ఒక హిజ్ర కధ
ఏమి చూసుకుని బాయ్యా! మురిసిపాటు, ?
ఏమీ తెలియకుండానే అక్యా!ఆ వెకిలిబాటు ?
సిగ్గు పడాల్సింది నేనో,నీవో మరిసిపోయి ఎందుకా
ఎగిసిపాటు?.
నీకున్నదేటో-నాలో లేదనా,
నాకున్నదేటో- మీలో లేదనా ,
భువినేలుతున్న బృహన్నలం ..
శుభం కోరే సుముహూర్తాలం ..
తేడా మనుషులమేమో ,గానీ
మీలా తేడా మనసుల అమానుషులం కాదు .
ఆలక్ష్య , నిర్లక్ష్యాలకు నెలవైన
సంస్కారం లేని మీ చులకన చూపులకి కాస్త పలకరింపులు
నేర్పండి .
అనివార్య జన్యు విన్యాసాన్ని .
ఆరో వేలు ఉంటే ఏం? ఊడితేనేం? అర వేలు
ఉంటేనేం?లేకుంటే నేం?
అవని లో వెలిసిన అర్ధ నారీశ్వరుడను- ఆరాధించండి.
ద్విలింగ మానవతా సమూహాన్ని –గౌరవించండి .
లింగ వివక్ష ఉద్యమ పరాకాష్ట ను - సహకరించండి .
డాక్టర్ మాటూరి శ్రీనివాస్
No comments:
Post a Comment