సమ్మోదము
గులాబీలకు ఎవరైనా గులాములవ్వాల్సిందే కదా !,
ఏ రంగులో పూసినా ఆ అందాన్ని ఎంతగా గౌరవిస్తాము
ఎంతగా ఆ సుకుమారత్వాన్ని ఆస్వాదిస్తామో
రకరకాల మనుషులను కూడా అలానే ఎందుకు చూడ లేకపోతున్నాము
?
ఒక్కొక్కరూ ఒక్కో తెలియనితనాన్ని
గుభాలిస్తూ ఉంటారని ఎందుకు ఆశించ లేకపోతున్నాము?
ద్వేషించడానికి
కారణం ఉండాలేమో,’
మానవ పరిమళాన్ని ఆస్వాదించడానికి అక్కర్లేదు
నిద్రావస్థ లోనున్న ప్రేమతత్వాన్ని మేల్కొలిపితే చాలు
కనిపించే ముళ్ళు గుచ్చుకుంటాయని తెలుసు
అయితేనేం రోజాలని రోజూ ఆస్వాదించడం లేదూ!
కనిపించనివన్నీ చిక్కు ముళ్ళేనని ఎందుకు
భావించాలి?
మానస సరోవరాలు ఎందుకు కాకూడదూ?
పూలకు కూడా సొట్టదీ గుడ్డిదీ అని పేర్లు పెట్టే
నైజాన్ని
ఎప్పుడు ఉదల్చుకుంటామో
అప్పుడు
సహజంగానే మానవతా మంజరిగా గుభాళిస్తాము ....
డాక్టర్ మాటూరి శ్రీనివాస్ .
No comments:
Post a Comment