కుంకుమ పువ్వు
డాక్టర్ మాటూరి శ్రీనివాస్
మంచు కొండల్లో మూలల్లోంచి మెరుస్తున్న సింధూరం
నేటికీ రక్తపు ఎరుపుతో పోటీ పడుతూనే ఉంది
గెలుపో వోటమో నిర్ణయించాల్సింది కాలం కాదు మతం
అని తెలిసాక
ఇక వికసించడం తన చేతుల్లో లేదనే సత్యాన్ని చల్లగా
రోధిస్తూ
దుఖంగా మార్చుకుందా శిశిర అందాల లోయ
కంచే మేసిన ఆపిల్ తోటను తెంచేందుకు రామ బాణం
బలౌతున్నది శంభూకుడో, వాలో కాషాయమే జవాబుదారీ
చట్టాలిప్పుడు బిల్లుల చిల్లులతో
తల్లడిల్లిపోతున్నాయి
ప్రజాస్వామ్యపు పళ్ళూడగొట్టి నాలిక్కోసి నంగానాసికోళ్ళు
కబుర్లోలక బోస్తున్నాయి
ఒకరికి కాళ్ళకింద నేల కంపిస్తుందట ఉనికి
ప్రస్నార్ధకమై
ఒకరికి సిగలో కిరీటం మెరుస్తుందట అధికారం
అహంభావమై
ఒకరికి పక్కలో బల్లెం బిగుస్తుందట హద్దుల
మతోన్మాదమై
ఒకరికి అఖండం కనిపిస్తుందట ఆక్రమణల పర్వమై
ఒకరికి ఒకే జెండా ఒకే స్మృతి ఒకే రాజ్యం కావాలట
ఒకే కులం ఒకే న్యాయం ఒకే నీతి పాటించరెందుకు?
ఇది సామ్రాజ్యవాదమా? సామ్రాజ్య విస్తరణమా ?
నా ఇంటిలో నేనే అలుసైపోయే సందర్భం ఆకలైతే ఆపిల్
ముక్క కూడా లేదు.
బిడ్డకు పాలకు సింధూరప్పొడి కాదు పాలపోడే లేదు
నిలువ నీడా కూడా ఆకులపాటే వ్యాకుల ఆటే
నేనెక్కడికి పోవాలి.??
నాకు తెలుసు నీ చూపుడు వేలు ఆటే చూపుతుందని ...
వేళ్ళను గురుదక్షిణ అడుక్కుని ప్రతిభను
హత్యను చేసిన హంతక జాతి వారసుడా..!
ఈ నేలా ఈ గాలీ ఈ నీరు ఈ లోయ నీదైనప్పుడు
నాది కాకుండా ఎలా పోతుంది ?!
నీది హిందూ దేశభక్తి అయితే మరి నాదేమిటి ,
ఇక్కడ పరుచుకున్న నీడలోనర్ కాసు మంచు రేణువు
జాడలో సైతం నేనున్నాను
అయినా నాకు ఎల్లలు తో పని లేదు,
నా ఉనికకే నా జీవితం నా ఆరాటమంతా అని తెలుసుకుంటే చాలు ...
09-08-19
No comments:
Post a Comment