Friday, 10 April 2020

అచ్చేదిన్....


అచ్చే దిన్

అవకాశాలను అటకల మీద దాచేసి
కుటిలత్వాన్ని పిలకల్లో ముడేసి 
ఆకాశ మంత అమానవీయాన్ని  మూటగట్టుకుని
దిక్కుమొక్కూ లేని చిల్లర  దేవుళ్ళను చూపి భయపెడుతూ ,
దోపిడీని స్వాసిస్తూ, అనంత అపచారాన్ని
అడుగడుగునా ఆచరిస్తున్న కడనీతి,
 రాసిన ఆకలి కాలాన్ని,అద్భుతంగా నమ్మబలికి
కోట్లాది బతుకులను క్షుద్బాధ పాల్చేసిన
రామరాజ్యం పునర్నిర్మాణ జెండాతో 
 కృష్ణ మాయా గీతణు రాజకీయ అజెండా గా మార్చి
కూలి నాలిని ఏమార్చిన - కులాహంకార సంస్కృతి .
సామాజిక చైతన్యవనంలో కలుపుల అవరోధం .
మానవాళి ఉనికినే ప్రశ్నిస్తున్నవర్ణ
 గుణ,కర్మలు సాక్షిగా ఇవి చచ్చే దిన్ కానీ
అచ్చేదిన్ ఎట్లా అవుతాయో .
సమాజ బ్రహ్మజెముడై  ద్విజడో , 
మనువు చీమలపుట్టలో  నిదురిస్తున్న
వేయి పడగల విషనాగు కుటిలాన్ని
  అహ  దాహాన్ని చలిచీమలు పీల్చేస్తే
మరిక వచ్చే దిన్, చచ్చేదిన్ కాదు. సచ్చే దిన్ అవి  ..అచ్చే దిన్ అవి.
                     డాక్టర్ మాటూరి శ్రీనివాస్



No comments:

Post a Comment