సంఘం శరణం గచ్ఛామి
డాక్టర్
మాటూరి శ్రీనివాస్
బౌద్ధాన్ని చదువుతున్నవారు, ఆచరించ గోరేవారు,
బౌద్దాభిమానులూ తరచుగా మాట్లాడేది , పఠించేది, పాటించడానికి
ప్రయత్నించేది, త్రిసరణ. త్రిరత్నములని కూడా అంటాం. బుద్ధం,దమ్మం,సంఘం. ఈ మూడిటికీ
అర్ధం చేసుకోవడమంటే మూడు సముద్రాల లోతులను అర్ధం చేసుకోవడం అని తెలుసుకోవాలి. కానీ
వీటి గురించి చాలామంది చాలా చులకనగా మాట్లాడడం మనం గమనిస్తూ ఉంటాము. వీరు
తెలుసుకోవాల్సినదేమి టంటే బౌద్ధం సర్వకాలీనం, సార్వజనీనం బౌద్ధం సర్వ ఆమోదయోగ్యం. ముఖ్యంగా
బౌద్ధం నేటి సామాజిక అవసరం. అంతకుమించి అది శాస్త్రీయం. ప్రస్తుత ప్రాపంచక పరిస్థితులకు బౌద్ధాన్ని
అన్వయించడం నేటి అన్ని సామాజిక రుగ్మతలకు పరిష్కార మార్గం అని వీరు
అర్ధంచేసుకోవాలి . అందుకు ముందుగా వీరు బౌద్ధాన్ని ఒక మతంగా కాక సమకాలీన సమస్యలను
సానుకూలతతో అధిగమించే సామరస్య ధోరణిగా
భావించాలి. ప్రపంచదేశాల్లో అన్నిమతాలవారు బౌద్ధాన్ని దాని ఔన్నత్యాన్ని చదివి
అర్ధంచేసుకోవడం మొదలుపెట్టారు. బుద్ధి, దమ్మం గురించి వాటి ఆవశ్యకత గురించి
తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, సంఘం మనిషి మనుగడకు, ఎంత సామాజిక పరమైన అవసరమో తెలిసికూడా
నిత్యజీవితంలో దానిని పరిగణలోనికి తీసుకోము. పైగా ఎవరి కుల,మత సంఘాలకు వారు
బద్ధులై సమాజాలసమూహాలుగా జీవిస్తూ భిన్నత్వమేగానీ ఏకత్వానికి స్థానం లేకుండా సమాజ సహజత్వాన్ని
విచ్చిన్నం చేస్తున్నాము . అంటే ఇప్పుడు సంఘం శరణం గచ్చామి అనే మూడవ రత్నాన్ని ఎలా
అర్ధం చేసుకోవాలో తెలుసుకోవాల్సిన నిజమైన సమయమూ , అవసరమూ వచ్చిందన్నమాట . దానిని నేటి సామాజిక దృక్కోణంలో పరిగణించి ఆచరణ సాధ్యం
చేయాలనేదే బౌద్ధుల తపన. బుద్ధుని బోధ.
బుద్ధుడి కాలంలో ఈ త్రిరత్నాలను
ఆచరించేవారే గాని ఉచ్చరించడం, పఠించడం జరగలేదు.
బుద్దుడు పంచావగ్గీయులతో ప్రధమ బౌద్ధ సంఘాన్ని స్థాపించి పిదప భిక్కుని సంఘానికి
బీజం నాటి “చరకభిక్కు వేచారికం,....” అంటూ బహుజనుల హితంకోసం ,బహుజనుల సుఖాల కోసం
ఏ ఇద్దరు భిక్కులకు ఒకే
దిక్కు లో పయనించకుండా దేశాటన చేయవలసిందిగా ఆదేశించాడు. అటువంటి భిక్కు సంఘానికి ఉపాసిక ఉపాసకులు శరణు వేడుకోవాలని బుద్ధుని ఉద్దేశం. అదే ‘సంఘం శరణం
గచ్చామి’. దాని వెనుక ఉన్న అంతరార్ధం ఏమిటి? ఆనాటి కాలం లో సంఘం అంటే అరియ సంఘము లేదా భిక్కు సంఘము లేదా
ఉన్నతుల సంఘమని అర్ధం. త్రికరణశుద్ధిగా బుద్దితో జ్ఞానాన్ని పొందినవారు, దమ్మబద్ధమైన
జీవితాన్ని ఆచరించే వారు , అలాగే వినయాన్ని పాటించేవారు నిర్వాణ మార్గంలో నడుస్తూ
జ్ఞానోదయులౌతారు . కనుక అటువంటివారి సాంగత్యం మానవాళికి అంటే సమాజానికి అవసరమని
బుద్ధుడు భావించాడు. అయితే జ్ఞానోదయానికి అందరూ అర్హులే , దాని సాధన మార్గాలను
అర్ధం చేసుకుని ఆచరణలో పెట్టడంలోనే అసలు మార్మికత ఉంది.
జ్ఞానోదయం
గురించి తెలుసుకోవాలనుకుంటే,అంతకంటే ముందు మన మానసిక బ్రష్టత (defilement)గురించి , దాని ప్రక్షాళన గురించి తెలుసుకోవాలి. మానసిక
అపరిపక్వతకు కారణం మన మనస్సులో ఆవహించిన
అకుశలతే . అంటే అప్పటికే మనలని ఆవహించిన మన అకుశల
చిత్త మానసిక స్థితి (condition). గతములోని అకుశల చిత్తానికి(అనైతిక లేదా అనారోగ్యమైన
ఆలోచనలు) నేటి ఆకుశల చిత్తము కారణమై ఉండి, నేటి అకుశల చిత్తము భవిష్యత్ అకుశల
చిత్తానికి సోపాన బీజంగా నిలిచి క్షణ క్షణానికీ వృద్ది చెందుతూ నిరంతరం మన
మనోచాపల్యాన్ని తరుముతూ ఈ అకుశల చిత్త నిక్షేపాలను మన మనస్సులో పేరుకునే విధంగా దోహదపడతాయి.
