Friday, 10 April 2020

మేలుకో మూల వాసి


              మేలుకో.....మూలవాసి....                    రచన  డాక్టర్ మాటూరి శ్రీనివాస్ (28-12-19)
పల్లవి ;        మేలుకో మూలవాసి మేలుకో   (2)
                కనులు తెరచి దేశాన్ని ఏలుకో
                మేలుకో ఆదివాసి మేలుకో     (2)
               ఈ భూమీ నీదేనని  తెలుసుకో    
1 చరణం.   నవ భారత రాజ్యాంగం ఆయుధం
              నవజీవన సౌభాగ్యపు స్వాగతం
              సమభావన సాధనకై సంరంభం
              సంవిధాన సంగీతమే జీవనం  ....    -మేలుకో ‘-
2.చరణం.  బహుజనలకు అధికారమే నినాదం
             ద్విజత్వాన్ని కుటిలాన్ని నిలదీద్దాం  
             అహంభావ మనువునూ ఎదిరిద్దాం
            పురుష సూక్త పాఠమునే ప్రశ్నిద్దాం  .... –మేలుకో –
3.చరణం.     ఉద్యమమే ఊపిరిగా పయనిద్దాం
                సద్భావన సమరతను పోషిద్దాం
               నలుగురిని నవ్యరీతి నడిపిద్దాం
               యువజనోద్యమ  భవ్య గీతి స్వరమౌదాం
              బహునోద్యమ నవ్య రీతికి బలమౌదాం    - ..మేలుకో-,,,,



No comments:

Post a Comment