ఏమి ? ఇవ్వగలం
వాళ్ళు వాళ్ళ కోసమే అయినా
కోల్పోయినదేమిటో
తెలిస్తే ఆ వృషణాలక్కడ లేవని అర్ధం
అవుతుంది
ఎప్పుడూ ఎండ వర్షించే జీవితాలు
చిగురించే ప్రశ్నే లేదు
ఎండిన గాయాలతో బీడుపడ్డ మనసును కూడా
దీసుకుని
పావలాకో పదికో నిండుగా దీవించడమే వారికి తెలుసు.
ప్లాస్టిక్ పూవుల్లా ఆ జీవితాలు వాడవు వికసించవు
నివురు గప్పిన రౌరవాగ్ని గుండానికి
నిర్వచనంలా
ఆ మానవ శోకాల చెరగని నవ్వుని చూసే ఉంటావు
కూడళ్ళలో నువ్వు కళ్ళు
త్రిప్పుకున్నప్పుడు
ఆ కళ్ళు నిన్ను ప్రశ్నించడం నిన్ను
క్షమించడం గమనించావా?
చీరలు కట్టి చీకట్లో కాంతి లేని
కళ్ళు చిగురు బోణీల కోసం.
ఆ జీవంలేని కావరాల సంచారం మధ్య
ముందైనా వెనుకైనా ముప్పేనని తెలియక
మిణుగురు పురుగుల్లా
కృత్రిమ
సింగారాల చుట్టూ బొంగరాల్లా మానవ కీటకాలు
ఇద్దరూ
నేటి మానవ దుఖానికి ప్రతీకలని ఊహించావా?
మదం
పూనో మారెమ్మ పూనో కాదు
మనసు
అదుపు లేక మమత కొరత పోగా
మగాడిగా
బతకు లేక వేసిన ఆ లంగా వోణీ
చీకటినీ
చీప్ సాంపిల్ నీ ఒకేలా ప్రేమిస్తుంది
చిన్నప్పుడు
అమ్మ నాన్నలను ప్రేమించినట్టు
చెల్లీ
అని పిలిస్తే తల్లడిల్లిపోయి బుగ్గలు తడిమేసే
తృతీయ
ప్రకృతి పరిమళాలు జీర తప్ప గొంతే లేనోళ్ళు
గుండె
కూడా లేనోల్లం ఏమివ్వగలం
వాళ్ళ
జీవించే హక్కుని సైతం
\
No comments:
Post a Comment