అందుకే అన్ని అకుశల కర్మలు ముందుగానే, మన మనసు నిర్ణయించిన మేరకు ముందుగానే రూపుదిద్దుకుంటాయి. ఇవి మన మనసుల్లో చాలా లోతుగా
వేన్నూలుకుంటాయి. వీటిని కూకటి వేళ్ళతో పెకలించడానికి ఏకైక మార్గం నిర్వాణం . జ్ఞానోదయం
ద్వారానే ఇది సాధ్యం. ఒక్కసారిగా ఇది
అసాధ్యం కూడా. అంచలంచలుగా దీని పై పట్టు సాధించడానికి ధ్యానం ఒక్కటే మార్గం.
తానూ, తన స్వంతం, స్వార్జితం, నేను ,నాది,
నాకు, అని పట్టుకునే వేలాడే తత్వాన్ని త్యజించాలి. అంటే నామ రూపాలకు ప్రాధాన్యత
ఇవ్వడం మానాలి. వాస్తవికతలో జీవించడం అలవర్చుకోవాలి. ఇది మొదటి దశ. దీనినే ‘సోతాపన్న’
అంటారు . అంటే సంసార చక్రాన్ని కట్టిపడేసిన ముఖ్యమైన బంధాలను తెంచుకుని జ్ఞాన
మార్గాన నిర్వాణము వైపు నడిచేవాడని అర్ధం. దీనిని సాధించిన వాడు , ఒక కొత్త
అనుభూతిని పొందుతాడు. కానీ అన్ని మనో దౌర్భాల్యాలు పూర్తిగా దూరం కావు. లోభం,ద్వేషం,
ఇంకా కామం మానవ మస్తిష్కంలోలోపల కొట్టు
మిట్టాడుతూ ఉంటాయి. కానీ వాటి ప్రభావంలో పడకుండా ఉండడానికి ప్రత్నిస్తూ వాటిని
గుర్తించి గమనిస్తాడు . ఇదే నిర్వాణ మార్గ
సోపానం . ఇదొక భేషరతుల దమ్మ పధము.
మన దైనందిన
జీవితంలో ఎన్నో అకుశల చిత్తాలు
మనసులోని స్పురిస్తూ, మాయమౌతూ ఉంటాయి. ఎన్నో ఇష్టా యిష్ట వాస్తవ సందర్భాలను
మనం అనుభవిస్తూ ఆస్వాదిస్తూ ఉంటాం. ఈ ఆలోచనలూ, ఈ సందర్భాలే నిరాశకు, అసంతృప్తికీ, దుక్ఖానికి హేతువులు అని
మనం గమనించం. నిర్వాణానికి గమ్యం లోకోత్తర చిత్తం. అంటే అత్యున్నతమై ఆలోచనా
ధోరణిని ఔపాసన చేయడం. అనుభవంలోనికి వచ్చినది ప్రతీదీ వెంటనే మాయమౌతుంది.
కోరికలున్నంతవరకూ అకుశల చిత్తం ఉత్పన్నమౌతుంది. సోతాపన్న నామరూపాలాలను
విస్మరించినప్పటికీ లేదా త్యజించినప్పటికీ ఇంకా ద్వేషం,అజ్ఞానం వెంటాడుతూ ఉంటాయి.
నిర్వాణ మార్గంలో ధ్యాన రీతిలో రెండవ
దశ ‘సకదాగామీ’ . ఇంకా కొన్ని అనుబంధాలు లేదా ఇంకా కొన్ని వ్యతిరేకతలు మనసులో ఉండనే
ఉంటాయి, కానీ వాటి తీవ్రత, వాటి ప్రభావం
తగ్గడాన్ని మనం గమనిస్తాం. కానీ అవిద్య, అజ్ఞానం వెంటాడుతూనే ఉంటుంది. దీని
అంతు చూడాలంటే అది అర్హంతులకే సాధ్యం.
మూడవ దశ ‘అనాగామి’ . సాధనలో పురోగమించి పవిత్రత సాధించినవాడు,అనాగామి. ఇంద్రియాలకు
సంబంధించిన అనుబంధాలు ,వ్యతిరేకతలూ పూర్తిగా తొలిగిపోతాయి. భవ బంధాలనుండీ విముక్తి పొందినవాడు, పునర్జన్మ
రహితుడు అనే అర్ధాలు వస్తాయి. అంటే గతంలోని ఉన్న ఎటువంటి అకుశల చిత్తాలు అతని
తలంపు లోనికి రావు. అతనిని తాకవు,
బాధించవు . కోరికలు కలగవు, స్పందించడన్నమాట. ఇక ఇక్కడే వోప్పుకోలేని, ఆచరణకు అత్యంత కష్టతరమైన అసలు సమస్య ను ఎదుర్కోవాలి. ఏమిటది? అదే ‘అహం బ్రహ్మాస్మీ’ అనే భావన . ఇది అంతర్లీనంగా ప్రతిఒక్కరినీ
వేధిస్తూ ఉంటుంది. నేనే బ్రహ్మ నీ అనే భావన. బ్రహ్మ అనేది ఇక్కడ దైవత్వమో, బ్రహ్మ
సమానుడనో కాదు. పురుషోత్తముడు,అత్యంత ఉన్నతుడనే భావన. తన యొక్క అహం అన్న మాట. ఎంతటి గొప్పవారైనా ఏదో
ఒక సందర్భంలో, ఏదో ఒక అంశంలో, తోటి వారితో పోల్చుకుంటారు. కానీ ఈ వాస్తవాన్ని అంగీకరించకపోవచ్చు.
