(విశాఖపట్నానికి ప్రతిష్టాత్మక సంబరాలు విశాఖ ఉత్సవాలు ఊరూ వాడా సముద్ర తీరం చేరుతారు. పాలకులే వ్యాపారులైపోతారక్కడ. గుళ్ళూ గోపురాలు వెలుస్తాయి. గానా బజానాలు అర్ధరాత్రి వరకూ నడుస్తాయ్. కానీ విశాఖ పట్టణానికి సంబంధించిన చారిత్రిక ఆనవాళ్ళు గానీ, నిర్మాణాలు గానీ కనిపించవు . చరిత్రను విస్మరించినవారు చరిత్ర సృస్టించ లేరు)
ఎప్పటిలాగే అంగ రంగ హంగు పొంగుల వైభోగంగా విశాఖ ఉత్సవాలు ఆరంభం అయ్యాయి. విశాఖ
వాసులు ఏ అంశాన్ని అయినా ప్రతిష్టాత్మకంగా
తీసుకుంటారు. కాస్త ఆలస్యం అయినా ఈ ఉత్సవాలు, నిత్యం సాగర తీరంలో తచ్చాడే విశాఖవాసులకు
ఆటవిడుపే. ప్రభుత్వం కూడా పర్యాటక పరంగా ఆధ్యాత్మిక పరంగా మార్కులు కొట్టేందుకు ఈ
ఉత్సవాలను వినియోగించుకుంటుంది. అదే విధంగా నాయుకుల స్పర్ధలనూ లుకలుకలనూ బయటపెడుతూ వార్త అవుతుంది. క్రొత్త
దనం కోసం ప్రాకులాడే వారికోసం
క్రొత్తక్రొత్త ప్రతిభలను ప్రక్రియలను
పరిచయం చేసేందుకు జిల్లా యంత్రాంగం కూడా తన వంతు ప్రయత్నం చేస్తుంది. అబ్బో ఖర్చు
సంగతి మరి చెప్పక్కర లేదు. ఒక రాజధాని
నిర్మాణం కోసం డబ్బు లేదు అంటూ అంత ఆర్భాటము అవసరమా అనేవారూ లేకపోలేదు. ఈ సారి
సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణ కురుసుర జలాంతర్గామి ఎదురుగా ఏర్పాటు చేసిన యుద్ధ
విమానం టి యు 124 . ఈ మ్యుజియం విశాఖ స్తాయిని అమాంతం పెంచేస్తుంది అనడంలో సందేహం
లేదు. పుష్ప ప్రదర్సనలూ, కార్నివాల్ శోభా
ఎప్పటిలాగే అయినా ప్రజాదరణకు పోలీసుల హదావుడికీ
లోటు లేదు. ఈ సారి గతం కంటే ఎక్కువ గుళ్ళ నమూనాలు అందరి దృష్టినీ ఆకర్షిస్తాయి,
అలాగే కొందర్ని ఆలోచింప చేస్తాయి. సింహాచలం అప్పన్న నుండీ అనకాపల్లి నూకాలమ్మ వరకూ
ఆంధ్రులకందరికీ ఇష్ట దైవాలే.సుమారు
తొమ్మిది దేవుళ్ళ నమూనాలను కొలువు దీర్చారు నిర్వాహకులు. దీని వెనుక ఉన్న లబ్దినీ
అవసరాన్ని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఏమి మీ ప్రోబ్లం ?అనవచ్చు. మరి అంటే ప్రాచుర్యం పొందిన కొండ గుడిని,డాల్ఫిన్
కొండనూ డచ్ కట్టడాలను చరిత్రలో భాగం
కాదనుకున్నారో ఏమో? లేదా కేంద్ర అలౌకిక స్పూర్తిని పుణికి పుచ్చుకున్నారో ఏమో? అనే
అనుమానాలతో పాటూ అధ్యాత్మిక పేరుతొ మత ప్రచారం జరుగుతుందనే విమర్శను మూట కట్టుకునే
అవకాశాన్ని రాష్ట్ర పాలకులు కోరి
తెచ్చుకుంటున్నారు. ఒకటీ రెండూ అయితే పెద్దగా ఎవ్వరూ అభ్యంతరం చెప్పారు. అంతకన్నా
అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే యునెస్కో లాంటి
అంతర్జాతీయ సంస్థలే గుర్తించి
ప్రాచుర్యం చేస్తున్న భారత దేశ చారిత్ర వారసత్వపు ఆనవాల్లైన బొజ్జన్న కొండ, బావి
కొండ, తోట్ల కొండ పావురాలకొండల ప్రస్తావన లేకపోవడం పలు విమర్శలకు
తావిస్తుంది. క్రీ.పూ. 2 నుండీ క్రీ.శ
7-8వరకు పరిడవిల్లిన భారతీయ సంస్కృతినీ సంప్రదాయాలని వారసత్వాన్ని విస్మరించి
నిన్న మొన్నటి నిర్మాణాలయాన వాటిని చరిత్రగా చూపిండాన్ని విశాఖ చరిత్ర తెలిసిన వాడిగా
చింతిస్తూ రాబోవు కాలంలో అసలు సిసలైన చరిత్రకు తగు స్థానం కల్పిస్తారని ఆశిస్తూ ఈ
విశాఖ ఉత్సవాలు శుభప్రదంగా సాగాలని కోరుకుంటున్న విశాఖ వాసి.....
డాక్టర్
మాటూరి శ్రీనివాస్
9849000037
విశాఖపట్నం
No comments:
Post a Comment