అపర బుద్ధుడు
డాక్టర్ మాటూరి
శ్రీనివాస్
వెలివాడలో
వెలిసిన వెతల కత చెలికాడు
జ్ఞానధీమంతుడు,కులమతాలు
చేధించిన కరుకు విలుకాడు
ప్రతిభ
చిరునామా, అసమానలకు జరిమానా
ఒక్క
తీరుగ అవమానపు ఆటు పోట్లు
అలలరీతిగ
ముంచెత్తినా , నిరంతరం నియతితో నిల్చినాడు.
స్వాభిమాన
సింధువై, అభినవ తధాగతుండై .
మతముల
ముసుగులోని లొసుగుల రట్టుచేసి
గుణము
లేని కులము, గతము మరిచిన జనము
వ్యర్ధమని
తలచి, జాతి జాగృతి కొరకు
మను
లిఖిత మర్మాలను మంట గలిపాడు
మసి పూత
రాతల పునాదులే పెకలించాడు,
సమత
మమతల మూర్తియై , గుణాధినేతయై .
బాల్యంలోనే
బోధిచిత్తం బీజమై మొలిచింది
రాజ్యంగవృక్షమై
మానవత వేర్లను మట్టిలో జొప్పించి
బౌద్ధ
నీడలోనే భవిష్యత్ అని మరపించి
విముక్త్యోన్ములను
చేసి గమ్యోన్ముఖగ నడిపినాడు
బహుజనహిత కాంక్షు డై , భోదిసత్వుచరితుండై .
పొరలు బారిన వివక్షతలపై సవాలులే చేసి
సన్నాయినొక్కుళ్ళ సనాతనుల గుండెల్లో
కలాన్ని గుచ్చి
నాగులవాసం నాగపూరులో నవయానానికి పునాది వేసి
అనాది ఆంక్షల చెరలను కూల్చి, పంచశీలతో,దమ్మప్రతినతో
సాంస్కృతిక విప్లవ
సంరంభాన్ని, ఆదిభారత విఖ్యాతాన్ని
దీక్షాభూమియే సాక్షీ భువిగా అనంత కీర్తి
విరాజమానమౌ
పీడిత హృదయ మందిరం స్వాభిమానపు శిఖరమై వెలిసావు
సమతా సామ్రాజ్య
పట్టభిషక్తుడవై, అపర బుద్ధుడ వై.
No comments:
Post a Comment