Tuesday, 14 December 2021

సహజం

సహజం కన్నీళ్లకు ఎంత బలమో కదా ?! అవి ఇంకితేనే గానీ హృదయం తేలికవదు కలవవనుకునే భూమీ ఆకాశాల మధ్య ప్రణయమైనా ప్రళయమైనా కూడా అంతే! అవినాభావమే ప్రకృతి మార్మికతకు పర్యాయం కురిసినదంతా ఇంకాల్సిందే ఉరికినదంతా ఉరిమిందంతా కలవాల్సిందే అనుభవాలలోతెంతైనా జీవితంలో మేళవించాల్సిందే, అంతే .. పులకింపైనా , చిర చిరలైనా పుడమి చిట్ట చివరకంతా భరించాల్సిందే ముసురు వెల్లువలో కొట్టుకుపోవాల్సిందే , మొదమైనా ఖేదనైనా అంతే భూమేగా విత్తుకి చిరునామా కనికరించని నాడు మేఘాల కాఠిన్యానికి ఒప్పగించుకోవడమే , నువ్వైనా నేనైనా ూడా అంతే.... కూడి కురిసినప్పుడు పులకించడం ఘర్జించడం కంపిండం వీడి విచ్చిన్నమై ఛిద్రమైపోయినప్పుడు కాలం పూసిన లేపన సాయంతో ఘనీభవించడం,అంతే ప్రకృతి గేలానికి గుచ్చిన ఎర బతుకెప్పుడూ పరాధీనమే మేఘామైనా దేహమైనా కూడా అంతే ...

No comments:

Post a Comment