ఈ అత్యంత ప్రమాదకరమైన అవలక్ష్నాన్ని అధిగమిస్తే నాలుగవ దశ అయిన ‘అరహంతత్వాన్ని’అందుకున్నట్లే.
అయితే వచ్చిన చిక్కల్లా నిర్వాణ మార్గాల్లో ఎవరు ఏ దశ లో ప్రయాణిస్తున్నారో
తెలుసుకోవడం కష్టం. ఒక్కొక్కరు ఒక్కొక్క
దశలో ఉంటారు. ఇది భిక్కులకూ ఉపాసకులకూ ధ్యానం ద్వారా నిర్వాన మార్గాన పయనిస్తున్న
అందరికీ వర్తిస్తుంది. మనం కూడా ఆ మార్గంలో ప్రయాణిస్తేనే తప్ప తోటి ప్రయాణికులెవరో,
ఎక్కడ బయలుదేరారో, ఎక్కడున్నారో తెలిసేదెలా? ఇటువంటి పరిస్థితే సమాజానికి అను
నిత్యం ఎదురౌతుంది. ఎవరు ఏమిటో తెలిసేదెలా? ఎవరి మానసిక స్థితి ఏ స్థాయిలో ఉన్నదో
తెలుసుకోవడం ఎలా? దీనికి ముందుగా కావాల్సింది, మన మనోచిత్తం ఏ స్థాయిలో ఉన్నదో
తెలుసుకోవాలి. దీని కోసం మనం ప్రత్యేక పూజలూ, ప్రార్ధనలు చేయనవసరం లేదు. మన జీవన
విధానాన్ని మార్చుకోనక్కరలేదు. కష్టతరమైన నియమ నిష్టలు పాటించనవసరం లేదు. మరి ఏమిచేయాలి?
నిరంతరం ఎరుకతో ఉంటే చాలు. బుద్ధిని,ప్రజ్ఞను పెంపొందించుకోవచ్చు కానీ, దానిపై సాధికారతను సంపాదించడం సమాజపరిధిలో ఎవ్వరికీ సాధ్యం
కాదు. కానీ ,ధర్మబద్ధంగా జీవించాలంటే నిత్య జీవితంలో నిరంతరం పరిసరాల పట్ల వాస్తవ
స్థితిగతుల పట్ల ఎరుకతో మసలుకోవాలి. దీనికి
ధైర్యం, పట్టుదలతో పాటూ విజ్ఞత కూడా
అవసరం. ఇది సమాజపరగా సాధ్యమే. మనం ‘సంఘమ శరణం గచ్చామి’ అని భిక్కు సంఘానికి మనసారాను
వేడుకుంటాము. కానీ భిక్కు సంఘంలో ఎవరు సోతాపన్నులో,ఎవరు సకదాగాములో,ఎవరు అనాగాములో
ఎవరు అర్హంతులో తెలుసుకోవడం సాధ్యం కాదు కదా ! .అది అవశ్యం కూడా కాదు. బుద్ధుని
బోధనలను సమాజానికి అందించడం ,తద్వారా సత్య
దర్శనానికి సహకరించడం వారి బాధ్యత. కానీ , ప్రస్తుత పరిస్థితులలో అది
భిక్కుసంఘానికి తలకు మించిన భారం. పైగా అది అన్ని వేళలా సాధ్యం కాదు. కాబట్టే ఉపాసికా,ఉపాసకులు వారి వారి పరిధులలో తమ
చుట్టూ ఉన్న సమాజానికి అనత్త,అనిత్య,దుక్ఖం యొక్క మౌలిక వాస్తవాలను, నిరంతర ఎరుకను
గుర్తుచేసే సామాజిక బాధ్యతను చేపట్టాలి.
మరి నిత్య జీవితంలో నిరంతరం ఎరుకతో ఉండడం ఎలా?
ప్రఖ్యాత బర్మా బౌద్ధ రచయిత
డాక్టర్ థిన్ తిన్ తన గ్రంధం “ The
Path OF Mindfulness In Daily Life ” లో ‘continuous
non judgmental observation of ever
changing objects....’ అని అంటూ రాస్తారు
. ఈ పుస్తకాన్ని ‘నిత్య జీవితంలో సజీవ ధ్యానం’ అని తెలుగులో బుద్దఘోషుడు గారు అనువదించారు. అనుక్షణం మార్పుకు లోనవుతున్న అంశాలను /వస్తువులను నిరంతరం
ద్రువీకరించాకుండా(తీర్పు ఇవ్వకుండా / విలువ నిర్ణయం చేయకుండా ) గమనించడమే ఎరుక
అంటే . బహుసా అనిత్యాన్ని అర్ధం చేసుకోవడానికి , ఎరుక అంటే ఏమిటో తెలుసుకోవడానికీ ఇంతకన్నా
సులభమైన నిర్వచనం దొరకదేమో.
