలా అంటాడు- “దేవుడిని కూడా మభ్య పరుప ప్రయత్నిస్తారు. పేరుగల
మతమలెల్లా సత్ప్రవర్తనను,భూత దయను ముఖ్యమని చాటుతున్నవి. వైదిక మతముల
కన్నాబౌద్ధ జైన మతములలోనే వీటికి ప్రాముఖ్యతలు లావు. నిర్వ్యాజమైన ఈ

గుణములతో మేళనలేని జపతపాదులు వ్యర్ధములు” . నాటి సమాజంలో
సత్ప్రవర్తనను,భూత దయకు కారణాలను ప్రత్యక్షం గానే గురజాడవారు
ప్రకటించారు. వేద ప్రమాణాలను కూడా విమర్శిస్తూ స్వర్గ నరకాలు ఈ లోకంలోనే
ఉన్నవని, చూడ నేర్చినవాడికి ప్రతి దేశంలోనూ కనబడతాయంటారు. నిజమైన
జ్ఞానమును సాధించవలెనన్నామతముల యడల అసూయ ఉండకూడదు. మన మతమే
నిజమూ,పరమతములన్నీ అబద్దమూ అనుట అజ్ఞాత. ఏ దేశంలో ఏమతంలో యే మేలు
ఉంటే అదల్లా గ్రహించాదగినదే, అని ఉద్భోధ చేయిస్తారు, బిల్హణుడి చేత
బిల్హణీయంలో . మతములన్నీ మాసిపోక పోయినా కనీసం మత సహనము యెక్క
ఆవశ్యకతను గుర్తుచేస్తారు, ఈ కావ్యంలో . నేటి సమాజానికి గురజాడవారి
అవసరాన్ని, అధ్యాయనాన్ని,సందర్భాసుద్దినీ, ఔచిత్యాన్ని ,సంగతత్వాన్ని ఈ
మాటలు తెలియచేస్తాయి. ‘కొండుభోట్టీయము’లో తృతియాంకం ద్వితీయరంగంలో
పై వాటికి కొనసాగింపుగా అనిపించే మాటలు కొన్ని కనిపిస్తాయి. దివాన్
బహుద్దూర్ రాజారాం గిరీశం పంతులుగారితో ఒక సందర్భంలో “ హిందూ హిందూ అనే
మాట తుడుపు పెట్టి సంఘ సంస్కారమే ముఖ్యముగా ఆలోచించవలసి ఉంటుంది .హిందూ
అనే మాట చేర్చగానే మన ఉద్యమముల లాభము సంకుచిత మౌతుంది;’అంటారు. నేటి
సామాజిక రాజకీయపరిణామాలకు అక్షరాల అన్వయించుకోదగ్గ మాటలివి. సమాధానంగా
‘నిష్కల్మషమైన మనసు , అవ్యాజ్యమైన భూత దయ ఉంటే యే మతమైనా సమ్మతమే
“ అంటుంది గిరీశం పంతులు గారి పాత్ర అంటుంది. నేటి మత అసహన నేపధ్యంలో వారి
రచనల ప్రస్తుతాన్వయమూ ఎంతో బోధపడతాయి. అంతేనా క్రీ.పూ అశోకుడు శిలా
శాసనాల్లో రాయించిన పర మత సహనం ఈ మాటల్లో ఉట్టి పడుతుంది.
గురజాడ వారి కధల్లోకి కధానికల్లోకి వెళితే రాసినవి బహు కొద్దే అయినా
సమాజంలోని రుగ్మతలకు అద్దం పడతాయి. అవిద్య అజ్ఞానానికి ,కోరికలకి,
బలహీనతకీ హేతువు. అలాగే విద్య జ్ఞానానికి సంస్కారానికి ప్రతీక అని
తెలియచేస్తూ భర్త కు కనువిప్పు కలిగించే మేటి కధ “దిద్దుబాటు”. కొన్ని
కారణాలతో తెలుగు కధా చరిత్రలోనే మొదటి కధగా ప్రత్యేకత సంతరించుకున్న కధ
ఇది. “సృష్టిలోకల్లా ఉత్కృష్టమైన వస్తువు విద్య నేర్చిన స్త్రీ రత్నమే”
అనిపిస్తారు , కనువిప్పి కలిగిన భర్త చేత , గురజాడ వారు. మరొక కధా కలికితురాయి మీ
పేరేమిటి? అనే కధ . ఈ కధ పూర్తి పేరు ‘దేవుడు చేసిన మనుషుల్లారా! మనుషులు చేసిన
దేవుళ్ళారా ! మీ పేరేమిటి?’. ఈ కధ ఆరంభమే బౌద్ధుల ప్రస్తావన అవుతుంది.
