జంబూక -
ద్వీపం
రచన ;డాక్టర్ మాటూరి శ్రీనివాస్
నిజమే పుట్టినప్పటి నుండీ మనిషిని పశువుని
నమ్ముకుని బతికినోడ్ని
పుట్టు నాగరీకున్ని కదా వోర్పు సంస్కారం పాళ్ళు ఎక్కువ
అప్పటి వరకూ మూలాన నక్కి మెదడులో విషాన్ని
నింపుకుని వచ్చాయి
నీకొక
అందమైన దేశాన్ని నిర్మిస్తాను నాతో చేతులు కలుపని
తెల్ల గెడ్డం నక్క ప్రకటిస్తే,
అదీ నీ
కొక్కడికే సొంత మని వంత పలికిందో బలిసిన
గుంట నక్క
ఎప్పటిలాగే యిట్టే నమ్మేసాను
పైగా అవి రాముడి పేరు జపిస్తున్నాయని ఎగిరి
గంతేసాను
వాటితో పాటూ వందల్లో గొర్రెలు కలిసి రావడం తో
పులకించిపోయి
సముద్రంలో నీటి చుక్క లాగా నేనూ మందలో కలిసి
పోయాను
ఆ గొర్రెల బుర్రల్లో మదము మత్తు ఎక్కించి మూర్ఖత్వాన్ని
నింపాయని తెలీలేదు
నా దేశానికి పునాదికి అనాదిగా ఉన్న దర్గాని ఎక్కి
కూల్చేయమన్నాయి
తరాలుగా అజమాయిషీ చేస్తున్న కొన్ని ముసలి నక్కలు
కూల్చేసిన ఆనందానికి గొర్రెలతో పాటూ నాకూ సభ్యత్వపు రంగును పంచారు,
చెడ్డీ
వేస్కుని హోలీ చేసుకున్నాను,ఆ ఉన్మాదంలో
నా దేశానికి కంచె కడదామని వంకతో
ప్రహరీగా ఉన్న కాశ్మీరు లోయని మట్టితో మున్చేసాం
తిరగబడ్డ పులుల్ని మేకలుగా మార్చేసాం , బలం
పెరిగింది.
అదను చూసి అవకాశం కోసం రంకెలు వేస్తూ కొల్ల
గుర్రాల్లా తయారైయ్యాం
నిమ్మకున్న
అన్య రంగు గొర్రెలు మేస్తున్న
గడ్డి వాముల్ని కాల్చేసాం
గర్వంగా దేశభక్తులమని మాలో మేమే కోపిష్టి ఆంజనేయ
బొమ్మలని
జ్ఞాపికలిచ్చేసుకుని , త్రికోణ జెండాలను
ఎగరేసుకున్నాం .
ఇంతలో అవే అన్య రంగు గొర్రెల నోళ్ళు
పెంచుతున్నయన్న
అనుమానంతో ఒక్కసారిగా మేమంతా పాకిస్తానీ
గొర్రెల్లా మారిపోయాం
మా రంగు గొర్రెలు వాళ్ళ మోజులో పడతాయనే భయంతో
ప్రేమించుకున్న గొర్రెల్ని నరికేసి మా
నక్కల్కి నైవేద్యంగా పెట్టాం
పుంసత్వంతో పోటీ పడలేక వాటి విడాకుల చట్టాన్ని
పూడ్చేసాం
అంతా బాగానే ఉందనుకునేలోగా పరదేశీ గొర్రెలు
మా దేశంలో గడ్డి మేయడాకి ఎగబడ్డాయని ఎవరో చెపితే
వాటిని లెక్క కట్టామా తీరా చూస్తె అవి తొంభై శాతం
మా జాతివే ,
నాలుక్కరుచుకుని
వాటికి గడ్డి వేసి
మిగతావి గోల చేస్తున్నాయని దొడ్లో కట్టేశాం ,
అంతే ఒక్కసారిగా దేశంలోని జంతువులన్నీ ఏకమైపోయాయి
దేశ ద్రోహ నేరం ఆరోపించి అప్రకటిత ఎమెర్జెన్సీ
ప్రకటించాయి నక్కలు
ఇప్పుడిప్పుడే మా గొర్రెల మందకు ఏదో ఆలోచన
వచ్చినట్టుంది,
మా కుట్ర పారకపోగా మేం త్రవ్విన గోతిలో మేమే పడిపోయే పరస్థితి
మాతో పాటూ మా దేశం కూడా అదే గోతిలోని దుర్గతి
లోనికి...
……………………………………………………………………………………………………………………………………….
No comments:
Post a Comment