ఓషో చెప్పిన కధ ; ధ్యానమంటే
మన ఆలోచనలపై దృష్టి నిలవడం, ఆ ఆలోచనల్ని పక్కన పెట్టడం. మన ఆలోచనల్ని పరిశీలించడం. కాని మనం ఆగమంటే ఆలోచనలు
ఆగుతున్నాయా? వాటి యిష్టం వచ్చినట్లు అవి లాగుతున్నాయా?
మనం వాటిపై అధికారం చెలాయిస్తున్నామా? మనపై అవి
అధికారం చెలాయిస్తున్నాయా?ఎప్పటికప్పుడు ఈ
విషయాలను మనం గమనించాలి.
ఒక శిష్యుడు గురువుగార్ని ఎన్నో ఏళ్ళు భక్తి శ్రద్ధలతో సేవించాడు. ఆ గురువు దగ్గర ఎన్నో మంత్రాలున్నాయని, మహుత్తులున్నాయని ఆ శిష్యుడు విన్నాడు. అతనికి తను ఏమనుకుంటే అది జరిగేలా గురువు నుంచి వరం పొందాలని కోరిక. అద్భుతాల్ని ఆవిష్కరించాలని అతని కాంక్ష. ఇట్లాంటి గొప్పవాడయిన గురువును మంచి చేసుకుంటే తన కోరిక తీరుతుందని పట్టుదలతో ఎన్నో ఏళ్ళ నుండీ గురువుకు సేవలు చేశాడు. కానీ తన కోరికను అడగాలనుకుని గురువు ఏమంటాడో అని ఎప్పుడూ సంశయిస్తూ వుండేవాడు. గురువు ఎప్పుడూ అతన్ని గమనిస్తూ ఉండేవాడు. ఏదో ప్రయోజనాన్ని ఆశించే అతను తన దగ్గరికి వచ్చినట్లు గురువు తెలుసుకున్నాడు. ఒక రోజు గురువుగారు శిష్యుణ్ణి చూసి, ‘‘నిన్ను గమనిస్తున్నాను. నువ్వు నా దగ్గరికి వచ్చిన రోజునుంచీ చూస్తున్నా. నీ మనసులో ఏదో ఉంది. నన్ను ఏదో అడగాలన్న ఆరాటం నీకుంది. కానీ అడగడానికి సంశయిస్తున్నావు. నేనేమీ అనుకోను. నాకు వీలయితే నీ కోరిక తీరుస్తాను. నిస్సంశయంగా నువ్వు అడగవచ్చు’’ అని భరోసా యిచ్చాడు. శిష్యుడు ఏళ్ళ కొద్దీ ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నాడు. ‘‘గురువుగారూ! నేను ఏది అనుకుంటే అది జరగాలని నాకు వరమివ్వండి. మీ దగ్గర ఎన్నో మంత్రతంత్రాలున్నాయని విన్నాను’’ అన్నాడు. గురువు ఇన్నాళ్ళూ ఇతను తనకు చేసిన శిష్యరికం వెనకఉన్న ఉద్దేశం ఇదా? అనుకున్నాడు. ఇన్నాళ్ళు చేసిన సేవలో ప్రయోజనం తప్ప ఏమీ లేదా అని విస్తుపోయాడు. ‘‘నువ్వు అనవసరంగా ఇన్ని సంవత్సరాలు వ్యర్థం చేశావు. కష్టపడ్డావు. కాలయాపన చేశావు. ఇంత చిన్న విషయాన్ని అడగడానికి సంశయించావు. నువ్వు వచ్చిన మొదటిరోజే అడిగివుంటే కూడా నీ కోరిక తీర్చేవాణ్ణి. ఇదెంతపని? నీకో మంత్రం చెబుతాను. శుభ్రంగా స్నానం చేసి పవిత్ర భావంతో కూచుని ‘బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి’’ అన్న ఈ మూడు వాక్యాల్ని ఐదుసార్లు చెప్పిన తరువాత నువ్వు ఏమి కావాలనుకుంటే అది జరుగుతుంది. నువ్వు గాల్లోకి ఎగరవచ్చు. ఏదికావాలంటే అది సృష్టించవచ్చు. నువ్వేది అనుకుంటే అది జరుగుతుంది. అయితే చిన్నషరతు. ఈ మంత్రాలు చెప్పేటప్పుడు కోతిని మాత్రం గుర్తు తెచ్చుకోవద్దు’’ అన్నాడు. గురువు రహస్యం తనకు బోధించినందుకు పరమ సంతోషపడి, అయినా మంత్రం పునశ్చరణ చేసేటప్పుడు కోతిని ఎందుకు గుర్తు తెచ్చుకుంటాను’’ అని నవ్వుకుని విజయం సాధించిన వాడుగా వెళ్ళిపోయాడు.
