కులానికో గోత్రం
గోత్రానికో సూత్రం
ముసుగులోని మంత్రం
మనిషి కో తంత్రం.
.......
మతం అంటేనే ముసుగు
గతం అంటేనే లొసుగు
ముసుగులోని మాయగాడు
లొసుగులోన వేటగాడు
.......
తత్వం లేని చిత్తం
నాభి లేని వృత్తం
సురభి తెచ్చిన యుద్ధం
మతవాద పరమార్ధం
..... . .....
నడమంత్రపు సిరితోను
నవ్విందొక నాప చేను
మత మౌఢ్యంతో పేర్లు మార్చేను
మారాల్సింది తానని ఎప్పుడు తెల్సేను...
డా.మాటూరి శ్రీనివాస్.
07-11-18
No comments:
Post a Comment