విశ్వ యాత్ర
ఆ మెదడు వేసే గణాంకాలకు అతని శరీర కణాలు
తట్టుకోలేకపోయాయి
మృత్యువు సైతం వాయిదాలతో వేనుకడుగేయక
తప్పలేదు
అనిత్యాన్ని అసంపూర్ణాన్ని మొత్తంగా అర్ధం
చేసుకున్న ఒక ఆలోచన
సాపేక్షతనూ , క్వాంటం
థియరీ నీ అంతరిక్షంతో అను సంధానం చేసింది
రేపటి ప్రయాణాన్ని నిన్నేనే మొదలుపెట్టి
ఎల్లుండిలో ముగించేందుకు
శాస్త్రీయ ప్రపంచానికి క్రొత్త జీవనాడిని
నిర్వచించి ప్రసాదించేందుకు
భూమి మీద సౌరతుఫానుగా వెలసి గ్రహాలను
అనుసరించాడు
చక్రాలకుర్చి చేసిన విశ్వ యాత్ర అది , కాంతి కాలం రాసిన దీర్ఘ చరిత్ర అది
శారీరక బలహీనతే అద్వితీయ మానసిక బలమైనప్పుడు
గాల్లో వేళ్ళు కదిలిస్తూ గ్రహాలతో పాప్ బీట్స్ పాడతాడు .
కాలాన్ని ప్రతిపాదనల కలంతో ముందుకూ వెనక్కి
ఆడించిన మాత్రికుడు
విశ్వంతో పోటీ పడి కనిపించనంత ముందుకు దూసుకు
పోతూ ఉండడం చూసి
నల్ల బిళం అలిగి చిన్న బోయింది
నీకన్నా
ఈ విశ్వం పెద్ద గొప్పదేమీ కాదని
ప్రకటించింది ,
దైవత్వపు జోక్యాన్ని నిలదీసిన నీకూ , నీ
సింగ్యులారిటీ కీ
ప్రపంచ గళం నోబుల్ మించిన నివాళితో శ్రద్దాంజలి
ఘటించింది .
డాక్టర్ మాటూరి శ్రీనివాస్ (15-03-18 )
No comments:
Post a Comment