పురాణాల గురించి మేము శంకలు వేస్తే, మా గురువుగారు, “ వెధవ చదువు! మీ మతులు
పోతున్నాయి. మీరు వొట్టి బౌద్ధులు” అనేవారు- అంటాడు శిష్యులలో ఒకరు. అంటే
ప్రశ్నలు వేసేదీ ,సమాధానాలు శాస్త్రీయంగా లేకపోతే అడ్డు చెప్పేదీ కేవలం
బౌద్దులేనని నాటి సమాజం నిర్దారణ కు వచ్చినట్లు అర్ధం అవుతుంది. అంతకు మించి
ఈ కధ మొత్తంగా చదివితే గురజాడ వారికి బౌద్ధం మీద, బౌద్ధ సాహిత్యం మీద
బౌద్ధ స్తూపాలమీద పరిపూర్ణమైన అవగాహన , సానుకూల దృక్పధము, అలాగే
బౌద్ధాన్ని వక్రీకరించి నిర్వీర్యం చేసిన శైవ వైష్ణవాల కుట్ర మనకు అవగతం
అవుతాయి. శిష్యులే గురువు చేత బుద్ధ చరిత్ర చదివించి కనువిప్పు కలిగిస్తారు.
బౌద్ధ కట్టడాలను బుద్ధుని ప్రతిమలను ఎలా విష్ణు క్షేత్రాలుగా శైవ
క్షేత్రాలుగా మార్చేసి ఘర్షణలు పడేవారో ఈ కధ తెలియచేస్తుంది. ఒక చోట
“ఈదేశంలో పాండవులు ఉండని గుహలు, సీతమ్మ వారు స్నానమాడని గుంటలు లేవు” అన్న
మాటలు రామాయణ భారతాల డొల్లతనాన్ని బయట పెడతాయి. బౌద్ధ చారిత్రకతని
వివరిస్తాయి.
మెటిల్డ అనే కధ లో “చెడ్డ తలంపు చెప్పి రాదు,ఎక్కడనుంచో రానక్కరలేదు.కంటికి
కనబడకుండా మనసు లోనే పొంచి ఉంటుంది” అంటుంది ఒక పాత్ర. బౌద్ధంతో పరిచయం
ఉన్నవారికి ‘మనస్సు అన్ని తలంపులకి కారణము’, ‘మనస్సు నీ యజమాని’, ‘దమ్మానికి

మూల ధాతువు మనస్సు’ అని చెప్పే దమ్మపద లో ‘మనోపుబ్బంగమ దమ్మ .... ” అనే
పంక్తి గుర్తుకు రాక మానదు. మరొక సందర్భములో వర్డ్స్ వర్త్ కవిత్వం గురించి
మాట్లాడుతూ “ పుట్టుకవల్ల గొప్ప రానేరదు, గుణ యోగ్యత వలననే గొప్ప
వచ్చును”అంటారు, గురజాడ. ఈ మాటలు – ‘బ్రాహ్మణత్వం అనేది పుట్టుకతో
వచ్చేది కాదు , ప్రజ్ఞతోనే వస్తుంది,’ అనే బుద్ధుని బోధకు ఎంతో దూరం కావు
కదా!.
1900 వ సంవత్సరం డిసెంబర్ లో గురజాడ వారు కలకత్తా లోని సందర్శించిన
మ్యుజియం గురించి తన డైరీ ఇలా రాసుకున్నారు, “ఇక్కడ పురావస్తు విభాగంలో
బౌద్ధ కట్టడాలు, స్తూపాలు,చైత్యాలు విరివిగా ఉన్నాయి. బౌద్ధ కళా
కృతుల్లో గ్రీకుల కళానైపుణ్యం ప్రస్పుటిస్తుంది.” అంటే గాంధార కళ అని ఆయన
ఉద్దేశముగా అర్ధం అవుతుంది. కొన్ని అద్భుతమైన బుద్ధుళ్ళ మరియు బోధి
సత్వుల విగ్రహాలు ఉన్నట్లుగాను రాస్తూ , “ ఇప్పటికీ నాకు అర్ధం అయింది
ఏమిటంటే బుద్ధుళ్ళ మరియు బోధి సత్వులకు ఉన్న తేడా, బోధి సత్వులు ఆభరణాలు
ధరించి ఉన్నారు”, అని ముక్తాయిస్తారు. మరొక చోట “కృష్ణా జిల్లాలోని బౌద్ధ
అవశేషాలు” సంబంధించిన పుస్తకాన్ని ఆయన చదవనున్నట్లు తెలుస్తుంది. నిజమే
బౌద్ధం మీద విశేషమైన అభినివేశం లేకపోతే ఆయన కధల్లో అంత లోతైన విషయాలు,
సామాజిక సంస్కరనీయ అంశాలు చర్చించేవారు కాదేమో అనిపిస్తుంది. కలకత్తా
నేషనల్ మ్యుజియం మన దేశానికి తలమానిక.అతిపెద్ద మ్యుజియం. పూర్తిగా
దర్శించాలంటే రెండు రోజులు పడుతుందంటే అతిశయోక్తి కాదు. అటువంటి
మ్యూజియంలో సందర్శించి ఎన్నో ప్రత్యేకలతలున్నా కేవల బౌద్ధ చరిత్రను
ఉటంకించడం బౌద్ధం పై అతనికున్న అభిమానాన్ని అతనిపై ప్రభావాన్ని
చాటుతుంది.