ఒక శిష్యుడు గురువుగార్ని ఎన్నో ఏళ్ళు భక్తి శ్రద్ధలతో సేవించాడు. ఆ గురువు దగ్గర ఎన్నో మంత్రాలున్నాయని, మహుత్తులున్నాయని ఆ శిష్యుడు విన్నాడు. అతనికి తను ఏమనుకుంటే అది జరిగేలా గురువు నుంచి వరం పొందాలని కోరిక. అద్భుతాల్ని ఆవిష్కరించాలని అతని కాంక్ష. ఇట్లాంటి గొప్పవాడయిన గురువును మంచి చేసుకుంటే తన కోరిక తీరుతుందని పట్టుదలతో ఎన్నో ఏళ్ళ నుండీ గురువుకు సేవలు చేశాడు. కానీ తన కోరికను అడగాలనుకుని గురువు ఏమంటాడో అని ఎప్పుడూ సంశయిస్తూ వుండేవాడు. గురువు ఎప్పుడూ అతన్ని గమనిస్తూ ఉండేవాడు. ఏదో ప్రయోజనాన్ని ఆశించే అతను తన దగ్గరికి వచ్చినట్లు గురువు తెలుసుకున్నాడు. ఒక రోజు గురువుగారు శిష్యుణ్ణి చూసి, ‘‘నిన్ను గమనిస్తున్నాను. నువ్వు నా దగ్గరికి వచ్చిన రోజునుంచీ చూస్తున్నా. నీ మనసులో ఏదో ఉంది. నన్ను ఏదో అడగాలన్న ఆరాటం నీకుంది. కానీ అడగడానికి సంశయిస్తున్నావు. నేనేమీ అనుకోను. నాకు వీలయితే నీ కోరిక తీరుస్తాను. నిస్సంశయంగా నువ్వు అడగవచ్చు’’ అని భరోసా యిచ్చాడు. శిష్యుడు ఏళ్ళ కొద్దీ ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నాడు. ‘‘గురువుగారూ! నేను ఏది అనుకుంటే అది జరగాలని నాకు వరమివ్వండి. మీ దగ్గర ఎన్నో మంత్రతంత్రాలున్నాయని విన్నాను’’ అన్నాడు. గురువు ఇన్నాళ్ళూ ఇతను తనకు చేసిన శిష్యరికం వెనకఉన్న ఉద్దేశం ఇదా? అనుకున్నాడు. ఇన్నాళ్ళు చేసిన సేవలో ప్రయోజనం తప్ప ఏమీ లేదా అని విస్తుపోయాడు. ‘‘నువ్వు అనవసరంగా ఇన్ని సంవత్సరాలు వ్యర్థం చేశావు. కష్టపడ్డావు. కాలయాపన చేశావు. ఇంత చిన్న విషయాన్ని అడగడానికి సంశయించావు. నువ్వు వచ్చిన మొదటిరోజే అడిగివుంటే కూడా నీ కోరిక తీర్చేవాణ్ణి. ఇదెంతపని? నీకో మంత్రం చెబుతాను. శుభ్రంగా స్నానం చేసి పవిత్ర భావంతో కూచుని ‘బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి’’ అన్న ఈ మూడు వాక్యాల్ని ఐదుసార్లు చెప్పిన తరువాత నువ్వు ఏమి కావాలనుకుంటే అది జరుగుతుంది. నువ్వు గాల్లోకి ఎగరవచ్చు. ఏదికావాలంటే అది సృష్టించవచ్చు. నువ్వేది అనుకుంటే అది జరుగుతుంది. అయితే చిన్నషరతు. ఈ మంత్రాలు చెప్పేటప్పుడు కోతిని మాత్రం గుర్తు తెచ్చుకోవద్దు’’ అన్నాడు. గురువు రహస్యం తనకు బోధించినందుకు పరమ సంతోషపడి, అయినా మంత్రం పునశ్చరణ చేసేటప్పుడు కోతిని ఎందుకు గుర్తు తెచ్చుకుంటాను’’ అని నవ్వుకుని విజయం సాధించిన వాడుగా వెళ్ళిపోయాడు.
ఇంటికి వెళ్ళి స్నానపానాలు
ముగించుకుని శ్రద్ధగా ఆసనం మీద కూచుని ‘‘బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం
శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి’’ అన్నాడు. ‘హమ్మయ్య ఒక్కసారి
పూర్తయింది. ఇక నాలుగు సార్లు పూర్తిచేస్తే ఈ ప్రపంచంలో నన్ను
మించిన వాడుండడు. నేను అనుకున్నదల్లా సాధిస్తాను. ఈ ప్రపంచాన్ని ఆడిస్తాను. అనుకుని
బుద్ధం శరణం గచ్ఛామి’ అన్నాడు. అంతలో మనసులో కోతిమెదిలింది. కిచకిచలాడింది.
మంత్రాన్ని ఆపి మనసులోకి చూశాడు. రకరకాల కోతులు, రంగురంగుల
కోతులు, ఎగురుతున్నాయి. గంతులేస్తున్నాయి. మనసును అదుపు
చెయ్యడానికి ప్రయత్నించాడు. నిశ్శబ్దంగా ఉండడానికి ప్రయత్నించాడు. మళ్ళీ
మొదటి నించీ ‘‘బుద్ధం శరణం...’’ అంటూ మొదలు పెట్టాడు.
కోతులు ఆకాశంనించీ మనసులోకి దూకినట్లు అనిపించింది. ఎన్నిసార్లు ప్రయత్నించినా
కోతుల్ని అదుపు చెయ్యలేకపోయాడు. చెమటలు పట్టాయి. శరీరం వణికిపోయింది. జ్వరం వచ్చింది.
పరిగెత్తుకుంటూ వెళ్ళి గురువు పాదాలపై పడి ‘గురువుగారు! బుద్ధి గడ్డి తిని దురాశతో, దుష్ట చింతనతో మిమ్మల్ని ఆ కోరిక కోరాను. నన్ను
మన్నించండి. నాకు ఆ వరమూ వద్దు. ఈ అశాంతి వద్దు. కోతుల బెడద
నుంచి నన్ను రక్షించండి’’అనివేడుకున్నాడు.
నిరంతరం
ఎరుకతో ఉండడం అంటే నిరంతరం వర్తమానంలో జీవించడమే. మనం అసలు మనుషులుగా జీవించాలంటే వర్తమానంలోనే జీవించాలి.
