Friday, 10 April 2020

బంగారం


బంగారం
                            డాక్టర్ మాటూరి శ్రీనివాస్

పసిడి మెరుపులా నిత్య సింగారం,
రాజు –పేదల కుల ,కొల మానపు అగాధం.
పెట్టుబడుల విపణిలో  అంబర శాసనం .
కారేట్టు కో  రేటుతో  జీవన ప్రమాణాల చాటు మాటు  వేటు.
రంకేలసే దున్న పై ఎగబ్రాకు తున్న మార్కెట్టు.
మభ్యపెట్టి మోసగించు ,
తిదియ నమ్మకాల  అమ్మకాల మూల  విరాట్టు.
దొంగ రవాణాల  నీటైన అంతర్జాతీయ గేటు ,
కోట్లకు పడగెత్తిన ‘షో’ రూమ్లకు  లేదేదీ ధీటు
 ‘గ్లోబలైజేషన్’ ... దీని నేమ్ ప్లేటు .

నల్ల బంగారం,నాణ్యమై, కుదిరితే
ధగ ధగల కొంగ్రొత్త కోహినూర్ అందం.
లేదా , మాడి  మసై పోవాల్సిన నాసిరకం రాక్షసి.
వోబులపుర రాజాల రత్నాల గని. గాలి తీసి జైలు పాల్జేసే కఠిన దేవేరి.
నల్ల సామ్రాజ్యనికి ఆలంబనా అవని
ముడిసరుకుగా ముప్పు తిప్పలెట్టే
మురికి మాఫియాల మనసైన మల్లె .
దోచుకున్న వాడు , దోచుకున్నంత
దాచుకున్నవాడికి దాచుకున్నంత
దానికి ‘నేషన్’ ఇచ్చిన  ముద్దు పేరే,  ‘ప్రైవేటైజేషన్’.

మాదిప్పుడు  బరువున్నబలమైన  మాట
నోట్ల కట్టలు  రక్తాన్ని పూసుకుని  రెపరెపలాడుతూ
అడవుల్లో ఆకులతో పందేలు కాస్తున్నాయి.
ఎర్ర బంగారంతో తులాభారం వేస్తున్నాయి.
పాలక ,పోలీసులు నాయికా నాయుకులై
చెట్టూ పుట్టల వానక దోబూచులాడుతూ
వాన పాటలు పాడుతున్నారు.. ఎర్ర వనంలో రక్త చందనం’  కోసం
కూలీల ప్రాణాలుపై  పోలీసు తూటాలతో  సంతకాల చిత్రీకరణ పూర్తి అయ్యింది.
వీరు  ‘లిబరల్’ గ తీసుకునే ‘రెమ్యూనరేషనే ’ , ‘లిబరలైజేషన్’ .
--------------------





No comments:

Post a Comment