Friday, 10 August 2018

S -377


ఆకలేస్తే తినడం కూడా తప్పైన జీవితపు  పరాధీనతలో
అడుగడుగునా అడుక్కోవడమో లేదా సణుక్కోవడమో నేటి ప్రజాస్వామ్యం
వాడిచేతిలో అధికారం , పిచ్చోడి చేతిలో హక్కుల అణుబాంబు.
లింగ వివక్ష పరాకాష్ట పరిధులు దాటి పంజా విసరినప్పుడు
చచ్చినట్టు స్వలింగ సమీకరణాలకు సలాము చెయ్యాల్సిందే...
పడగ్గదిలో భాగస్వామి వారినెలా ఆస్వాదించాలో
అశ్వినీ దేవతలా వారసులు ఈల ఊదుతూ చెప్పాల్సిన అవసరం లేదు
అయినా , ఏది సహజమో  ఏది అసహజమో ప్రకృతికే వదిలేస్తే పోలేదూ?
జరిగేదంతా ‘రూల్ ఆఫ్ ది నేచర్’ ప్రకారమే జరుగుతుందని తెలీదూ?
ఎవ్వరికీ హాని లేని అంతర్గత ప్రవృత్తులకు చట్టాలూ శిక్షలూ  ఎందుకు?
రేపు చూషణలూ, చేతి ప్రయాగాలు  కూడా మా పరిధి లోనివేనని
కాదంటే దేశ ద్రోహాన్ని అంటగట్టే అంగ వైకల్యాన్ని నేననుమతించాను
నాలుగ్గోడల మధ్య ఆ  ‘అతి’రహస్య మే శాంతి విఘాతమైతే 
బహిరంగంగా బూతు పురాణాలు భక్తీ ముసుగులో  భోగాలకోసమే
సృష్టించిన ప్రత్యేక  కులాలు ఏ సమానతకు చిహ్నాలు?
 మానవహక్కుల ఉల్లంఘన ఏ ఫాసిజానికి ఆనవాలు?
                                                              
డాక్టర్ మాటూరి శ్రీనివాస్ (12-07-18)

No comments:

Post a Comment