నిర్వాణానికి చేరువకావాలంటే అది వర్తమానమ్లోనే జరగాలి. సమతను ఆస్వాదించాలంటే
వర్తమానంలోనే నిన్ను నీవు నీలోనికి లోతుగా స్ప్రుశించు కోవాలి. వర్తమానం లోనే
అందమైన ప్రపంచం,అందమైన అనుభవాలు అందమైన మనుషులూ మనల్ని దాటుకు పోతూ ఉంటారు.
వర్తమానంలోనే నిర్వాణ మార్గంలో నడక
సాగించాలి ,అంటే వర్తమానంలో ధ్యానం
అన్నమాట. ఉదాహరణకు నడుస్తూ ధ్యానం చేయడం లేదా కారు నడుపుతూ ధ్యానం చేయడం లాంటివి
చేయాలి . ఆశ్చర్యంగా ఉందికదూ? Thich
Nhat Hanh ( తిచ్ నట్ హాన్) అనే
వియత్నామీ బౌద్ధ సన్యాసి ‘LINVING
IN THE PRESANT MOMENT’ అనే పుస్తకంలో ఈ విధంగా
వివరిస్తాడు. ‘ నీవు ఎప్పుడు ఏ పని చేస్తున్నావో ఆ పనినే ధ్యానించు,’ అంటాడు. అంటే
నడుస్తున్నప్పుడు నడక మీదే దృష్టి పెట్టడం, కూర్చుని ధ్యానం చేస్తున్నప్పుడు
ఉచ్చ్వాస నిశ్వాస (అనాపాన సతి ఎలా చేస్తామో అలా) లపై ఎలా ఎరుకతో ఉంటామో అలాగే
కాళ్ళ కదలికను, కండరాల సంకోచ,వ్యాకోచాలను,నేలను,చుట్టూ ఉన్న చెట్టూ చేమను గమనించడం
అన్నమాట. నడు స్తున్నప్పుడు మనం చేరే
గమ్యం మీదో , లేదా బయలుదేరిన చోట జరిగిన విషయాలమీద ఆలోచనలు కాకుండా, నడక మీదే ధ్యాస అన్న మాట. అలాగే కారు నడుపుతునప్పుడు
డ్రైవింగ్ మీదే ధ్యాస. స్టీరింగ్, రహదారి, ట్రాఫిక్ మీదే కాకుండా మన శరీర కదలికలను,వేగాన్ని
కూడా ధ్యానించాలి. వీటిపట్ల నిరంతర ఎరుక తో ఉండాలి . ఎందుకంటే అదే వర్తమానం. మనం
చేర బోయే గమ్యం గురించి ఆలోచించుకుంటూ, ఊహించుకుంటూ వర్తమానాన్ని విస్మరిస్తున్నాం
అన్నమాట. అదే పెద్ద పొరపాటు’ అంటాడు ఆ బౌద్ధ సన్యాసి. నడుస్తున్నాప్పుడు ధ్యానం, నిన్ను
నిర్వాణం వైపు నడిపిస్తుంది. ఎందుకంటే నీవు ఎరుకతో వర్తమానంలో జీవిస్తున్నావు
కాబట్టి . క్రొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అద్భుతమైన సెలయేళ్ళు , జలపాతాలూ
చూసినప్పుడు మనలని మనం మైమరచిపోయి ఎలా
పులకించి పోతామో గుర్తుతెచ్చుకోండి . అదే వర్తమానంలో ఉండే ఆనందం అంటే. ఆనందంగా
జీవించడమంటే .
‘నీవు దుఖంగా ఉన్నావంటే గతం గురించి
ఆలోచిస్తున్నావని - నీవు ఆందోళనగా, ఆత్రుతగా ఉన్నావంటే భవిష్యత్ గురించి
ఆలోచిస్తున్నావు, సంతోషంగా ఉన్నావంటే వర్తమానంలో
జీవిస్తున్నావని తెలుసుకో ‘ అంటాడు బుద్ధుడు. వర్తమానంలో ధ్యానించడం అంటే
మనం చేస్తున్నపనిని చేస్తున్నప్పుడు కేవల ఆపని గురించి ఆలోచిస్తూ చేయడం. మరొక
ఆసక్తి కరమైన ఉదాహరణ చూద్దాం. మద్యం సేవించడం,సిగరెట్టూ కాల్చడం మానవ బలహీనతలలో
ప్రధానమైనవి. బౌద్దులమనుకునే వారిలో కూడా కొంతమందిలో ఈ బలహీనతలకు లోనుకావడం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మద్యం
త్రాగుతున్నప్పుడు, సిగరెట్ త్రాగుతున్నప్పుడు ధ్యానం చేయడం అంటే ఏమిటి? మద్యం
సేవించేవారు దాని రంగు రుచి వాసనలను ఆస్వాదిస్తూ, దాని మత్తును అనుభవించడం
చేస్తుంటారు .కానీ మద్యాన్ని ధ్యానించడం
మరిచిపోతారు. మద్యం సేవించేవారు ఆ సమయంలోనే మద్యం వలన కలిగే అనర్ధాలు,అనారోగ్యాలు, వచ్చే
కుటుంబ, సామాజిక సమస్యలను కూడా ఆలోచించాలి. దాని ఖర్చు ,ఆర్ధిక ఇబ్బంది, కోల్పోయే
సమయం, పనిగంటలు ,ఇవన్నీ ఆ సమయంలోనే ఎరుకలోనికి రావాలి. అదే మద్యాన్ని ధ్యానించడం
అంటే. కానీ ఆ సమయాన్ని గతాన్ని పొగుడుతూనో లేదా తెగుడుతూనో భవిష్యత్ ప్రణాళిక
