Friday, 10 April 2020

డాలర్ గాలి


డాలర్ గాలి
 నేడిప్పుడు ఆకలికి విపరీతం గా బలం పెరిగింది.
మరింత వేగంతో ఆ రాక్షస ఆకలి` పంజా విసురుతూ ,
అమాంతం ఉన్నదాన్ని ఉన్నట్టుగా   కబళించే
వికృత ఘడియ మరెంతో దూరంలో లేదు.
హుదుద్ గాలి వాటంతో కొట్టుకొస్తున్న ఆకలి
పశ్చిమం నుండీ ఉత్తరం మీదుగా
మళ్ళీ పశ్చిమం చేరి ,స్వేద తీరుతుంది.
పెద్దపులి , చిరుత పులుల అనుబంధం,
ప్రోత్సహించుకుంటూ పని కానిచ్చేస్తుంటాయి.
ఆధిపైత్యపు పెట్టుబడిని
‘ఆకలి’ వల విసురుతున్నతరుణంలో 
‘’డాలర్ గాలి’’ వాయుగుండ మై 
సునామీ గా మారి నా దేశాన్ని మింగే స్తుంది.
                                     డాక్టర్ మాటూరి శ్రీనివాస్      12/05/15




No comments:

Post a Comment