వర్తమానం
డాక్టర్
మాటూరి శ్రీనివాస్
కోరికలు అలలై ప్రశాంత కడలి ని అల్లకల్లోలం
చేస్తాయి
దుఃఖం సముద్ర గర్భంలోంచి సునామీగా ఉద్భవిస్తుంది
చెల్లా చెదురైన జ్ఞాపకాల శిలాఫలకాలు అస్పష్టంగానే
అయినా
నిన్ను నిన్నలోనికి క్రియాశూన్యుడిని చేసి లాక్కు
పోతాయి
అనాలోచిత ఆలోచనలు గాలిలో కట్టిన పేకమేడలు
నిన్ను రేపటి సుడిగాలి లోనికి నెట్టేస్తూ
కూల్చేస్తూ ఉంటాయి
ఇక బ్రతుకంతా నిన్న రేపటి మధ్య ఊగే తూగుడు బల్లే
ఎటో ఒక వైపుకే మొగ్గుతూ నిన్ను మొగ్గులోనికి
దింపేస్తుంది
ఇక జీవితమంతా ఏక పక్షాన సాగే తీర్పుల వలయం
నిన్నా రేపుల మధ్య వేలాడుతున్న ఝాంఝాటాల జంజీరం
అంతర్ బహిర్ సంశయ గీతాల డోలాయమాన హిందోలకం
ఇక నీ కోమల దేహధారణ కరుణతో ఉజ్జీవించేదెప్పుడో
ఇక నీ మనోరధంలో వొప్పుదలతో సౌహార్ధత సంభవించే
దెప్పుడో
ఇక కుశల చేతనలు ప్రియముగా నిర్వహించే ఉచిత
కాలమెప్పుడో
ఇక అకుశలతను పూచికగా సన్యసించే శుభ తరుణ మెప్పుడో
ఇక మరణ కాంక్షకు మనస్పూర్తి మధుర ఆహ్వానమెప్పుడో
ఈ క్షణాన ఈ జగాన మరి నీవు మనగలిగిందెప్పుడో ???
No comments:
Post a Comment