లతోనే గడిపేస్తాం. అంటే వర్తమానంలో జీవించం అన్న మాట. అదే దుక్ఖానికి హేతువు. అలాగే
ధూమపానం చేసేవారు పొగను గుండెలనిండా పీల్చుకునే ఊపిరితిత్తులలో కాసేపు ఉంచుకుని
వదులుతారు. ఆ కాసేపు శరీరంలో ఉన్న పొగ కలిగించే కేన్సర్ వంటి రోగాలను , పొగాకులో
నున్న విష పదార్ధాలను గురించి విస్మరిస్తారు. నిజ జీవితంలో పొగ
త్రాగుతున్నప్పుడు నిజాయితీగా ధ్యానిస్తే
పొగ త్రాగడం మానేస్తారని పరోశోధనలు తెలుపుతున్నాయి. మన శరీరంలో అన్ని భాగాలూ
విశ్రాంతి తీసుకుంటాయి, గుండె ఊపిరితిత్తులూ తప్ప. అవి నిరంతరం మనకోసం వర్తమానంలో
జీవిస్తూనే ఉంటాయి. మనలను ప్రాణాలతో
ఉంచుతాయి. వాటిని మనం అమితంగా ప్రేమిస్తాం. మరి వాటికి హాని కలిగించే పనులను
చేయడానికి మనకు మనసెలా వోప్పుతుంది? ముందుగా మన శరీర భాగాలను,అవయవాలను, గౌరవించి
ప్రేమించాలి. ప్రేమిస్తాం కూడా. మన అవయవాలను మనం ప్రేమించినప్పుడు వాటికి
దుఖ్హాన్ని,అనారోగ్యాన్ని కలిగించే విధంగా ఎలా ప్రవర్తిస్తాం ? మనలని మనం
ప్రేమించుకోలేనప్పుడు సమాజాన్ని ఎలా ప్రేమిస్తాం?అందుకే సంఘానికి పంచశీలాచరణ ,
నిరంతర ఎరుక ప్రధానం.
ఇక సమాజ స్థాయిలో మనల్ని మనం ఎంత
ప్రేమిస్తామో చుట్టూ ఉన్న సమాజాన్ని తద్వారా దేశాన్ని గౌరవిస్తాం, అంత ప్రేమిస్తాం.
మానవ సంబంధాలను , మానవ విలువల ప్రాముఖ్యతను ,భావోద్రేకాలను, పరిస్థితులను, వాటిప్రభావాలను
నిత్యం ధ్యానిస్తూ ఉంటే వాటి పర్యవసానాలు మనుకు గోచరిస్తూ ఉంటాయి. అప్పుడు వాటి
పట్ల సానుకూల దృక్పధంతో జీవించడానికి
ప్రయత్నించి నట్లయితే అత్యాశ, స్వార్ధము లాంటి అకుశల ఆలోచనలు దూరం అవుతాయి. జీవిస్తున్న
పరిసరాలు, కుటుంబం ఇరుగు పొరుగు, బంధు మిత్రుల సంబంధాలు పరస్పరాధారితాలని
గుర్తుంచుకోవాలి. ఒకదానికొకటి, ఒకరిమీద ఒకరు
నైతికంగా ఆధారపడి ఉంటారని గమనించాలి. దీనికోసమే ఎరుక అవసరం. వర్తమానం లో
జీవించడం అవసరం. అందుకే నిత్య జీవితంలో ధ్యానం అవసరం. ఒకరికొకరు ప్రక్కవారికి
మార్గాదర్శకులుగా ఉండేందుకు ప్రయత్నించాలి.
ప్రతి
ఒక్కరూ ప్రకృతి ,మానవ సమాజం పట్ల తమ తమ సామాజిక పరిధిని, స్థాయిని అంగీకరిస్తూ
సామరస్య సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పడానికి ఉత్సాహం చూపాలి. ఇదే విషయాన్ని
కన్ఫ్యుషియస్ మాటల్లో చెప్పాలంటే ‘దేశ ప్రజలు నైతికత పెంపొందించుకుంటూ ,వారి
కుటుంబాలను అదుపులో ఉంచుకోవాలి. వారి కుటుంబాలు ఆవిధంగా సంయమనంతో మెలిగినట్లయితే ఆ
దేశాలు ధర్మబద్ధంగా పాలించబడతాయి. దేశాలు ధర్మపాలనలో ఉంటే రాజ్యాలు సుభిక్షంగా
సుఖసంతోషాలతో వెలసిల్లుతాయి’. అశోకుని పాలనా వ్యవస్థ కూడా దాదాపు ఇదే నైతిక
సిద్దాంతం మీద నడిచింది. నేటి సమాజానికి అన్వయించాల్సివస్తే పంచశీల పాటిస్తూ,పనికి
రాని వ్యర్ధపు పలకరింతలు, వెగటు మాటలు,
అనవసర ఆర్భాటాలు,అధిక ప్రసంగాలు చులకన ధోరణులు అబద్ధపు ప్రచారాలకు దూరంగా
ఉండడానికి ప్రయత్నించాలి, అంటే ముఖ్యం ‘మూసావాదా.....’ పాటించాలి. ఎదుటివారిని
వారి అనుభవాన్ని వారి స్థాయిని గౌరవించాలి. ఎప్పటికప్పుడు ఎదుటివారికి
సహాయపడడానికి సిద్దంగా ఉండాలి. వ్యక్తిత్వం అవసరమేగానీ వ్యక్తిగతం అనే భావన
ఉండకూడదు. మానవ శాస్త్ర నిపుణుడు బ్రియాన్ మొరన్ ప్రకారం వ్యక్తిత్వం అనేది వ్యక్తీ
యొక్క మానసిక నైతిక ఉనికి, వ్యకిగతమనేది ఒక స్వార్ధ రాజకీయతత్వం.
