Friday, 10 April 2020

ఫలితం

పూచే కాలంలో   పూల తోటలో రంగు రంగుల పూలు
 వసంతాన్నే వెక్కిరిచ్చేంతగా
ఉవ్విళ్ళూరుతూ కవ్విస్తూ ఉంటాయ్,   
ఎందఱో మాలీల చమట లోంచి మొలకెత్తిన మనోజ్ఞ రస రమ్య
 ప్రతి సృష్టి  కి పరా కాష్ట
అంతా బాగానే అందంగానే ఉంది బయటకు  
మడి కట్టి వేరు వేరుగా పూయించడంలో శాస్త్రీయత ఉందేమో గానీ
సమరసతను పండించే  మానవీయత లేదు
అక్కడ బృందావనంలోనూ విభజించి పోషించాలని
ఆంక్షల హరివిల్లుతో ఆనకట్ట కడుతుండడం బాగా లేదు
శ్రమను విభజించారేమో  అనుకున్నాం కానీ
శ్రామికులనీ విభజించడాన్ని ఎందుకు ప్రశ్నించ లేకున్నాం   
బంతీ చామంతీ మల్లి  చమేలి  కలిస్తేనే అందం ఆనందమైయ్యేది
 శ్రమ, శ్రామికుడు భ్రమలు విడిచి  పిడికిలి బిగించి నిలిస్తేనే
కార్మిక సహజీవనావనిలో శ్రామైక సౌందర్యం వెల్లి విరిసేది.


……………………………………………………………………………………………

No comments:

Post a Comment