నా స్వంత ఆలోచనలు(My own thought)అని ఆయన ఆంగ్లంలో రాసుకున్న
స్వగాతాల్లో ప్రేమ,కరుణ,శాంతి,ప్రశాంతత గురించి తరచుగా రాసుకున్నారు. ప్రేమ
ఇచ్చిన ప్రేమ వచ్చును, అంటూ ప్రేమలోని తాత్వికతను బయటపెట్టారు. మూఢ
నమ్మకాలగురించి చాలా చోట్ల చాలా నిశితంగా విమర్శించడం మనకు కనిపిస్తుంది.
‘అసంతృప్తిని, కోపాన్ని తాత్వికతతో సంభాళించు కున్నట్లు అయితే సుఖ శాంతులు
లభిస్తాయి. రెచ్చగొట్టే ధోరణినికి లొంగకుండా దాని వెనుక ఉన్న
ఉద్దేశాన్ని,ఆలోచనని అంచనాలతో అర్ధం చేసుకుని తాత్విక దృష్టి తో చూడాలి.
అప్పుడే తుఫాన్లో అతలాకుతలమైన చెట్టులా కాకుండా భూమితో నున్న శిలలా
నిబ్బరంగా ఉంటారు అని ఆంగ్లంలో రాసుకుంటారు గురజాడ. ఈ పై అంశాలనే బుద్ధుడు
దుఃఖ కారణాలుగా వివరిస్తూ అష్టాంగ పరిష్కార మార్గాన్ని బోధిస్తాడు. క్షమా
గుణాన్నే వివరిస్తూ ఉపేక్ఖ అనే ఒక్క పదం తో ప్రపంచానికి దగ్గరౌతాడు .
గురజాడ అప్పారావు గారి రచనల్లోని విశిష్టత అందరికీ బాగా పరిచయమే.
సామాజిక స్పృహకు, అభ్యుదయ చైతన్యానికి, భాషా సంస్కరణలకు,దేశభక్తికీ
గురజాడ సాహిత్యం దోహద పడినంతగా మరి ఎవరి సాహిత్యమూ , మరే భాష లోనూ
దోహదపడలేదు. నేటికీ వారి రచనల ప్రాసంగీకత ఎంతో నేటి కాల పరిస్థీతులే
తెలియచేస్తున్నాయి. నేటి సాహితీ సమాజం వాటిని మరలా పునర్మూల్యాంకన
చేయ వలసిన అవసారాన్ని గుర్తు చేస్తున్నాయి. వ్యక్తిగత ఆచరణలో చిన్న చిన్న
విమర్శలున్నప్పటికీ అంతర్జాతీయ కవిగా గుర్తింపు పొందగలిగిన స్థాయున్న
సాహితీ ద్రష్ట, గురజాడ. ఎందరో సాహితీ వేత్తలు,సంస్కర్తలు నాటి నుండీ నేటి
వరకు బౌద్ధం యొక్క ప్రభావానికి లోనయి నప్పటికీ విస్మరించడాన్నో,
వక్రీకరించడాన్నో సాహితీ సమాజం గమనిస్తూనే ఉంది. కానీ గురజాడ వారి ఆలోచనా
విస్తృతి దీనికి భిన్నంగా ఉండడాన్నేకాదు, పారదర్శకతతో ఎద్దేవా చేయడాన్ని
కూడా మనం చూస్తాం. సాహిత్యము సమాజ శ్రేయస్సుకు ఎలా దోహదపడగలదో,

సమాజహితానికి కొలమానం కాగాలదో తెలుసుకోవాలంటే గురజాడ అప్పారాగారి రచనలు
చదవాల్సిందే. సాహిత్యం దేశ ప్రయోజననాల్ని సమిష్టి గా సమభావంతో తీర్చే
మహోన్నత రూపాన్ని సంతరించుకున్నప్పుడు ఆ కవిత్వం జాతీయత సంతరించుకుంటుంది.
ఇక్కడే గురజాడలో బౌద్ధం ఛాయలు తొంగి చూస్తాయి. వారికి శత వర్ధంతి నివాళి
అర్పిస్తూ,కన్యాశుల్క నూట పాతిక జయంతికి శుభాకాంక్షలు తెలియచేయడానికి
గర్వపడుతున్నాను .
డాక్టర్ మాటూరి శ్రీనివాస్ .