బుద్ధుడు చెప్పిట్లు మనిషి కి మానసిక సంసిద్దత(mental conditioning ) ఎంత అవసరమో ,సామాజిక సంసిద్దత (social conditioning )కూడా
అంతే అవసరం. సామాజిక సంసిద్దత అంటే అన్ని రంగాలలోనూ సహకారము, విజ్ఞత ,సహనశీలతతో వ్యవహరించడం.
దీనికి మానసిక పరిపక్వత అవసరం. అది నిత్యం ధ్యానంతోనే సాధ్యం. సమాజాల సమూహాల్లో ఇతరలకూ, బౌద్దులకూ ఉండాల్సిన ప్రధాన వ్యత్యాసం వారి
కోర్ వాల్యూస్(మౌలిక విలువలు ). పరోపకారం, భాధ్యతలను స్వీకరించడం, అందరినీ
ఆదరించడం, పలకరించడం లాంటివే కాకుండా ఎదుటి వారిని కించపరచడం,అవమానించడం లాంటి
దుర్గుణాలకు దూరంగా ఉండడం.అన్నిటి కంటే ముఖ్యమైనవి త్రిసరణ,పంచశీల, అరియ అష్టాంగ
మార్గ జీవనం, బ్రహ్మవిహారాలపట్ల నిరంతర చింతన. వీటన్నిటినీ మనం నిరంతరం
ధ్యానించాలి. వీటన్నిటిపట్ల నిత్యం ఎరుకతో ఉండాలి . ఇదే నిత్య జీవితంలో ధ్యానం అంటే.
వియాత్నం
దేశానికి చెందిన జెన్ బుద్ధిస్ట్ సన్యాసి తిచ్ నట్ హాన్ బుద్ధత్వపు సూత్రాలను విశ్వవ్యాప్తం
చేయడానికి 1960 లో "School of Youth
for SocialServices (SYSS)" స్థాపించిన ఈ " విశ్వశాంతి
కార్యకర్త".. రచించిన " Cultivating the Mind of Love " గ్రంథం
ద్వారా సంఘానికి కొన్ని హితకరమైన సూచనలు చేసాడు .
"ధర్మబద్ధంగా
జీవితాలను గడపాలి" అన్న మన ఉత్కృష్టభావన ఒక
"విత్తనం". అయితే మన కుటుంబం, మిత్రులు, సహోద్యోగుల
యొక్క సమూహంతో కూడిన సంఘం, ఆ విత్తనం మొలకెత్తడానికి కావలసిన "క్షేత్రం"
అవుతుంది !
విత్తనం ఎంత శుద్ధమైనదైనా,మరి
ఎంత నాణ్యమైనదైనా సారవంతమైన
క్షేత్రం గనుక దానికి అందుబాటులో లేకపోతే ఆ విత్తనానికి మనుగడ లేనట్లే, మన చుట్టూ
"మంచి సంఘం లేదా సమాజం" అన్నది లేకపోతే మనం ఎంతటి ధర్మవర్తనులమైనా సరే
సంతోషంగా ఉండలేము.
కాబట్టి
ప్రతిఒక్క బౌద్ధుని యొక్క మౌలిక బాధ్యత తన చుట్టూ ఒకానొక చక్కటి "ధర్మబద్ధమైన
సంఘం" ను నిర్మించే ప్రయత్నాన్ని వెంటనే మొదలు పెట్టడడం !
చాలామంది
ప్రక్కవాడితో మాట్లాడకుండా తమను తాము ఒక గదిలో బంధించుకుని
.. తమకు తాము పరిమిత పరిధులను ఏర్పరచుకుని .. "అదే ఆధ్యాత్మికత" అనుకుంటుంటారు
కానీ.. అది శుద్ధ పొరపాటు !
సంఘజీవి అయిన
మనిషి .. తనను తాను ప్రేమించుకుంటూ, తనతో తానూ
సత్సంబంధాలను నెరపుకుంటూ మరి ఇతరులతో కూడా అదే విధమైన సామరస్య పూర్వకమైన సంబంధాలను
ఏర్పరచుకోవాలి. అదే "ఆధ్యాత్మికత ". అలాంటి జీవితమే,ఆదర్శవంతమైన "ఆధ్యాత్మిక
జీవితం". అయితే అలాంటి అద్భుతమైన జీవితాన్ని మనం ఏర్పరచుకోవడానికి ముందుగా
మనం చెయ్యాల్సింది "ఆధ్యాత్మిక సాధకులతో కూడిన ఒక స్నేహబృందాన్ని" ఏర్పరచుకోవడం.
అలాంటి " మైత్రి తో కూడిన సంఘం
" తో కలిసి మనం తిరిగినా చాలు, ప్రతి క్షణం ఎరుకతో కూడిన
ఆనందంతో మనం జీవించగలుగుతాం ! ఇలా జాగరూకత కలిగిన జీవితంతో పాటు మన బోధిచిత్తానికి, మనం
నిరంతరం చక్కటి పోషణను అందిస్తుంటేనే అది పరిపుష్టతతో విలసిల్లుతూ, విలువలతో కూడిన
శాంతియుత సమాజాలను,రూపొందించడంలో,మనకు-సహాయంచేస్తుంది.
.............................................................................................................................
No comments:
Post a Comment